March 28, 2023

కృతజ్ఞత

రచన: ఝాన్సీరాణి కె. డాక్టర్‌ హరిత వార్డ్‌ రౌండ్‌ పూర్తి చేసుకుని బయటకు వస్తూంది. హరిత పేరు పొందిక గైనకాజిస్టు. హస్తవాసి మంచిదని రోగులను ప్రేమగా చూస్తుందని మంచిపేరు వుంది. ఆవిడ గవర్నమెంట్‌ హాస్పిటల్‌లో పని చేస్తూంది. హరిత భర్త ఆదిత్య కూడా డాక్టర్‌ ఆర్థోపెడిక్‌ సర్జన్‌. హైదరాబాద్‌లో ప్రైవేట్‌ హాస్పిటల్‌లో పని చేస్తున్నాడు. అంతేకాక చాలా క్లినిక్‌కి కూడా వెళ్ళి వస్తూంటాడు. క్రిటికల్‌ సర్జరీకి చాలా నర్సింగ్‌ హోమ్స్, కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ నుంచి కూడా ఆదిత్యకు […]

కొత్త చీర

రచన : శ్రీకాంత గుమ్ములూరి. “అన్నవస్త్రాలకి పొతే ఉన్న వస్త్రం ఊడిందిట !!” “ఎవరి మీదే అక్కసు?” అడక్కుండా ఉండలేకపోయింది కొత్తగా పెళ్ళైన అక్కని. “అధముడికి భార్య అయ్యేకన్నా బలవంతుడికి భార్య అవడం మేలు …. ” ఇంకో సామెత దూసుకు వచ్చింది అక్క నోటి నుంచి బాణంలా… ‘పెళ్లై రెండు రోజులైనా కాలేదు అప్పుడే బావని తిట్టుకుంటున్నావా?” చెల్లెలి ప్రశ్న. దానికి ఆమె ఇచ్చిన తలతిక్క జవాబు అత్యంత వినసొంపు !! అనుకున్న పని అంగవస్త్రంలో […]

పాతది .. కొత్తది

రచన: రామా చంద్రమౌళి శీతాకాలపు ఆ ఆదివారం ఉదయం అతను ఆలస్యంగా నిద్రలేచాడు కిటికీ తెరిచి , తలుపు తెరిచి .. వాకిట్లోకి అడుగు పెడ్తే పల్చగా, చల్లగా, గాజుతెరలా మంచుపొర మెట్ల దగ్గర .. మల్లెపాదు మొదట్లో కుక్కపిల్ల పడుకునుంది ముడుచుకుని గేట్ దగ్గర పాల ప్యాకెట్ , రెండు దినపత్రికలు లోపలికొస్తూ ‘ ష్ ‘ అని విదిలిస్తే .. కుక్క కళ్ళు తెరిచి .. చూచి.. లేచి నాలుగడుగులు వెనుకనే నడచి వచ్చి […]

జవాబులు …?

రచన: ఉమాదేవి కల్వకోట ఎవరినడగాలి సంజాయిషీలు? కన్నవారినా, కట్టుకున్నవారినా, సమాజాన్నా, సాంప్రదాయాన్నా? ఎక్కడా దొరకదు ఈ ప్రశ్నలకు సమాధానం. ఎందుకోతెలుసా? ఈ ప్రశ్నలు సంధించేది ఒక నారి. అందుకే ఈ ప్రశ్నలకు సమాధానం దొరకదు మరి. ఆడపిల్లకు ప్రతిదశలో, ప్రతిదిశలో సమస్యల సుడిగుండాలకు ఎదురీతే. పిండదశలో బ్రూణహత్యలూ..శిశుదశలో నిర్లక్ష్యవైఖరులు శైశవదశలో ఆంక్షలూ, యవ్వనంలో అఘాయిత్యాలు, వివాహితలకు కట్నాల ఆరళ్ళు, వృద్ధాప్యంలో నిరాదరణలు. ఒక ఆడదైవుండి మరోఆడపిల్లకు జన్మనివ్వడానికి అయిష్టత ఎందుకోతెలుసా? మరో ఆడపిల్ల తనలా బాధలూ, కష్టాలు […]

పల్లె సద్దు

రచన: కొసరాజు కృష్ణప్రసాద్ తూరుపున దినకరుడు పొద్దుపొడవకముందె, చిరునవ్వి నా పల్లె నిదురలేచింది. తల్లి వెనకాలెల్లు కోడిపిల్లల ధ్వనము, దూడ దరిజేరగా పాలనిచ్చే ఎనుము – చుట్టాలు వేంచేయు వార్త మోసుకొచ్చి, నల్ల కాకులు చేయు కావు కావుల రవము! కళ్లాపి స్నానంతొ వాకిళ్ళు తడవగా, వికసించె ముంగిట్లో ముత్యాల ముగ్గులు – సంకురాతిరి శోభ సంతరించుకోగ, రంగవల్లుల మధ్య మెరిసేటి గొబ్బిళ్ళు! అరుగుపైనజేరి పత్రికలు తిరగేస్తు పెద్దమనుషులుజేయు చర్చ సద్దు – సద్దిమూటనుగట్టి, హాలము బండిలొబెట్టి, […]

తోడు

రచన: గవిడి శ్రీనివాస్ ప్రయాణాలు కొన్ని సార్లు ఒంటరిగానే తలుపులు తెరుచుకుంటాయి . కాలం కొన్ని చీకటి రాత్రుల్ని మోస్తుంది . విసిగిన చోట నక్షత్రాల్ని బంతిలా కుట్టి కాసింత వెలుగుని రాజుకుంటే బాగుణ్ణు దారిపొడుగునా రుతువులు పరిచయాలుగా పూస్తే బాగుణ్ణు ఊపిరి ఊగిసలాట ముంగిట నిలిచే ఆరాటమైతే బాగుణ్ణు కురిసే నక్షత్రాలు అలసిన సంద్రాలు జీవితానికి ముడిపడుతుంటాయి . పసిడి వెన్నెల ముద్దలు ముద్దలుగా మబ్బుల నుంచీ జారినపుడు కాళ్ళ ముందు ముచ్చట తోరణాల్ని తొడిగినపుడు […]

దయా మరణం !-కవిత

రచన: ఎమ్.వీరేశ్వరరావు దిగులు మొసలికి చిక్కిన ముసలి ! మది గదిలో చుట్టలు చుట్టుకొని విషాదం చిమ్ముతోంది వార్ధక్యం పాము ! ప్రాణం అంచున వేలాడేది దేహం ! సాక్షి గేహం ! నిత్యం మరణ స్మరణం ! రానిది మరణం దొరకనిది కారణం అంతరంగం లో ఎప్పడు అవయవాలతో నిత్యం రణం ! జ్ఞాపకాలు పత్ర రహిత శిశిర పత్రాలు ! బంధాలు తృష్ణ జనించని మృగ తృష్ణలు ! తీతువు కూత ఉన్నా రానిది […]

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

March 2018
M T W T F S S
« Feb   Apr »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031