March 30, 2023

పాడు పండగలు..

రచన: రాజి

పల్లె పల్లెలా వాడ వాడలా వస్తాయంట మాయదారి పండగలు
ముస్తాబులూ, మంచి మంచి వంటకాలు తెస్తాయంట
ఇంటింటా ఆనందాలు విరజిమ్ముతాయంటా.

మరి మా మురికివాడ జాడ తెలియలేదా వాటికి
వెలుతురు లేని వాడల అరుగులు వెతకలేదా ఈ వగలమారి పండగలు
ఆకలి ఆర్తనాదాలు, చిరుగు చిత్రాలు కనరాలేదా కలహమారి పండగలకు

మాయదారి పండగలు కలవారి ఇంటనే విడిది చేస్తాయంట
బంగళాల్లో, కనక, కాంతుల్లోనే కనపడతాయంటా
గుడిసెల్లో, నిరుపేదలను కనికరించవంట ఈ పాడు పండగలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

January 2018
M T W T F S S
« Nov   Feb »
1234567
891011121314
15161718192021
22232425262728
293031