March 28, 2024

మాయానగరం – 41

రచన: భువనచంద్ర ‘గురువు’ గారి అడ్డ మహా గంభీరంగా వుంది. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళతో చిన్న సైజు తీర్ధంలా వుంది. పార్టీ సామాన్య కార్యకర్తల నుంచీ, పార్టీ అధ్యక్షుడి దాకా, చిన్న చిన్న ఫేవర్స్ కోసం పడిగాపులు గాచే నిరుపేదవాడి నుంచి కేంద్రమంత్రివర్యుల దాకా వచ్చిపోతూనే వున్నారు. కారణం ఏమైనా’ప్రెస్’ వాళ్ళకీ,’ఛానల్’ వాళ్ళకీ పండగ్గా వుంది. “మాదేముంది గురూ, పైన పటారం లోన లొటారం.. ఉత్త డొల్ల.. ఏదో ఈ కార్డుని పట్టుకొని తిరగడం కానీ, మా యాజమాన్యం […]

బ్రహ్మలిఖితం 13

రచన: మన్నెం శారద అర్ధరాత్రి దాటింది. ఈశ్వరికెంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు. పదే పదే వెంకట్ రూపం కళ్ళలో కవ్విస్తూ కనబడుతోంది. అతనే తన భర్తన్న భావన ఆమె మస్తిష్కంలో క్షణక్షణం బలపడసాగింది. పక్కనే పడుకున్న కుటుంబరావు నిద్రలో ఆమె మీద చెయ్యి వేసాడు. బలమైన సర్పం మీద పడినట్లుగా ఆమె ఉలిక్కిపడింది. వెంటనే ఆ చేతిని చీదరగా విసిరికొట్టింది. కుటుంబరావుకి మెలకువ రాలేదు. ఈశ్వరి అతన్ని పరాయి వ్యక్తిలా గమనించింది. అతను కొద్దిగా నోరు తెరిచి […]

రెండో జీవితం 3

రచన: అంగులూరి అంజనీదేవి ఆముక్తను చూడగానే చిరునవ్వుతో విష్‌ చేసి.. కూర్చోమన్నట్లు కుర్చీ చూపించాడు ద్రోణ. కూర్చుంది ఆముక్త. ద్రోణ వేసిన బొమ్మల్ని చూసి మెచ్చుకుంది ఆముక్త. మన బిడ్డల్ని ఎవరైనా ఇష్టపడ్డప్పుడు మన ఆనందం ఆకాశాన్ని ఎలా తాకుతుందో అదేస్థాయి ఆనందంలో వున్నాడు ద్రోణ. ద్రోణ చాలా చిన్న వయసునుండే చిత్రాలు గీస్తున్నాడు. ప్రతి చిత్ర ప్రదర్శనలో తన చిత్రాలను ఎంట్రీ చేస్తుంటాడు. అతని చిత్రాలు మిగిలిన వాళ్లకన్నా విభిన్నంగా వుంటూ కళాప్రియులకు గొప్ప అనుభూతిని […]

గుర్తుకు రాని కధలు..!

రచన: ఉమ గోపరాజు ఒక మాట.. గుర్తొచ్చిన కధలు అని ఎవరైనా రాసారో లేదో తెలియదు కాని, నాకు మాత్రం ఎప్పటివో కధలు, గుర్తున్నవి, తల తోక గుర్తులేనివి అన్నిటినీ కలిపి కలగాపులగం అయినా పనికొచ్చేదేదైనా ఉంటే చెప్పుకోవడంలో తప్పులేదని రాయాలనిపిస్తుంది. ఇహ పోతే, ఎథిక్స్ విషయానికి వచ్చినా, పెద్ద పెద్ద కవివరేణ్యులు, కూడా అక్కడో ఇక్కడో చూసి, చదివి రాసినవే కదా? అందరమూ, అమ్మ ఇచ్చిన అక్షరాలే అల్లుతూ రాసేవాళ్ళమే… అయితే ఇ౦తకూ రాయట౦ అ౦టూ […]

ముఖపుస్తక పరిచయం

రచన: గిరిజారాణి కలవల మూర్తి గారు సాయంత్రం ఇంట్లో అడుగు పెట్టగానే ఎదురుగా కనపడ్డ దృశ్యం.. ఆయనను నిశ్చేష్టుని చేసింది. ఆశ్చర్యంతో నోరు తెరిచేసారు. కలయో.. నిజమో.. తెలీని స్థితిలో.. తనకు తనే గట్టిగా గిల్లుకుని.. హా.. ఇది నిజ్జంగా నిజ్జమే.. అనుకుని, ఆ అయోమయంలోనే లోపలికి చిన్నగా వెళ్ళారు. అలాగే ఫ్రెష్ అయి, తానే కాఫీ పెట్టుకుని తాగుతూ.. ఇందాక హాలులో తాను చూసిన దృశ్యాన్ని తలుచుకున్నారు. తన సతీమణి సరోజ.. కింద ఫ్లోర్ లో […]

ట్రాన్స్ జెండర్ ….

రచన: శ్రీకాంత గుమ్ములూరి మార్కెట్లో కూరలూ పళ్ళూ కొన్నాక ఆటోలో ఇంటికి తిరుగుముఖం పట్టాము నేనూ, రాణీ, వాళ్ళ అమ్మమ్మతో. రెడ్ సిగ్నల్ రావడంతో నాలుగు రోడ్ల కూడలి దగ్గర ఆటో ఆగింది. ఇంతలో ఒక ట్రాన్స్ జెండర్ ఆటో దగ్గరికి వచ్చి చప్పట్లు చరుస్తూ చెయ్యి చాపింది. మొగ లక్షణాలు మొహంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. గాడీగా, పెద్ద పువ్వులున్న పసుపు పచ్చటి చీర కట్టుకుంది. మొహాన పెద్ద స్టిక్కర్ బొట్టు, పెదాలకి లిప్ స్టిక్ , […]

దూరపు బంధువులు

రచన: మణికుమారి గోవిందరాజుల చలనం లేకుండా కూర్చొని వున్నాడు కేశవరావు. యెదురుగుండా భార్య వసుధ యెటువంటి బాధా లేకుండా ప్రశాంతంగా పడుకుని వుంది. వచ్చిన బంధువులందరూ అతనికి వోదార్పు మాటలు చెబుతున్నారు. “యెంత అదృష్ణవంతురాలు! మాట్లాడుతూ మాట్లాడుతూనే అలా పక్కకి వొరిగిపోయిందట. సుమంగళిగా దాటిపోయింది. చాలా కొద్దిమందికి మాత్రమే ఇలాంటి చావు దొరుకుతుంది.” “ సాయంత్రం కలిసింది. చీకటి పడ్డదాకా మాట్లాడుకున్నాము. భోజనాలయ్యాక కూడా కాసేపు వాకిట్లో మెట్లమీద కూర్చుంది వసుధక్క. ఇక తొమ్మిది దాటుతోంది పడుకుంటాను […]

ఆక్సిడెంట్‌ నేర్పిన పాఠం

రచన: ఝాన్సీరాణి.కె టైం చూశాను.. 8:35 ఫర్వాలేదు.. ఇంకొక్క పది నిముషాల్లో రెండు బస్సున్నాయి. 5 నిముషాల తేడాతో కరెక్ట్ టైంకి ఆఫీసులో వుండవచ్చు అనుకుంది.  బాక్సుల్లో సర్దగా మిగిలినవి ఒక ప్లేట్‌లో తెచ్చుకున్నవి భవాని డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కుర్చీలాగి కూర్చుని తినసాగింది. హడావిడిగా ఆ కొన్ని నిముషాలయినా కాళ్ళకు రెస్ట్‌ అనుకుంది. ‘ఈ రోజుల్లో ఉద్యోగం చేస్తున్న ఆడవాళ్ళందరికి ఈ వత్తిడి  తప్పదు. కొంతమందికి భర్తలు కూడా సాయం చేస్తారు.’ అలాసాగి పోతున్నాయి భవాని […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 21

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య ఈ సృష్టిలోని సమస్త జీవరాసులను, బ్రహ్మాండాలను సృష్టించేది పరంధాముడే కదా! ఆ శ్రీహరి సృష్టించిన పదార్ధాలనే.. అంటే… అది లడ్డయినా..వడలయినా..చక్కెర పొంగలయినా… స్వామికి “నైవేద్యం సమర్పయామి” అంటూ నివేదిస్తూ ఉంటాము. ఎంత విచిత్రమో కదా! సమస్తo సృష్టించే ఆ దివ్య లీలా మానుష విగ్రహధారికి ఆ పదార్ధాలనే మనం తయారు చేసిన వస్తువుల్లాగా గొప్పకు పోతూ స్వామికి పెడుతూ ఉంటాము. నీ సొమ్మ్ము నీకే ఇవ్వడం..పైగా అదేదో మా సృజన అయినట్టు సంబరపడ్డమూ…. […]

బుద్ధుడు-బౌద్ధ మతం

రచన:  శారదా  ప్రసాద్ ​బౌద్ధ మతం ప్రపంచంలోని ముఖ్యమైన మతాలలో ఒకటి. మొత్తం ప్రపంచంలో బౌద్ధ ధర్మాన్ని ఆచరించేవారు 23 కోట్లనుండి 50 కోట్ల వరకు ఉండవచ్చునని అంచనా.బౌద్ధంలో రెండు ప్రధాన విభాగాలున్నాయి – మహాయానము, థేరవాదము. తూర్పు ఆసియా, టిబెట్ ప్రాంతాలలో మహాయానం (వజ్రయానంతో కలిపి) అధికంగా ప్రాచుర్యంలో ఉంది.”బుద్ధుడు అట్టడుగువర్గాల విముక్తి ప్రధాత. రాజకీయ మార్గదర్శి’’ గౌతమ బుద్ధుని పైనా, ఆయన సామాజిక కార్యాచరణ పైనా విస్తృత పరిశోధన చేసిన సి.ఎఫ్. కొప్పన్ అన్నమాటలివి. […]