May 31, 2023

సశస్త్రీ సుశస్త్రీ స్త్రీ

రచన: ఉమా పోచంపల్లి

విశాల గగనం, వినీలాకాశం
అనంత విశ్వం, ఆవేశపూరితం

మనోబలం కావాలి ఇంధనం
తేజోబలం అవ్వాలి సాధనం
మానవమేధ మహా యజ్ఞం
చేయాలి లోకముద్దీప్తి మయం

విశాల అవని వినిపించెనదె
ఆమని వలె వికసించెనదె
అణుమాత్రమైనా, ప్రతిధ్వనించెను
అష్టదిక్కులు మారుమ్రోగగా
తారలమించే తేజోమయం

ఆనందభైరవి నాట్యాలు వెలిగి
మనసానంద నాట్యాల ఉర్రూతలూగించి
వనితా అవని సుశాస్త్రజ్ఞానం
అవని పరిధినే అధిగమించెనే

కెంపులకేల కరవాలము వలెనే
కుజగ్రహ మున నిలిపెను మన భారత క్షిపణి
కుజగ్రహమున నిలిచెను ప్రశస్తముగా
నవ భారత రుధిర రక్షిణి, జగత్సంరక్షిణి!!

1 thought on “సశస్త్రీ సుశస్త్రీ స్త్రీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *