June 24, 2024

మాలిక పత్రిక ఫిబ్రవరి 2018 సంచికకు స్వాగతం

Jyothivalaboju Chief Editor and Content Head   కొత్త సంవత్సరం మొన్ననే కదా వచ్చింది. అప్పుడే రెండో నెల వచ్చేసిందా…  మాలిక పత్రిక కూడా ముస్తాబై వచ్చేసింది. ఈ సంచికలో కొత్త శీర్షిక ప్రారంభించబడింది. కొందరు వ్యక్తులు, కొన్ని సంఘటనలు, కొన్ని పుస్తకాలు, కొన్ని వస్తువులు. ఇలా కొన్ని చాలా స్పెషల్ గా అనిపిస్తాయి. అలాటి స్పెషల్ వ్యక్తులతో ముఖాముఖి కార్యక్రమాలు వీడియో రూపంలో అందించడానికి ప్రయత్నిస్తున్నాము. అందులో మొదటిగా ఒక రచయిత్రితో మరో రచయిత్రి […]

Something Special – ముచ్చర్ల రజనీ శకుంతల

సాహితీ కార్యక్రమాలు, సంగీత కార్యక్రమాలు, ప్రమదాక్షరి సమావేశాలు మొదలైనవాటిలో చురుగ్గా పాల్గొనే ఒకావిడ కొన్నేళ్ల క్రితం పాఠకులను ఉర్రూతలూగించే రచనలు చేసి ఎన్నో కథలు, వ్యాసాలు, నవలలు, సీరియళ్లు, టీవీ ప్రోగ్రాములు మొదలైనవి చేసిన ప్రముఖ రచయిత్రి అని తెలిస్తే భలే థ్రిల్లింగ్ గా ఉంటుంది కదా.. నరుడా ఏమి నీ కోరిక, ప్రియా ప్రియతమా, ఒక గుండె సవ్వడి, మనమిద్దరం లాటి పాపులర్ టీవీ సీరియళ్లు,వంశీ ఆర్ట్స్, కళానిలయం, జ్యోత్స కళాపీఠం, మయూరి ఆర్ట్స్ , […]

మణికర్ణిక

రచన: ప్రొఫెసర్ రామా చంద్రమౌళి తనెవరో తనకే తెలియని మణికర్ణిక భస్మసింహాసనంపై కూర్చుని గంగా హారతిని చూస్తోంది కటిక చీకట్లో యుగయుగాలుగా అంతే స్త్రీని హింసించి , వధించి , సతిని యాభైరెండు ఖండాలుగా ఖండించినపుడు ఇక్కడ వారణాసి తటిపై ‘ కర్ణాభరణం ‘ ఒక శక్తిపీఠమై మొలిస్తే కన్యాకుమారిలో తెగ్గొట్టబడ్డ ఆదిమ స్త్రీ పవిత్ర పాదాలు రక్తసిక్తమై చుట్టూ ఆవర్తనాలౌతూ సముద్రాలూ, నదులూ దుఃఖితలైనాయి – అంబాడ్తున్న మణికర్ణికను ఎవరో శ్మశానాల మధ్య విడిచి వెళ్ళారు […]

Gausips:- ||ప్రేమికుల రోజు||

రచన: శ్రీసత్యగౌతమి నా తలపుల్లో నీ పిలుపులు గడియారపు ముల్లుల్లా నిరంతరం వినిపిస్తున్నాయి… ఆ పిలుపుల్లో నీ జ్ఞాపకాలు చంద్రగమనాన్ని ఆపి చల్లని వెన్నెలని కురిపిస్తున్నాయి… ఆ వెన్నెల వెల్లువలో నీ ఆశలు నా హృదిన నిండి వీచే గాలుల బారిన పడి కొట్టుకుంటున్న కిటికీ రెక్కల్లా నా కుదురుని నాకు దూరం చేస్తున్నాయి… నీ వీచేగాలుల తాకిడి తీరాన్ని బలంగా తాకిన కెరటంలా నన్ను తడిపేస్తే ముద్దయి రూపాన్ని కోల్పోయి తరంగమై నీ వాయులీనమైపోయాను…. నీ […]

పట కుటీర న్యాయం

రచన: కాంత గుమ్ములూరి ఎక్కడ దొరికిన అక్కడే నా గృహం పట కుటీర న్యాయం ఆక్రమించిన స్థలం నా నివాసం అనుభవించిన దినం నా అదృష్టం చెట్టు కిందా , గుట్ట పక్కా, ప్రహరీ గోడ వెనకాలా మంచు మబ్బుల నీలాకాశం నా దుప్పటీ పచ్చ గడ్డి, మన్ను దిబ్బా పవళించే తల్పం వెచ్చనైన రాళ్ళ మట్టి నా ఆసనం వర్షం, గాలీ, ఎండా, నీడా అందరూ నా సహచరులు. నీ కడుపు నింపుతా ననే అమ్మ […]

బ్రహ్మలిఖితం 15

రచన: మన్నెం శారద ఆ పిచ్చి పిల్లనింకెప్పుడిలాంటి స్థలాలికి తీసుకురాకు. “ప్రొద్దుటే మీ ఊరు బయల్దేరు” అన్నారాయన వెంకట్‌తో. ఈశ్వరి ఆయన మాటలు విని అర్ధం చేసుకోగల్గితే ఎలా వుండేదో? కాని… అది జరగనే లేదు. వెంకట్‌ని ఆమె భర్తగా అనుకోవడం మాస్టారి తప్పు. స్వార్ధంతో కనుపొరలు కప్పుకుపోయిన ఆ నీచుడికి ఆయన చెప్పిన నీతిశాస్త్రం అర్ధం కాలేదు. కొంచెంలో తను బయటపడ్డానని మాత్రమే సంతోషిస్తున్నదతని హృదయం. ****** ఎక్కడో ఒక పేరు తెలియని పిట్ట వెర్రి […]

మాయానగరం 43

రచన: భువనచంద్ర “మరోసారి కల్తీ సారా పేరుతో మారణహోమం సాగిస్తే?” చాలా మెల్లగా స్పష్టంగా అన్నాదు శామ్యుల్‌రెడ్డి సర్వనామంతో. “నో..” స్థిరంగానూ, స్పష్టంగానూ అన్నాడు సర్వనామం. “అదే అడుగుతున్నాను. ఎందుకు వొద్దని?” చికాగ్గా అన్నాడు శామ్యూల్‌రెడ్డి. ప్రధాన సమస్య బోస్. గత రెండు నెలలుగా బోస్ పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తున్నాడు. గుడిసెలు, సిటీలోనే కాదు, ఏ వార్డు నించి ఎవరికి ఏ సమస్య వొచ్చినా తక్షణం ఆ సమస్యని పరిష్కరిస్తున్నాడు. తనవల్ల కాలేకపోతే ఆ సమస్యని అధికారుల దగ్గరికీ, […]

రెండో జీవితం .. 5

రచన: అంగులూరి అంజనీదేవి ఆకులు కదిలినట్లనిపించి ఇటు తిరిగాడు ద్రోణ. వెన్నెల నీడ కొబ్బరాకుల సందుల్లోంచి శృతిక మీదపడి కదులుతుంటే ఆమె వేసుకున్న లైట్ బ్లూ కలర్‌ నైటీ మీద నల్లపూసల దండ మెరుస్తోంది. ఒక్కక్షణం అతని కళ్లు అలాగే నిలిచిపోయాయి. ”ఒక్క నిముషం శృతీ! వస్తున్నా”… అంటూ కాల్‌ కట్ చేసి భార్య వైపు రెండడుగులు వేశాడు. ”వస్తారులెండి! ఏదో ఒక టైంకు… ఇక్కడేం జరుగుతుందో చూద్దామని వచ్చాను” అంది శృతిక. ఏం జరుగుతోందని చుట్టూ […]

కలియుగ వామనుడు 3

రచన: మంథా భానుమతి “మరి నువ్వు.” ఇంత లావెలా ఉన్నావని అడగలేక పోయాడు చిన్నా. కిషన్ కి అర్ధమైపోయింది, ఏమడగాలనుకుంటున్నాడో. “ఇంట్లో, బైటా కనిపించిందల్లా ఫైట్ చేసి తినెయ్యడమే. మిగలిన వాళ్ల గురించి చూడను. ఐనా నా కడుపు ఎప్పడూ కాళీగానే ఉంటుంది. అందుకే అమ్మేసుంటారు, నన్ను భరించలేక. ఎక్కడో అక్కడ తింటాన్లే కడుపునిండా అని. వీళ్లు కూడా కడుపు విండా పెట్టట్లేదు. ఎప్పుడూ ఆకలిగానే ఉంటోంది.” కిషన్ హిందీ, మరాటీ కలిపి మాట్లాడుతుంటే బాగా అర్ధమవుతోంది […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 23

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య మానవజన్మ లభించడం ఒక వరం. దాన్ని సద్వినియోగం చేసుకోవడం వివేకవంతుల లక్షణం. ఏదో ఒక రోజు ఈ బొందిలో ప్రాణం కాస్తా ఎగిరిపోతుంది. ఈ అశాశ్వతమైన కాయం కోసమే మనిషి నానా తాపత్రయాలు పడుతున్నాడు. ఇంద్రియ సుఖాల కోసం అదేపనిగా వెంపర్లాడుతున్నాడు. తెలిసి తెలిసీ ఈ కూపంలో ఇరుక్కుంటూనే ఉన్నాం. మమ్ములను ఈ విషయవాంఛలకు లోను చేస్తున్నావని మళ్ళీ నిన్నే నిందిస్తున్నాం. నీవే నా దైవానివని, కరుణతో కైవల్యమిచ్చే వాడవని ఎన్నటికీ గుర్తించలేకపోతున్నాను. […]