March 19, 2024

మాలిక పత్రిక మార్చ్ 2018 సంచికకు స్వాగతం

Jyothivalaboju Chief Editor and Content Head కొత్త సంవత్సరం, మామిడి కాయలు పళ్లు, కొత్త కుండలో చేసిన పచ్చడి., భక్ష్యాలు…. మల్లెపూలు కూడానూ… తెలుగువారికి ప్రియమైన నూతన సంవత్సం ఉగాది పండగకు స్వాగతం చెప్తూ మాలిక పత్రిక పాఠకులు, రచయితలకు మనఃపూర్వకమైన శుభాకాంక్షలతో మార్చ్ మాసపు సంచిక మీకోసం ఎన్నో విశేషాలను తీసుకొచ్చింది. మీ రచనలను పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com ఈ మాసపు ప్రత్యేకమైన రచనలు: 1. కలియుగ వామనుడు – 4 2. బ్రహ్మలిఖితం […]

కలియుగ వామనుడు – 4

రచన: మంథా భానుమతి అంతలో.. భళుక్ మని టింకూ మమ్మీ మీద కక్కేశాడు. “ఓహ్.. ఎయిర్ సిక్ నెస్ ఉన్నట్లుంది. ఇదే ఫస్ట్ టైమా? టాయిలెట్ లోకి తీసుకెళ్లండి.” హోస్టెస్ సహాయంతో, టింకూని తీసుకుని వెళ్లింది మమ్మీ. ఏ మాత్రం అసహ్యించుకోకుండా సొంత అమ్మ లాగే శుభ్రం చేసి తీసుకొచ్చింది. తన బట్టలు కూడా.. ఎవరో చెప్పినట్లున్నారు.. ఒక జత బట్టలు కూడా తెచ్చుకున్నట్లుంది.. అవి మార్చుకునొచ్చింది. టింకూ, చిన్నాలవి ఎలాగా బాక్ పాక్ లో పైన […]

బ్రహ్మలిఖితం – 16

రచన: మన్నెం శారద ప్రతి కిలోమీటరుకి అడవి దట్టమవడం గమనించింది లిఖిత. ముందంతా రబ్బరు తోటలున్నాయి. వాటికి కట్టిన చిన్న చిన్న కుండలలో గాటు పెట్టిన చెట్టు నుండి చిక్కని పాలు కారుతున్నాయి. కొన్ని చోట్ల పాలని ట్రేలో ఎండబెట్టి తయారుచేసిన రబ్బరు షీట్లు ఆరవేసున్నాయి. కొంత దూరం వెళ్లేక వాతావరణం బాగా మారిపోయింది. ఆకాశంలోని మబ్బులు కొండలమీదకు విహారం వచ్చినట్లుగా తిరుగుతున్నాయి. ఇది తన తండ్రి చావు బ్రతుకుల సమస్య కాకపోతే తనెంతో ఎంజాయ్ చేసి […]

రెండో జీవితం – 6

రచన: అంగులూరి అంజనీదేవి ఆముక్త కారుదిగి లోపలకి వస్తుంటే చూసి మండేనిప్పుల కణికలా అయింది శృతిక. రెండడుగులు ఎదురెళ్లి ఉరిమి చూస్తూ…. ”ఆయన ఇంట్లో లేరు” అంది అక్కడే ఆగు అన్నట్లు. అర్థంకాక బిత్తరపోయింది ఆముక్త. అభిమానంతో అడుగు వెనక్కి తీసుకొని, వెనుదిరిగి కారెక్కి వెళ్లిపోతూ ద్రోణకి కాల్‌ చేసింది. అతని ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌లో వుంది. ఆ రోజు ఫోన్లో కృతికతో శృతిక మాట్లాడటం విని, వెళ్లిపోయిన ద్రోణ ఇంతవరకు ఇంటికి రాలేదు శృతిక ఆ […]

మాయానగరం .. 44

రచన: భువనచంద్ర “ఆపండి. ఏమిటీ ఆలోచన?”మృదువుగా అడిగింది వందన. “ఏమీలేదు వందనా? జస్ట్ ఓ ఉత్తరం. తెలిసినవాళ్లు రాసింది” మామూలుగా అవడానికి ప్రయత్నించాడుగాని, ఓ రకమైన అనిశ్చిత స్థితి ఆ సమాధానంలో బయటపడింది. వ్యక్తావ్యక్తలకి మధ్యనుండే స్థితి అది. “ఎనీ ప్రాబ్లం?” :నో.. ఇట్స్ నాటే ప్రాబ్లం” “ఎవరన్నా అమ్మాయి రాసిందా? లవ్ లెటరా?”పకపకా నవ్వింది వందన. ఆ నవ్వు వాతావరణాన్ని తేలికపరచడానికి నవ్వినట్టుంది. “అమ్మాయ్! లవ్ లెటర్ కాదుగానీ మేరేజ్ ప్రపోజల్” అప్రయత్నంగానే నిజం చెప్పాడు […]

ఇసైజ్ఞాని ఇళయరాజా

రచన: శారదాప్రసాద్ (శ్రీ ఇళయరాజాగారికి పద్మ విభూషణ్ సత్కారం లభించిన సందర్భంగా, ఆయనను అభినందిస్తూ వ్రాసిన చిన్న వ్యాసం) ఇళయరాజా … పరిచయం అక్కరలేని పేరు ఇది. పసిపిల్లల నుంచి వయోవృద్ధుల వరకు ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకప్పుడు అతని బాణీలని కూనిరాగాలుగానైనా పాడుకోనివారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. తెలుగు సినిమా సంగీతంలో ఒక నూతన శకారంభానికి కారకుడైన ఈ సంగీత మేధావిని మేస్ట్రో అని పిలిచినా, ఇసైజ్ఞాని అన్నా, అభిమానులు ఇంకెన్ని మకుటాలు తగిలించినా ఈ […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 24

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య అన్నమయ్య ఆధ్యాత్మిక కీర్తనల్లో చాలా భాగం పల్లవి కొరకరాని కొయ్య. పైకి ఒక అర్ధం గోచరిస్తూ అంతరార్ధం తరచి తరచి చూస్తే గానీ తెలియరాని పరిస్థితి. ఊహ చాలా గొప్పగా ఉంటుంది. అర్ధం మాత్రం చాలా గోప్యంగా ఉంటుంది. జీవితం అన్నది జీవి తెలిసి ఎంచుకున్నది కాదు. అది “సంభవించింది” మాత్రమే! పుట్టినప్పుడు మన శరీరం చాలా చిన్నది, ఇప్పుడిలా పెరిగి పెద్దదైంది. అంటే ఖచ్చితంగా ఈ శరీరం మనం సేకరించుకున్నదే. దేన్నైతే […]

“మనీ” షి

రచన: కంభంపాటి రవీంద్ర “లుటే కోయీ మన్ కా నగర్ ..బన్ కె మేరా సాథీ” అని అనిత పాడుతూంటే, చేతిలో ఉన్న ఐస్ కోల్డ్ గా ఉన్న కోక్ టిన్ను పట్టుకుని అలా వింటూండిపోయేడు ఆత్రేయ ! ఆఫీస్ లో ఎవరో యూఎస్ వెళ్తూంటే ఫేర్వెల్ పార్టీ జరుగుతూంది, పార్టీ అనే ఏమిటి, వాళ్ళ ఆఫీస్ లో ఏ ఫంక్షన్ అయినా కూడా అనిత పాట పాడడం అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే, అంత బాగా పాడుతుంది […]

తను కన్నతల్లి

రచన: చెంగల్వల కామేశ్వరి “అమ్మా” చిన్నగా అరిచింది విమల. సూది గుచ్చుకుంది. వేలులో దిగిన సూదిని తీసి పక్కన పెట్టింది. విమల ఆగకుండా కారుతున్న రక్తం! వదిన వంటింటి లోంచే ఏమయింది! అనడుగుతోంది. తనే గబగబా వాష్ బేసిన్ దగ్గరకు పరిగెత్తింది. రక్తం కారుతున్న వేలుని నీళ్లతో కడిగి రక్తం కారడం ఆగాక మళ్లీ వచ్చి కుర్చీలో కూర్చుని మళ్లీ అప్రయత్నంగా గోడ మీద ఉన్న ఫొటోలో నవ్వుతున్న అమ్మ ఫొటో చూసిన విమల కళ్లల్లో నీళ్లు […]

ఆపరేషన్ పాంచాలి

రచన: శ్రీదేవి న్యూయార్క్ నగరం: పొద్దున్నే నిద్ర లేస్తూనే పరుగుపెట్టే పోటీ ప్రపంచంలో మానవాళికి ఏదన్నా సహాయ పడాలి అనే ఉన్నత ఆశయాన్ని ఊపిరిగా చేసుకొని జీవితoతో పోరాడుతున్న యువకుడు దీప్. ఒక విదేశీ కుటుంబానికి భారతీయురాలైన పేద తల్లి చేత దత్తతకి ఇవ్వబడ్డాడు. తన ఆశయం కోసం ఎలాంటి ప్రమాదన్నయినా స్వీకరిస్తాడు అతడు. ప్రపంచమంటే గిరి గీసుకున్న నాలుగు గోడలు కాదని, కొన్ని కోట్ల హృదయాల సమ్మేళనమే అని మనస్ఫూర్తిగా నమ్మే వ్యక్తి. . భారత […]