విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య ఒకరోజు అల్లరికృష్ణయ్య ఎక్కడా కనుపించడంలేదు. మళ్ళీ ఏమి తగాదాలు, గొడవలు తీసుకోస్తాడోనని హడలిపోతూ యశోదమ్మ బాలకృష్ణునికై వెదకింది. కృష్ణయ్య అలా మోచేతిపై తలవాల్చి పడుకుని వుండగా రహస్యంగా తల్లి తొంగి చూచింది. నిద్రలో ఉన్నాడు నల్లనయ్య. నోరు కొంచెం తెరుచుకుని ఉంది. ఆనోట్లో సర్వలోకాలు..సూర్య చంద్రులూ, గ్రహసంతతీ కనిపించాయి. యశోదమ్మ హడలిపోయింది. అప్రయత్నంగా చేతులు జోడించి నిలబడింది. అంతలో క్రిష్ణయ్య లేవనే లేచాడు. “అమ్మా!” అన్నాడు. అన్నమయ్య ఇలాంటి జనశృతులను అధారం చేసుకొని […]
Month: September 2017
అంతర్వాణి – సమీక్ష
సమీక్ష: నండూరి సుందరీ నాగమణి ‘అంతర్వాణి’ – శ్రీ కొసరాజు కృష్ణప్రసాద్ గారి కవితాసంపుటి పేరుకు తగినట్టే స్వగతంగా వ్రాసుకున్న కవితలతో కొనసాగుతుంది. చక్కని పద ప్రవాహంతో, లయతో సాగిన ఈ కవితలు అన్నీ విభిన్న కవితావస్తువులతో అలరించాయి. ‘మాతా పిత: నమామి’ అంటూ అమ్మానాన్నల తలచుకొంటూ, వారికి ప్రణామములు అర్పిస్తూ మొదలైన కవితా వాహిని, ఆద్యంతమూ చదువరుల మనసును ఆకట్టుకునే విధంగా కొనసాగింది. ‘వ్రాసితిని వ్రాసితిని’ అనే కవితలో తన కవితకు స్ఫూర్తి దాయకులైన కవులను […]
కాఫీ విత్ కామేశ్వరి – సమీక్ష
రచన: నండూరి సుందరీ నాగమణి కం. కామేశ్వరితో కాఫీ ఆమే చెప్పెను కబుర్ల నలవోకనిదే గోముగ విహరించగనే తామిక రండి, ముదమున తనివిని పొందన్! ‘కాఫీ విత్ కామేశ్వరి’ – అండ్ కబుర్లు… అదేనండీ, కామేశ్వరితో కాఫీ మరియు తను కమ్మగా చెప్పే కబుర్లు అన్న మాట! రోజుకో చక్కని అంశం తీసుకుని, వేడి వేడి ఆనంద్ సినిమాలాంటి కాఫీని తా(లా)గిస్తూ తన కబుర్లతో ఎక్కడెక్కడికో తీసుకుపోయి మళ్ళీ తీసుకువచ్చేస్తుంది కామేశ్వరి… ఒకటా రెండా, డెబ్భై ఏడు […]
కొత్త కథలు – సమీక్ష
రచన: ఎమ్మెస్వీ గంగరాజు అలనాటి మేటి తారకలు, శాంతా రంగస్వామి, పూర్ణిమా రావు, అంజుమ్ చోప్రా, డయానా ఇడుల్జీ మొదలగు వారూ, ఈనాటి తారకలు మిథాలీ, దీప్తీ, మంధానా, హర్పీత్, జూలన్ మొదలగు వారూ కలసి అద్భుతంగా ఆడుతూ అలరిస్తున్న క్రికెట్ మాచ్ ని వీక్షిస్తూంటే కలిగే అనుభూతి లాంటిదే, నిన్నా. మొన్నటి మేటి రచయిత్రులూ, నేటి వర్ధమాన రచయిత్రుల కలాల నుండి జాలువారిన ఈ 33 “కొత్త కథలు” కదంబాన్ని అవధరించడంలో కలుగుతుంది అని చెప్పక […]
చిరు చిరు మొగ్గల
రచన: రావూరు సత్యనారాయణ రాధ: చిరుచిరు మొగ్గల చిలిపి తెరలలో చిటికెలు వేయుచు, చిలిపిగ నవ్వుచు వడివడిగ వచ్చెను వసంతరాగం ఎవరికోసమో సుమభోగం! కృష్ణ: పిలపిలగాలులు పుప్పొడి దూగ ఈలలు వేయుచు ఎదలను దూయుచు ఆమని రాత్రుల యామిని రాగా ఎవరికోసమీ అనురాగం! రాధ: ఎవరికోసమీ సుమభోగం! కృష్ణ: ఈ అనురాగం – ఈ సుమభోగం! రాధ: పూలతోటలో – కాలిబాటలో మురిపించెడి నీ మురళి పాటలో తూగిన నా యెద – ఊయలలూగగ ఎన్నినాళ్లనీ సహయోగం […]
21-వ శతాబ్దంలో వికటకవి – 2
రచన: కిభశ్రీ (శ్రీనివాస భరద్వాజ కిశోర్) 21వ శతాబ్దంలో పుట్టిన రామకృష్ణ కవి, హైస్కూలులో నరసింహారావు మాస్టారి తెలుగు క్లాసులో మత్తకోకిల ఛందస్సు నేర్పి, మరుసటిరోజుకు ఒక పద్యం వ్రాసుకుని రమ్మన్నారు. మధ్యాహ్నం తెలుగు నాన్డీటెయిల్ క్లాసు. మహా బోరు కొడుతున్న ఆ క్లాసులోకి వెళ్ళేముందు సరదాగా ఈ కింది మత్తకోకిల పద్యం వ్రాసుకుని తన మితృనికి అభినయంతో సహా చదివి వినిపించి ఇద్దరూ పగలబడి నవ్వుకున్నారు. నత్తలా నడిచేటి బోరగు నాన్డిటేయిలు క్లాసులో మత్తుయెక్కదె నిద్ర […]
యక్ష ప్రశ్నలు
రచన: అంబడిపూడి శ్యామసుందరరావు. సాధారణముగా జవాబు చెప్పటానికి ఇబ్బందికరమైన ప్రశ్నలు ఎవరైనా వేస్తుంటే మనము “వీడి యక్ష ప్రశ్నలకు జవాబులు చెప్పటం కష్టము” లేదా యక్ష ప్రశ్నలతో విసిగిస్తున్నాడు” అని అంటాము అసలు ఈ యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎవరు ఎవరిని అడిగారు వాటికి సమాధానాలు ఏమిటి? అనే విషయము గురించి క్లుప్తముగా తెలుసుకుందాము. దేవలోకములో ఉండే వారిని గంధర్వులు యక్షులు అని అంటారు. అటువంటి ఒక యక్షుడు అరణ్యవాసము చేస్తున్న పాండవులను ముఖ్యముగా ధర్మరాజును […]
అతను-ఇతను
రచన: భమిడిపాటి స్వరాజ్య నాగరాజారావు. అతను తనకు పెళ్లి అయినాసరే, అమ్మకొంగును వదలలేని బిడ్డ. ఇతను తనబిడ్డల పెళ్ళిళ్ళు అయినా సరే భార్యపొందును వదలలేని భర్త. ఆబిడ్డకు అమ్మే దైవం,ఆమె మాటే వేదం, అతని దృష్టిలో భార్యంటే మనిషే కాదు. ఈభర్తకు భార్యే లోకం,ఆమె చెంతే స్వర్గం, ఇతని దృష్టిలో అమ్మంటే మనిషే కాదు. అతనికి భార్యంటే అలక్ష్యం,ఇతనికి అమ్మంటే నిర్లక్ష్యం. అతనికి అమ్మంటే అన్నపూర్ణాదేవి,ఇతనికి భార్యంటే రతీదేవి. అతనికి అమ్మచేతిలో తన సంపాదన పెట్టటం, ఆమె […]
జైన మతము
రచన: శారదా ప్రసాద్ క్రీ. పూ. 6వ శతాబ్దంలో భారతదేశంలో అనేక మతాలు ఆవిర్భవించాయి. వీటిలో ముఖ్యమైనవి జైనమతం, బౌద్ధమతం. ఈ రెండు మతాలు భారతదేశ సంస్కృతిని గణనీయంగా ప్రభావితం చేశాయి. ముఖ్యంగా బౌద్ధం చైనా, జపాన్ లాంటి దేశాల్లో ఇప్పటికీ గొప్ప ఆదరణ పొందుతోంది. జైనమతం చాలా పురాతన కాలం నుంచి ఉందని తెలుస్తోంది. ఋగ్వేద మంత్రాల్లో జైన మత స్థాపకులైన మొదటి తీర్థంకరుడైన వృషభనాథుని గురించి స్పష్టమైన ప్రస్తావన ఉంది. జైన మతంలో 24 […]
భాషను ప్రేమించరా!
రచన: నాగులవంచ వసంతరావు భాషను ప్రేమించరా బతుకును పండించరా బాష నేర్చుకుంటే నీ బతుకే బంగారురా! భాషే మన మెతుకురా భాషే మన బతుకురా భాష రాకపోతే మన బతుకే ఆగమ్మురా మాతృభాష మాధుర్యం మదినిండా నింపరా హృదిలోని భావాలను అలవోకగ తెలుపరా వృత్తియందు మెప్పు పొంద భాష కీలకమ్మురా భాషతోటి ‘బాసు’ మనసు బాగ దోయవచ్చురా! ఉద్యోగం వ్యాపారం వృత్తి ఏదైనగాని భాషయందు ప్రావీణ్యత బాగ ఉపకరించురా మదిలోని భావనలు మనసునిండ ముసురుతుంటె బహిర్గత పరచుటకు […]
ఇటీవలి వ్యాఖ్యలు