April 20, 2024

టీ కప్పు రేపిన తుఫాను

రచన: కె.ఝాన్సీకుమారి కాలింగ్‌ బెల్‌ అదే పనిగా మోగుతూంది. బాత్‌రూం నుంచి బయటికి వచ్చిన పద్మజ గబగబా తలుపు దగ్గరి కెళుతూ గదిలోకి చూసింది. కంప్యూటర్‌ ముందు కూర్చుని వున్నాడు రాఘవ. నేను బాత్‌రూంలో వున్నాను. కాస్త మీరు తలుపు తీసివుండవచ్చు కదా అంది తలుపు గడియ తీస్తూ. “నేను ఇంటర్నిట్‌లో ఉన్నాను” అన్నాడు అక్కడి నుంచి కదలడం కష్టం అన్నట్టుగా. పక్కఫ్లాట్లో వుంటున్న శైలజ లోపలికి వచ్చింది చేతిలో ఒక చిన్న గిన్నెతో. పద్మజ అమెరికాలో […]

“హాయిగా..”

రచన: మంథా భానుమతి. సాఫ్ట్ వేర్ ఉద్యోగుల కలలు పండుతున్న ఒక నగరం.. మింటి నుంచి మట్టి మీదికి అమరావతి దిగి వచ్చినట్లు వైభవం ఉట్టి పడుతూ ఉంటుంది. లేచినప్పట్నుంచీ వెనుకనుంచెవరో తరుముతున్నట్లు హడావుడిగా ఉంటారు అక్కడి జనం. విశాలమైన వీధులు, పెరిగి పోయిన కార్లతో ఎడ్ల బళ్ల కంటే నిదానంగా నడిచే కార్ల తోరణాలతో కళకళ లాడుతుంటాయెప్పుడూ. ఆ నగర శివార్లలో, ఆధునిక సదుపాయాలతో, రక్షణ వలయంతో, కావలి వారితో.. విశాలమైన ప్రాంగణంలో కట్టిన గృహ […]

పరాన్నభుక్కు

రచన: శశికళ ఓలేటి “జోగారావుగారికి బాగా సీరియస్ గా ఉందిట కదా. నెల్లాళ్లు ఐసీయూలో ఉంచి, లాభం లేదు. ఇంటికి తీసుకెళ్లిపోండి, అయినవాళ్లనందరినీ ఆఖరిచూపులుకు పిలుచుకోండి అని చెప్పేసారంట కదా! అప్పుడే వారమయిందట ఇంటికి తీసుకొచ్చి………..”, ధనలక్ష్మితో అదే తలనొప్పి. మొదలెట్టడమే. అవతలి వారికి మాటాడే అవకాశం ఇవ్వదు. భార్య వాక్ప్రవాహానికి అడ్డుకట్టేస్తూ రాంబాబు అందుకున్నాడు. “అవును! తెలుసు! ఇప్పుడు అక్కడినుంచే వస్తున్నా! అయితే ఏంటంట?!”…… కాస్త కటువుగా పలికాడు. “ఏంటంటారేంటండీ! జోగారావుగారు మన యజమాని. మీ […]

పార్శీయులు

రచన: టీవీయస్.శాస్త్రి (పార్శీల మత చిహ్నం) 2004 గణాకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా జొరాస్త్రియన్ల సంఖ్య 1, 45, 000 నుండి 2, 10, 000 వరకూ ఉన్నది. 2001 భారత్ జనగణన ప్రకారం 69, 601 పార్శీలు భారత్ లో గలరు. క్రీస్తు శకం తరువాత జొరాస్త్రియన్లు కొన్ని వందల సంఖ్యలో భారతదేశంలో ఉన్న గుజరాత్ రాష్ట్రంలోకి అడుగుపెట్టారు. వీరినే పార్శీయులు అని అంటారు. కుస్తీ యజ్ఞోపవీతము(ఒడుగు / జంధ్యం) ధరించే ఆచారము వీరిలో కూడా ఉన్నది. […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 20

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య అన్నమయ్య శ్రీవేంకటేశ్వరునికి చేసుకునే విన్నపం ఈ కీర్తనలో మానవజీవితం, భ్రమలు మాయలతో గడచిపోవడం గురించి చేసే నివేదన. ఈ లోకంలో జన్మంచిన ప్రతి మానవుడు ఎలా సుఖంగా.. సంతోషంగా జీవించాలా? అనే ఆలోచనతోనే గడుపుతారు. కానీ అసలు నేనెవరిని? ఈ ప్రపంచం ఏమిటి? దీన్ని ఎవరు సృష్టించ్చారు? ఈ జీవులంతా ఎవరు? మరణించాక ఎక్కడికి వెళ్తున్నారు? అని అలోచించడంలేదు. ఈ సృష్టికి లోనై మిమ్ములను గమనిచలేని స్థితిలో ఉన్నాము. మీరే కరుణజూపి మమ్ము […]

దైవప్రీత్యర్థం విధ్యుక్త ధర్మాచరణం

రచన: జి.సందిత మానవులు జన్మను సార్థకం చేసుకోవటం అంటే భగవంతుని మెప్పుపొందటమే! అందుకోసం మనుషులకై నిర్దేశించిన అనుసరించవలసిన కర్మాచరణ విధివిధానశాస్త్రమే ధర్మము. కర్మాచరణం కూడా త్రికరణశుద్ధిగా చేయవలసి వుంటుంది. అప్పుడే అది ధర్మమవుతుంది. త్రికరణ శుద్ధి అంటే మనసా వాచా కర్మణా వైరుధ్యం లేకపోవటమే! ఆకలితో ఇంటికి వచ్చిన అతిథికి భోజనంపెట్టటం మన ధర్మం అనుకుందాం. అప్పుడు వండి సిద్ధం చేయటం, వడ్డించటం శరీరకర్మ. అతిథిని భోజనానికి ఆహ్వానించటం తదుపరి ఏమేమి ఉన్నాయో తెలిపి కొసరికొసరి అడగటం […]

భారతములో చెప్పబడ్డ కలియుగ ధర్మాలు

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు ద్వాపరయుగము నాటివిషయము ఇది. మహాభారతములో పాండవులు కురుక్షేత్ర యుద్ధము అనంతరము వాన ప్రస్తాన పర్వంలో ఉండగా ధర్మరాజుకు కామ్యక వనములో మార్కండేయ మహాముని ఆశ్రమాన్ని దర్శించినప్పుడు, మార్కండేయ మహాముని పాండవులకు ద్రౌపదికి, కృష్ణుడు సత్యభామల సమక్షములో రాబోయే కలియుగధర్మాలను సవివరముగా వివరిస్తాడు. కలి యుగములో సంభవించబోయే పరిణామాలను వివరిస్తాడు. ద్యాపర యుగము ముగిసి కలియుగము త్వరలోనే మొదలవుతుంది అని ముని వారికి వివరిస్తాడు. కలియుగములో జనులు అలవోకగా ఏమాత్రము జంకు లేకుండా […]