April 25, 2024

ఉష …..

రచన:  జి. శ్రీకాంత   సూర్యోదయ పూర్వార్ధ సమయం ….. ఉష తొంగి చూసింది… ప్రియాగమనార్థియై ముంగిట నిలిచింది తూరుపు దిక్కున నింగిలో ఆమె చీర  కొంగు నీలాకాశమై  విస్తరించుకుంది దీర్ఘమైన కురులు దట్టమైన పొగమంచులా పారాయి ఆమె ధరించిన నగలు నభంలో నక్షత్రాలై  మిలమిలలాడాయి సన్నని వెలుగులు చిప్పిల్లగానే నగల తళుకులు  వెలవెల పోయాయి చిరు వెలుగులలో చీర కుచ్చిళ్ళు జేగురు రంగు వెలువరించాయి అధిగమిస్తున్న సూర్య కాంతులు చొచ్చుకు రాగా నారంగి, పసుపు, బంగారు […]

పునర్జన్మ

రచన: ఉమ జి   అనుదినమూ ఏవో చిన్న గొడవలతో జీవనఝరిలో నిస్తేజంగా, స్తబ్దంగా మిగిలిన నేను, తిరిగి నాలోనే చైతన్యాన్ని చిలికిస్తాను, మనసున అమృత మథనం సాగిస్తాను   ఏమీ తోచని జడత్వాన్ని పారదోలి జీవం నింపే ఊహల సాక్షాత్కరించే మనసు పొరలు మాటునున్న ఊటకు ఊపిరి పోసి ప్రాణం నింపుతాను సజీవంగా సాక్షాత్కారం చేస్తాను   నిష్కర్షగా మాట్లాడే మనుషులు చెప్పే నిజాన్ని గ్రహించి, జాజి మల్లెల పరిమళాలు మనసుకు అందేలా వారి మంచితనాన్ని […]

ఊహా సుందరి!

రచన: నాగులవంచ వసంత రావు   సృష్టికర్త ప్రతిభకు ప్రత్యక్ష రూపానివో అమర శిల్పి జక్కన చెక్కిన శిల్పానివో   అవనిలోని అందమంత అమరిన జవరాలివో రసికుల హృదయాల దోయు కొంటె నెరజాణవో   ఉషోదయపు మంచు తెరలు కడిగిన ముత్యానివో శ్రీగంధపు పరిమళాల మన్మధ బాణానివో   ఒంపు సొంపు లొలకబోయు బాపు గీసిన బొమ్మవో చూపరు నలరింపజేయు అచ్చ తెలుగు రెమ్మవో   ప్రేమ మధువు జాలువారు అమృత భాండానివో ప్రేమాభిషేక చిరుజల్లుల అమర […]

మాలిక పత్రిక అక్టోబర్ 2017 సంచికకు స్వాగతం

Jyothivalaboju Chief Editor and Content Head పాఠక, రచయిత మిత్రులందరికీ దీపావళి పండగ శుభాకాంక్షలు. కాస్త ఆలస్యంగా ఈ మాసపు సంచిక విడుదలైంది. మాలిక తరఫున ఎందరో మహానుభావులు శీర్షికన ప్రముఖులతో ఇంటర్వ్యూ విశాలిపేరి చేస్తున్నారు.  అందులో భాగంగా ఈ మాసం పరిచయం అక్కరలేని గరికపాటి నరసింహారావుగారి ముఖాముఖి వీడియోరూపంలో మీకందిస్తున్నాము. మిమ్మల్ని అలరించే, ఆనందపరిచే సీరియళ్లు, కథలు, సమీక్షలు, వ్యాసాలు ఎన్నో ఉన్నాయి.. మీ రచనలు పంపవలసిన చిరునామా: jyothivalaboju@gmail.com 01. ఎందరో మహానుభావులు […]

ఎందరో మహానుభావులు – గరికపాటి నరసింహారావు

ఇంటర్వ్యూ: విశాలి పేరి ” కదిలేది కదిలించేది పెనునిద్దర వదిలించేది కావాలోయ్ నవతరానికి ” అని మహాకవి శ్రీశ్రీ కోరినట్టుగా ప్రస్తుత యువతరానికి తన మాటలతో ఉత్తేజాన్నిచ్చేవారు ఇన్నాళ్ళకు దొరికారు. ప్రవచనాలంటే కాటికి కాలు చాపుకొనేవారే వింటారు అనే అపోహ ఈయన ప్రవచనం వింటే తొలగిపోతుంది. ఏ ప్రవచనం విని యువతలో ఒక వివేకానందుడు వెలుగుతాడో.. ఆ ప్రవచనం ఆ గరికపాటివారి సొంతం. ప్రస్తుతం సమాజంలో ఉన్న కుళ్ళును తన మాటలతో ఉతికిపారేసే నైజం వారిది. ఆయన […]

మాయానగరం – 40

రచన: భువనచంద్ర జీవితం ఎంత చిన్నది… ఎంత గొప్పది… ఎంత చిత్రమైనది.. ఎంత అయోమయమైనదీ! అర్ధమయ్యిందనుకున్న మరుక్షణంలోనే ఏమీ అర్ధం కాలేదని అర్ధమౌతుంది. సంతోషంతో ఉప్పొంగిపోయే క్షణాన్నే ఏదో ఓ మూల నుంచి దుఃఖం ఉప్పెనలా మీదపడుతుంది. ఓ కాలమా… ఎంత చిత్రమైనదానివే నువ్వు?..మమల్ని మురిపిస్తావు.. మమల్ని అలరిస్తావు… సడన్ గా మమల్ని నీలో కలిపేసుకుంటావు! చావు పుట్టుక.. యీ రెండు అట్టల మధ్య కుట్టబడిన పుస్తకమేగా యీ జీవితం. ఆలోచిస్తూ నడుస్తున్నాడు రుషి. సవ్యాద్రి అండతో […]

బ్రహ్మలిఖితం 12

రచన: మన్నెం శారద వేంకటేశ్వర స్వామి గుడి మెట్లెక్కుతుంటే ఈశ్వరి కాళ్ళు చిన్నగా వణికేయి. ఒక అపరిచిత వ్యక్తిని కలుసుకోడానికి తనేంటింత ధైర్యంగా వస్తోంది. తను కాకినాడ పక్కన కత్తిపూడిలో పుట్టి పెరిగింది. ముందు నుండీ ఘోషా కుటుంబం తమది. తండ్రి పట్టుదల వలన కాకినాడ మేనమామ ఇంట్లో వుంది, బి.ఏ వరకు చదివింది. పేరుకి కాలేజీకి వెళ్ళేదే గాని ఇంట్లో వంచిన తల కాలేజీలో ఎత్తేది. మళ్లీ అక్కడ వంచిన తల ఇంట్లో ఎత్తేది. ఆడవాళ్లు […]

రెండో జీవితం 2

రచన: అంగులూరి అంజనీదేవి గబగబ లోపలకెళ్లింది. ”మమ్మీ! మమ్మీ !” అంటూ పిలిచింది. మిక్సీలో మసాలపొడి వేస్తూ, ఆ సౌండ్‌లో శృతిక పిలుపు విన్పించక వెంటనే పలకలేదు సుభద్ర. ”అబ్బా! మమ్మీ! ఓ నిముషం ఈ మిక్సీని ఆపు. ఎప్పుడు చూసినా దీని సౌండ్‌తో చచ్చిపోతున్నా…” అంది శృతిక. శృతిక మూమెంట్స్ చూడగానే అర్థమై మిక్సీ ఆపింది సుభద్ర. ఇవాళ హాలిడే కూడా కాదు. శృతిక హాస్టల్‌నుండి ఎందుకొచ్చినట్లు? ఎప్పుడు చూసినా ఇంటికొస్తుంది. హాస్టల్‌ ఫీజు దండగ […]

Gausips – ఎగిసే కెరటాలు-15_ఆఖరిభాగం.

రచన: శ్రీ సత్యగౌతమి సింథియాను రిమాండులోకి తీసుకున్నాక, బెయిల్ మీద విడిపించడానికి ఎవరిని సహాయం అడగాలో అర్ధం కాలేదు సింథియాకి. చటర్జీ తో మాట్లాడింది ఫోన్లో పోలీసుల అంగీకారంతో. చటర్జీకి ఉన్నది ఉన్నట్లుగా అంతా చెప్పింది, కాపాడమని ఏడ్చింది. కానీ తానున్నది ఇండియాలో, ఇదంతా జరుగుతున్నది అమెరికాలో. ఇండియానుండి తానెటువంటి మద్ధతు ఇవ్వలేననీ, కౌశిక్ తో మాట్లాడమని చెప్పాడు. “నేను కౌశిక్ కు ఫోన్ చేశాను. ఏవిటో కాల్ వెళ్ళటం లేదు. తను నాకు దొరకలేదు” అని […]

కొత్త కథలు – సమీక్ష

సమీక్ష: – నండూరి సుందరీ నాగమణి కొత్త కథలు – ౩౩ మంది రచయిత్రుల మంచి కథలతో వంశీ కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వారు వెలుగు లోనికి తీసుకువచ్చిన ఒక మంచి పుస్తకం. ఈ పుస్తకములో సీనియర్ రచయిత్రుల దగ్గరనుండి, వర్థమాన రచయిత్రులవరకూ అందరి కథలూ ఉన్నాయి. ప్రతీ కథ కూడా కథా, కథనమూ ఆసక్తిని కలిగించేలా ఉండటం హర్షదాయకం. విపంచితో విద్యుల్లతకు చిన్ననాటి స్పర్థా పూర్వక స్నేహం, పెద్దయ్యాక, ఆమెను చూసి, కృషితో నాస్తి […]