December 6, 2023

మాలిక పత్రిక ఏప్రిల్ 2018 సంచికకు స్వాగతం

Jyothivalaboju Chief Editor and Content Head పాఠక మిత్రులు, రచయితలందరికీ మనఃపూర్వక స్వాగతం. సుస్వాగతం. ఎన్నో, ఎన్నెన్నో కొత్త కథలు, వ్యాసాలు, సీరియళ్లతో మీ ముందుకు వస్తోంది. ఏప్రిల్ 2018 సంచిక. మాలిక పత్రిక మీద మీ అందరి అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీకు నచ్చే, మీరు మెచ్చే విధంగా ఈ పత్రికను తీర్చిదిద్దడం జరుగుతుంది. మీ అభిప్రాయాలను, సలహాలు, సూచనలను మాకు తెలియజేయండి. మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com ఈ సంచికలోని విశేషాలు: […]

కంభంపాటి కథలు 1 – ఆశ

రచన: రవీంద్ర కంభంపాటి.. “అమ్మా తలుపేసుకో “ అంటూ వెళ్ళిపోతున్న సుభాష్ తో “జాగ్రత్త గా వెళ్ళిరా “ అని చెప్పేలోపే ఏదో ఫోను మాట్లాడుకుంటా వెళ్ళిపోయేడు . అయినా నా చాదస్తం కాకపోతే నా మాట వినేదెవరు ఈ ఇంట్లో ? మళ్ళీ సాయంత్రం నాలుగింటిదాకా ఒక్కదాన్నీ ఉండాలి. అసలే ఊరవతల ఎక్కడో విసిరేసినట్టుండే ఈ విల్లాల్లో “ఎలా ఉన్నారండీ “ అని పలకరించే దిక్కుండదు . ఇంట్లో కొడుకూ , కోడలూ , మనవలూ […]

గిలకమ్మ కతలు – ఎదరంతా … ఎదురీతే !

రచన: కన్నెగంటి అనసూయ “ ఎన్నోత్తా? కుంచుడు నానబోత్తావా.. ..” సీతమ్మంది బియ్యవొంక అదే పనిగా సూత్తా.. అలా సూత్తా సూత్తానే బత్తాలోంచి గుప్పెడు గింజల్దీసి కళ్లకాడికంటా తెచ్చుకుని కళ్ళింతంత సేసి మరీ సూత్తా “ఏటీ..ఇయ్యి పాత బియ్యవేనా? అలా కనిపిత్తాలేదు..” “ అయ్యా..నీతో నేనాపద్దాలాడతానేటే పిన్నే. ఆడితే నాకేగాని నీగ్గాదని నాకు దెల్దా? “ అన్నాకా నిముషమాగి.. “ ఇంకా నిరుటి బియ్యవే తింటన్నాం. అయ్యయిపోతేనేగాని పొణక్కి సిల్లెట్తం. పాత బియ్యవైతే పిండురువవ్వుద్దని , అరిసిలికి […]

కౌండిన్య హాస్యకథలు 1 – ఇదేం సరదా

రచన: రమేశ్ కలవల (కౌండిన్య) ఉద్యోగం రీత్యా గోపాలం ఆ ఊరికి ఈ మధ్యనే ఓ నెల క్రితం వచ్చాడు. పట్నంలో పనిచేసి వచ్చిన బ్యాంకు ఉద్యోగికి ఈ మోస్తరు పల్లెటూర్లో అంతా కొత్తగా అనిపిస్తున్నాయి. గోపాలానికి, అతని భార్య కామాక్షికి ఆఫీసువారు ఇచ్చిన పెద్ద పెంకుటింట్లో అలవాటు పడటానికి కొంత సమయం పట్టింది. ఆ ఇంట్లో పెరట్లోకి నడవగానే ఎదురుగుండా తులసికోట, ఒక ప్రక్క బావి, దాని ఆనుకోని ఎత్తైన కొబ్బరిచెట్లు కనపడటమే కాకుండా మరో […]

అమ్ము- ఆల్ఫా-ఇన్ఫినిటీ

రచన: శ్రీదేవి నా పేరు అలివేలు. ముద్దుగా అందరూ అమ్ము అని పిలుస్తారు. నేను చాలా తెలివయిన అమ్మాయిని అని మా పిచ్చి నాన్న నమ్మకం. ఆ అమాయకుడిని చూసి మా అమ్మ తల కొట్టుకోవటం రోజు పరిపాటే మా ఇంట్లో. ఇంతకీ అసలు నేను తెలివిగలదాన్నా ?కాదా? అన్న మీమాంసలోనే నాకు 16 యేళ్ళు వచ్చేశాయి. అన్నయ్య బోoడామ్ అని 24 గంటలు ఎక్కిరిస్తుంటే ఉక్రోషంతో మేడ మీద ఏరోబిక్స్ మొదలెట్టాను. మొదలెట్టిన పది నిమిషాలకే […]

విశ్వపుత్రిక వీక్షణం 1 – రమ్య ది రోబో

రచన:విజయలక్ష్మీ పండిట్ సూపర్ బజార్ నుండి ఇంటికి వచ్చిన లక్ష్మి వరండాలో చెప్పుల స్టాండు పై చెప్పులు వదిలి ఇంట్లోకి వెళ్లి తన హాండ్ బ్యాగ్ ఢైనింగ్ టేబుల్ పై పెట్టి బాత్రూం వైపు నడిచింది. డ్రైవర్ సామాన్ల బ్యాగ్ తెచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టి వెళ్లాడు. ఫ్రెషప్ అయ్యక కాఫీ తాగాలని వంటింటి వైపు నడుస్తూ అంతలో భర్త రామ్ కు కాఫీ టి ఏదయినా కావాలేమో అడగాలని ఆఫీస్ రూమ్ వై పు […]

బ్రహ్మలిఖితం – 17

అతన్ని చూడగానే ఎక్కడలేని ధైర్యమొచ్చింది లిఖితకి. “పాము.. పాము” అంది లేచి నిలబడి అదురుతోన్న పెదవులతో. “అదేం చేస్తుంది. అంతకంటే భయంకరమైన జంతువులున్నాయీ అడవిలో”అన్నాడతను లిఖితను దగ్గరకు తీసుకుంటూ. అతను మళయాళంలో మాట్లాడిందేమిటో అర్ధం కాకపోయినా అతని స్పర్శలో ఉన్న నీచదృష్టిని గమనించి అతని చేతుల్ని దూరంగా తోసేయ్యబోయింది లిఖిత. “ఏంటంత భయపడుతున్నావు. మగపిల్లాడివేగా. మా పెరియార్లు నిన్ను మగపిల్లాడివనుకొని బలికి తీసుకొచ్చేడు. నేనప్పుడే గ్రహించేసేను. ఈ పూజలతో విసిగి పోయినప్పుడు సరసానికి పనికొస్తావని” అంటూ ఆమెని […]

మాయానగరం 45

రచన: భువనచంద్ర జీవించడం తెలీనివాడు జీవితాన్ని మధించలేడు. అన్నీ వున్నవాడు ఎదుటివాడి ఆకల్ని ఏనాడూ గమనించలేడు. జీవితం అంటేనే ఒక ఉగాది పచ్చడిలాంటిది. అక్కడ చేదు, పులుపు, తీపి, కారం, వగరూ, వుప్పూ లాంటి రుచులుంటే, ఇక్కడ సుఖం, కష్టం, విరహం, ప్రేమ, కన్నీరు, కపటం, మోసం, మాయలాంటి అనేక విధానాలు వుంటాయి.నిన్నటి దేవుడు ఇవ్వాళా దేవుడుగానే వుంటాడని గ్యారంటీ లేదు. అదే విధంగా నిన్నటి విలన్ ఇవ్వాళా విలన్ పాత్రనే పోషిస్తాడనే నమ్మకమూ లేదు. ఆకాశంలో […]

కలియుగ వామనుడు – 5

రచన: మంథా భానుమతి హలీమ్ నలుగురికి శిక్షణ ఇస్తుంటే, వాళ్లకి అసిస్టెంట్ల కింద అబ్బాస్ లాంటి వాళ్లు అరడజను మంది ఉంటారు. నజీర్ దగ్గర పని చేస్తూనే, హలీమ్ ఫామ్ కి వచ్చినప్పుడు ట్రయినీ ముధారీ లాగ కొంత డబ్బు సంపాదిస్తాడు అబ్బాస్. అందులో సగం నజీర్ నొక్కేసి, సగం అబ్బాస్ బాంక్ లో వేస్తాడు. ఒంటె నడుస్తుంటే ఎగరకుండా, గట్టిగా మూపురాన్నీ, మెడకి కట్టిన తాడునీ పట్టుకోమని, ఎలా పట్టుకోవాలో మిగిలిన పిల్లలకి చూపిస్తున్నాడు నజీర్. […]

రెండో జీవితం 7

రచన: అంగులూరి అంజనీదేవి ఒకసారి ఆమె ముఖంలోకి జాలిగా చూసి, ‘సమస్యల్ని సృశించే నేర్పుకూడా ఓ కళేకదా!’ అని మనసులో అనుకొని, ఏమనాలో తెలియక ‘ఆల్‌ ద బెస్ట్‌’ అన్నాడు. అంతలో… పేర్స్‌ెం నుండి కాల్‌ రావటంతో ‘ఎక్స్‌క్యూజ్‌మీ’ అని ఆముక్తతో చెప్పి పక్కకెళ్లి మ్లాడి వచ్చాడు. ఆమె చాలా సేపు ద్రోణ దగ్గరే కూర్చుంది. * * * * * అర్ధరాత్రి దాక – అందరు నిద్రపోతున్న సమయంలో గంగాధరం మళ్లీ అరుస్తూ లేచాడు. […]

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

April 2018
M T W T F S S
« Mar   May »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30