March 29, 2024

చందమామ పాటలు 1

కూర్పు: మురళీకృష్ణ

మామలకు మామ చందమామ. చిన్నపిల్లలకు బువ్వ తినిపించడానికి ఆ మామను పిలుస్తారు తల్లులు. ప్రేయసీప్రియులు చందమామ ద్వారా తమ ప్రేమ సందేశాలను ఇచ్చిపుచ్చుకుంటారు. భార్యాభర్తల అన్యోన్య దాంపత్యంలో చందమామ తన వంతు సాయం చేస్తూనే ఉంటాడు. చందమామ చల్లగానూ ఉంటాడు. వేడిగానూ ఉంటాడట. ఆశ్చర్యంగా ఉంది కదా.
మన తెలుగు సినిమాలలో చందమామ ప్రస్తావనలో వచ్చిన పాటలను గూర్చి తెలుసుకుందాం. ఈ పాటలలో సంగీతం, సాహిత్యం, అభినయానికి కూడా పెద్ద పీట వేసారు. సంగీత, సాహిత్యాభిమానులమైన మనం ఆ సంపదను పదే పదే నెమరువేసుకుందాం.

1. తొలిరేయి కొత్తదంపతుల మధ్య స్నేహం, ప్రేమ చిగురించడానికి ఈ చందమామ ఎంత సాయం చేస్తున్నాడో చూడండి.

చిత్రం: గుండమ్మ కథ (1962)
సంగీతం: ఘంటసాల
గీతరచయిత: పింగళి
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల

ఎంత హాయీ…
ఎంత హాయి ఈ రేయి ఎంత మధురమీ హాయి
ఆ ఆ ఆ ఆ..
ఎంత హాయి ఈ రేయి ఎంత మధురమీ హాయి
చందమామ చల్లగ మత్తుమందు చల్లగా
ఆ..చందమామ చల్లగ పన్నీటిజల్లు చల్లగా

ఎంత హాయీ..
ఎంత హాయి ఈ రేయి ఎంత మధుర మీహాయీ.. ఎంత హా యీ

ఆ ఆ ఆ ఆ..
ఒకరి చూపులొకరిపైన విరితూపులు విసరగా
ఆ ఆ ఆ..
ఒకరి చూపులొకరిపైన విరితావులు వీచగా
విరితావుల పరవడిలో విరహమతిశయింపగా
ఆ..విరితావుల ఘుమఘుమలో మేను పరవశింపగా

ఆ ఆ ఆ ఆ…….
కానరాని కోయిలలు మనల మేలుకొలుపగా
కానరాని కోయిలలు మనకు జోల పాడగా
మధురభావ లాహిరిలో మనము తూలిపోవగా
ఆ..మధురభావ లహరిలో మనము తేలిపోవగా

2. మాయాబజారులో శశిరేఖ అభిమన్యుల ప్రేమకు తమవంతు సాయం చేయబూనుతారు రుక్మిణీ శ్రీకృష్ణులు. చల్లని వెన్నెలలో ఏ దంపతులకు మాత్రం ఏకాంతంగా గడపాలని, నౌకా ప్రయాణం చేయాలని ఉండదు..

చిత్రం : మాయాబజార్ (1957)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : పింగళి
గానం : ఘంటసాల, పి.లీల

లాహిరి లాహిరి లాహిరిలో
ఒహో జగమే వూగేనుగా
వూగేనుగా తూగెనుగా

లాహిరి లాహిరి లాహిరిలో
ఒహో జగమే వూగేనుగా
వూగేనుగా తూగెనుగా
ఆ… ఆ…ఆ… ఆ…ఆ… ఆ…

తారాచంద్రుల విలాసములతో
విరిసే వెన్నెల పరవడిలో ఉరవడిలో
తారాచంద్రుల విలాసములతో
విరిసే వెన్నెల పరవడిలో..
పూల వలపుతో ఘుమఘుమలాడే
పిల్ల వాయువుల లాలనలో

లాహిరి లాహిరి లాహిరిలో
ఒహో జగమే వూగేనుగా
వూగేనుగా తూగెనుగా
ఆ… ఆ…ఆ… ఆ…

అలల ఊపులో తీయని తలపులు
చెలరేగే ఈ కలకలలో.. మిలమిలలో
అలల ఊపులో తీయని తలపులు
చెలరేగే ఈ కలకలలో
మైమరపించే ప్రేమానౌకలో
హాయిగ చేసే విహారణలో

లాహిరి లాహిరి లాహిరిలో
ఒహో జగమే వూగేనుగా
వూగేనుగా సాగెనుగా
ఆ… ఆ…ఆ… ఆ…ఆ… ఆ…

రసమయ జగమును రాసక్ఱీడకు
ఉసిగొలిపే ఈ మధురిమలో.. మధురిమలో
రసమయ జగమును రాసక్ఱీడకు
ఉసిగొలిపే ఈ మధురిమలో
ఎల్లరి మనములు ఝల్లన జేసే
చల్లని దేవుని అల్లరిలో…

లాహిరి లాహిరి లాహిరిలో
ఒహో జగమే వూగేనుగా
వూగేనుగా తూగెనుగా
ఆ… ఆ…ఆ… ఆ…ఆ… ఆ..

3. చల్లని నిశిరాతిరిలో నదీ జలాలతో తేలియాడుతూ ప్రేయసీ ప్రియుల పడవ ప్రయాణంలో ఎంతహాయి. ఊహించుకుంటేనే మనసు పరవశిస్తుంది.
చిత్రం : మర్మయోగి (1963)

సంగీతం : ఘంటసాల
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : ఘంటసాల, పి. లీల

ఆ…ఆ…ఆ…ఓ…ఓ..ఓ..
నవ్వుల నదిలో పువ్వుల పడవ కదిలే
అది మైమరపించే హాయి… ఇక రానే రాదీ రేయి

నవ్వుల నదిలో పువ్వుల పడవ కదిలే
అది మైమరపించే హాయి ఇక రానే రాదీ రేయి

అనుకోని సుఖం పిలిచేను…అనురాగ మధువు వొలికేను
అనుకోని సుఖం పిలిచేను…అనురాగ మధువు వొలికేను
కొనగోటితో నిను తాకితే…పులకించవలయు ఈ మేను
అహ…అహ…అహ…

నవ్వుల నదిలో పువ్వుల పడవ కదిలే
అది మైమరపించే హాయి… ఇక రానే రాదీ రేయి

నిదురించవోయి వడిలోన…నిను వలచెనోయి నెరజాణ
నిదురించవోయి వడిలోన…నిను వలచెనోయి నెరజాణ
అరచేతిలో వైకుంఠము…దొరికేను నీకు నిముషాన

నవ్వుల నదిలో పువ్వుల పడవ కదిలే
అది మైమరపించే హాయి… ఇక రానే రాదీ రేయి
ఆ…ఆ…ఆ…ఓ…ఓ..ఓ…ఓ…ఓ…

4. వెన్నెలకి, మల్లెపూలకి అవినాభావ సంబంధముంది. ఎంత వేసవి మంటలైనా సాయంత్రం విరిసే మల్లియలు, రాతిరి కురిసే వెన్నెల జల్లులు మనసును చల్లబరిచేస్తాయంటే నమ్ముతారా . ఇది నిజమని ప్రేమికులు ఒప్పుకుంటారు. పైగా వెన్నెలలో ఘుమఘుమలు అంటున్నారు. అందులో కోరికలు, గుసగుసలు ఎన్నో ఎన్నెన్నో.

చిత్రం :- మనుషులు మమతలు
గాయకులూ :- పి.సుశీల
సంగీతం:- టి.చలపతిరావు
రచయత:- సి.నారాయణరెడ్డి

వెన్నెలలో మల్లియలు..మల్లెలలో ఘుమఘుమలు.
ఘుమఘుమలో గుస గుసలు..ఏవేవో కోరికలు.

నీ హృదయములో నిలవాలని..నీ కౌగిలిలో కరగాలని
నీవే నీవే కావాలని..ఏవేవో కోరికలు…
వెన్నెలలో.

పూల పల్లకిలోన తేలిపోయే సమయానా..
బుగ్గల సిగ్గులు తొనకాలని..అవి నీకే నీకే ఇవ్వాలని
ఏవేవో కోరికలు..ఏవేవో కోరికలు.

5. ఈ చందమామ భలే చిక్కులు తెచ్చిపెడతాడు. హాయిగా ఉండనీడు. ముఖ్యంగా దూరంగా ఉన్న ప్రేయసీ ప్రియులకు తన మాయలతో వారి విరహాన్ని మరింతగా పెంచి ఎప్పుడెప్పుడు ఒక్కటవుదామా అనిపిస్తుంది. మరీ అల్లరోడు.

చిత్రం : బందిపోటు (1963)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : సినారె
గానం : ఘంటసాల, సుశీల

ఊ హూ హూ.. ఊ ఊ ఊ…
ఊ ఊ ఊ…. ఊ ఊ ఊ
ఊ హూ హూ.. ఊ ఊ ఊ…
ఊ ఊ ఊ…. ఊ ఊ ఊ

ఊహలు గుసగుసలాడే
నా హృదయము ఊగిసలాడే
ప్రియా… ఊ
ఊహలు గుసగుసలాడే
నా హృదయము ఊగిసలాడే

వలదన్న వినదీ మనసు
కలనైన నిన్నే తలచు
వలదన్న వినదీ మనసు
కలనైన నిన్నే తలచు
తొలిప్రేమలో బలముందిలే
అది నీకు మునుపే తెలుసు

ఊహలు గుసగుసలాడే
నా హృదయము ఊగిసలాడే

నను కోరి చేరిన బేలా
దూరాన నిలిచేవేలా
నను కోరి చేరిన బేలా
దూరాన నిలిచేవేలా
నీ ఆనతి లేకున్నచో
విడలేను ఊపిరి కూడా

ఊహలు గుసగుసలాడే
నా హృదయము ఊగిసలాడే

దివి మల్లెపందిరి వేసే
భువి పెళ్ళిపీటను వేసే
దివి మల్లెపందిరి వేసే
భువి పెళ్ళిపీటను వేసే
నెర వెన్నెల కురిపించుచు
నెలరాజు పెండ్లిని చేసే

ఊహలు గుసగుసలాడే
మన హృదయములూయలలూగే

6. కొత్తదంపతుల తొలిరాత్రినాడు వారిని మరింత దగ్గర చేయడానికి చందమామ కూడా ఉండాల్సిందే. వారిద్దరి మధ్య ప్రేమాభిమానాలు, కోరికలు ఇనుమడింపజేస్తాడు.

చిత్రం : చిట్టి చెల్లెల్లు (1970)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : సినారె
గానం : బాలు, సుశీల

ఈ రేయి తీయనిది
ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిది
ఇంతకు మించి ఏమున్నది

ఏవేవొ కోరికలు ఎదలో
ఝుమ్మని అంటున్నవి
ఆ కొంటె మల్లికలు
అల్లన దాగి వింటున్నవి

పన్నీటి తలపులు నిండగా
ఇన్నాళ్ళ కలలే పండగా
పన్నీటి తలపులు నిండగా
ఇన్నాళ్ళ కలలే పండగా
చిన్నారి చెలియ అపరంజి కలువ
చేరాలి కౌగిట జిలిబిలి నగవుల

ఏవేవొ కోరికలు ఎదలో
ఝుమ్మని అంటున్నవి
ఆ కొంటె మల్లికలు
అల్లన దాగి వింటున్నవి
ఆఆఅ..ఆఅహహ..ఆహా..

పరువాలు పల్లవి పాడగా
నయనాలు సయ్యాటలాడగా
పరువాలు పల్లవి పాడగా
నయనాలు సయ్యాటలాడగా
నిను చేరుకోగ నునుమేని తీగ
పులకించి పోయెను తొలకరి వలపుల

ఈ రేయి తీయనిది
ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిది
ఇంతకు మించి ఏమున్నది

ఎన్నెన్ని జన్మల బంధమో
ఏ పూల నోముల పుణ్యమో
ఎన్నెన్ని జన్మల బంధమో
ఏ పూల నోముల పుణ్యమో
నిను నన్ను కలిపె నీ నీడ నిలిపె
అనురాగ సీమల అంచులు దొరికే

ఈ రేయి తీయనిది
ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిది
ఇంతకు మించి ఏమున్నది

7. ఈ ప్రేమికులకు చందమామ ఎంత ఆత్మీయుడు, దగ్గరివాడంటే నీ వన్నెలు, చిన్నెలన్నీ మాకే అంటారు. మాకు సాయం చేయమంటారు. మళ్లీ అస్తమానం మా వెంట రాకంటారు. అయినా అతనేమీ కోపగించుకోడు. నవ్వుతూ తోడుంటాడు.

చిత్రం : భట్టి విక్రమార్క (1961)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : అనిశెట్టి సుబ్బారావు
గానం: ఘంటసాల, పి.సుశీల

ఓ నెలరాజా వెన్నెల రాజా
నీ వన్నెలన్ని చిన్నెలన్ని మాకేనొయ్
మా వెన్నుతట్టి పిలిచిందీ నీవేనొయ్.. ఓ నెలరాజా…

ఓ…. ఓ…
చల్లగాలి జాడలో తెల్లమబ్బు నీడలో..
చల్లగాలి జాడలో తెల్లమబ్బు నీడలో
ఓ….ఓ..ఓ..ఓ..
కొంటె చూపు నీకేలా చంద్రుడా
నా వెంటనంటి రాకోయీ చంద్రుడా
ఆ…
ఓ నెలరాజా వెన్నెల రాజా
నీ వన్నెలన్ని చిన్నెలన్ని మాకేనొయ్
మా వెన్నుతట్టి పిలిచిందీ నీవేనొయ్….ఓ నెలరాజా…

ఆ..ఆ..
ఆ..ఆ..ఆ..
ఆ..ఆ..ఆ..ఆ
కలువల చిరునవ్వులే కన్నెల నును సిగ్గులే
ఓ…ఓ..ఓ..ఓ..
కలువల చిరునవ్వులే కన్నెల నును సిగ్గులే
వెంటనంటి పిలిచినపుడు చంద్రుడా
వాని విడవ మనకు తరమవున చంద్రుడా
ఆ..ఆ..ఆ..ఆ..
ఓ నెలరాజా వెన్నెల రాజా
నీ వన్నెలన్ని చిన్నెలన్ని మాకేనొయ్
మా వెన్నుతట్టి పిలిచిందీ నీవేనొయ్…. ఓ నెలరాజా…

లేత లేత వలపులే పూత పూయు వేళలో…
కలవరింత లెందుకోయి చంద్రుడా..
నా చెలిమి నీదెకాదటోయి చంద్రుడా..
కలవరింత లెందుకోయి చంద్రుడా..
నా చెలిమి నీదెకాదటోయి చంద్రుడా..
ఆ..ఆ..ఆ..ఆ
ఓ నెలరాజా వెన్నెల రాజా
నీ వన్నెలన్ని చిన్నెలన్ని మాకేనొయ్
మా వెన్నుతట్టి పిలిచిందీ నీవేనొయ్….ఓ నెలరాజా…

8. మళ్లీ అదే చందమామను దూరమైన ప్రేమికులు తమ జాలిగాథ వినమని, విడిపోయిన తమ జంటని కలపమని ప్రార్ధిస్తుంటారు. సంతోషమైనా, బాధైనా, ప్రేమైనా, విరహమైనా చెప్పుకోడానికి చందమామే దిక్కు.

చిత్రం : మల్లేశ్వరి – 1951
సంగీతం : సాలూరి రాజేస్వర రావు
రచన : దేవులపల్లి
పాడినవారు : భానుమతి, ఘంటసాల

ఎవరు ఏమని విందురూ
ఎవరు ఏమని విందురూ
ఎవ్వరేమని కందురూ
ఈ జాలి గాధ ఈ విషాద గాధ
నెలరాజా వెన్నెలరాజా
నెలరాజా వెన్నెలరాజా
వినవా ఈగాధా
నెలరాజా వెన్నెలరాజా
యేనాడో ఏకమై కలసిపోయిన జంట ఏకౄరదైవమో ఎడబాటు చేసెనే
ఊరు గుడిలో రావికావల నాటి వలపుల మాటాలన్ని
నేలపాలైపోయనే గాలిమేడలు కూలినే
నెలరాజా వెన్నెలరాజా వినవా ఈగాధా
నెలరాజా వెన్నెలరాజా
ఆ రావి ఆ బావి ఆ స్వామి సాక్షిగా
ఆనాటి బాధలూ అన్ని కలలాయనే
విడిచివచ్చే వేళతెలవని అడుగనైనా అడుగలేదని
ఎంతగా చింతించెనో ఏమనుచూ దుఖించెనో
పొగిలి గుండెలు పగిలెనే తుదకు బాధలు మిగిలనే
నెలరాజా వెన్నెలెరాజా వినవా ఈగాధా
నెలరాజా వెన్నెలరాజా

9. ప్రేమికుల మధ్య జరిగే సరాగాల కవ్వింతలలో చందమామకు ఏం పని. అయినా వాళ్లు అతనిని వదలరుగా. నెలరాజుని సాకుగా పెట్టుకుని ఎన్ని ముచ్చట్లో వారికి.

చిత్రం : రాముడు-భీముడు (1964)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల

తెలిసిందిలే తెలిసిందిలే.. నెలరాజ నీ రూపు తెలిసిందిలే
తెలిసిందిలే తెలిసిందిలే.. నెలరాజ నీ రూపు తెలిసిందిలే

చలిగాలి రమ్మంచు పిలిచింది లే.. చెలి చూపు నీ పైన నిలిచింది లే
చలిగాలి రమ్మంచు పిలిచింది లే.. చెలి చూపు నీ పైన నిలిచింది లే

ఏముందిలే .. ఇపుడేముందిలే
ఏముందిలే .. ఇపుడేముందిలే
మురిపించు కాలమ్ము ముందుంది లే.. నీ ముందుంది లే
తెలిసిందిలే తెలిసిందిలే.. నెలరాజ నీ రూపు తెలిసిందిలే

వరహాల చిరునవ్వు కురిపించవా.. పరువాల రాగాలు పలికించవా
ఆ .. ఆ .. ఓ .. ఓ ..ఆ….
వరహాల చిరునవ్వు కురిపించవా.. పరువాల రాగాలు పలికించవా

అవునందునా.. కాదందునా
అవునందునా కాదందునా
అయ్యారే విధి లీల అనుకొందునా ..అనుకొందునా
తెలిసిందిలే తెలిసిందిలే.. నెలరాజ నీ రూపు తెలిసిందిలే

సొగసైన కనులేమో నాకున్నవి.. చురుకైన మనసేమో నీకున్నది
సొగసైన కనులేమో నాకున్నవి.. చురుకైన మనసేమో నీకున్నది

కనులేమిటో.. ఈ కథ ఏమిటో
కనులేమిటో ఈ కథ ఏమిటో
శృతి మించి రాగాన పడనున్నది.. పడుతున్నది

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ …….. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే

10. తను ప్రేమించే , ఆరాధించే ప్రియుడు నిదురిస్తున్నవేళ గాలి, నీరు, వెన్నెలను కూడా సడి సేయొద్దని కోరుకుంటుంది ఈ ప్రేయసి. అతని నిదుర చెదిరిందంటే నేనూరుకోను అని బెదిరిస్తుంది కూడాను..

చిత్రం: రాజమకుటం (1961)
సంగీతం: మాస్టర్ వేణు
గీతరచయిత: దేవులపల్లి
నేపధ్య గానం: పి. లీల

“సడిసేయకో గాలి
సడిసేయబోకే
బడలి వడిలో రాజు
పవ్వళించేనే …. సడి సేయకే ….

రత్న పీఠిక లేని రారాజు నా స్వామి
మణికిరీటము లేని మహరాజు గాకేమి
చిలిపి పరుగులు మాని
వొలికి పోరాదే …. సడిసేయకే

ఏటి గలగలలకే ఎగసిలెచేనే
ఆకు కదలికలకే అదరి చూసేనే
నిదుర చెదరిందంటే నేనూరుకోనే …. సడిసేయకే

పండు వెన్నెలనడిగి పాన్పు తేరాదే
ఈడ మబ్బుల దాగు నిదురదే రాదే
విరుల వీవన పూని విసిరి పోరాదే ….

సడిసేయకో గాలి సడిసేయబోకే
బడలి వడిలో రాజు పవ్వళించేనే …..

11 thoughts on “చందమామ పాటలు 1

  1. వెన్నెలలో మల్లియలు మల్లియలో ఘుమఘుమలు
    ఈరేయితీయనిది ఈచిరుగాలి మనసైనది
    చందమామా అందాలమామ
    నీఎదుటనేను వారెదుటనీవు మాఎదుట ఓమామ ఎప్పుడుంటావు
    అంటూ తమలోని ప్రేమానురాగాలను చంద్రునితో విన్నవించుకొనే ప్రేమికులకు పోస్ట్ మన్ లాంటి చంద్రుడు అప్పటికీ ఇప్పటికీ ఆ పనిలోనే విసుగూ విరామం ఎరుగక అందరి మామగా అందని మామగా సాగిపోతూ కొంత తడ మీ చెంత విశ్రమించాడు.
    మీ క్రృషికి అభినందనలు

    1. ధన్యవాదాలండి నాగ్ గారు …. మీరు రాసిన “చందమామ, అందాలమామ” పాట కూడా ఉన్నదండి.

  2. కంగ్రాట్స్ మురళీగారు.. మీ “” చందమామ సినీ పాటల కూర్పు నిజంగా ఓమంచి ప్రయత్నం. అందుకే మన ” ఫేస్ బుక్ మితగరులతో ‘ పాటు “Mallika.org” వారూ స్పందించారు.” ఇంతంతై వటుడింతై” లా ఎదగాలని ఆశిస్తూ, అలగే ” mallika.org ” గారి మంచి అభిరుచికి అభినందనలు.

  3. చందమామ పాటలు వెన్నెలంత చల్లగా వున్నాయి మురళీకృష్ణ గారు ఇలా గుర్తింపు రావడం ముదావహం…. అభినందనలు

    1. ధన్యవాదాలండి వదిన గారు

  4. వెన్నెల రేడు…వయసుతో సంబంధం లేకుండా అందరికీ హాయిని పంచగలిగిన స్నేహితుడు. వివిధ సందర్భాలలో మన చలన చిత్రాలలో రేరాజు ని ఒక పాత్రగా చేసి చిత్రీకరించిన పాటల సమాహారం…చాలా బాగుంది అన్నగారూ..

  5. It’s a very nice attempt to make the other best side of Murali Krishna garu immortal! Thank you Murali Krishna garu and Maalika.

Leave a Reply to అధరాపురపు మురళీ కృష్ణ Cancel reply

Your email address will not be published. Required fields are marked *