May 19, 2024

మాలిక పత్రిక మే 2018 సంచికకు స్వాగతం

Jyothivalaboju Chief Editor and Content Head   అనివార్య కారణాల వల్ల మాలిక పత్రిక మే 2018 సంచిక కాస్త ఆలస్యంగా విడుదల అయింది. క్షమించాలి.. బోలెడు కథలు, కవితలు, వ్యాసాలు, సీరియళ్లు మీకోసం ముస్తాబై వచ్చాయి. ప్రతీనెల మీరు చదువుతున్న రచనలు ఆసక్తికరంగా ఉన్నాయని భావిస్తున్నాము. ఎటువంటి సలహాలు, సూచనలైనా మీరు మాకు పంపవచ్చు. పాఠక మహాశయులు, రచయితలు అందరికీ శుభాకాంక్షలు మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com ఈ సంచికలోని విశేషాలు: 1. […]

ఒక చిన్నారి చెల్లి .. 2

రచన: అనామిక తాయిలం కొనుక్కున్నాను కానీ ఒక్కరోజులో తినేస్తే ఐపోతుంది.అమ్మ రోజూ డబ్బులివ్వదు గా. ఏం చెయ్యాలి? కొంచెం దాచుకుంటే? అమ్మో! ఎవరైనా తినేస్తారేమో! దాచినా ఎవరికీ కనబడకుండా దాచాలి. చాలా సేపు ఆలోచించి కొంచెం పీచు మిఠాయి తిన్నాను. జీడిపాకం తో చేసిన పిల్లి బొమ్మ తినేసాను.వాచీ మాత్రం దాచుకోవాలనుకున్నాను. చిన్నన్నయ్య పాత కంపాస్ బాక్స్ నా బాగ్ లో దాచుకున్నాను. బలపాలు పెట్టుకుందుకు. ఆ బలపాలు తీసి ఒక చిన్న కాగితం లో పొట్లాంకట్టి, […]

బ్రహ్మలిఖితం – 18

రచన: మన్నెం శారద ఓంకారస్వామి కళ్ళు తెరచి ఒక కనుబొమ్మ సాధ్యమైనంత పైకెత్తి వెంకట్ వైపు చూశాడు సీరియస్ గా. వెంకట్ అసహనంగా దిక్కులు చూస్తూ నిలబడ్డాడు. వెంకట్ తనకు నమస్కరించకుండా చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్న వైనమర్ధమయింది ఓంకారస్వామి రూపంలో ఉన్న నారాయణకి. “ఏంటి పెళ్లికొడకా? అత్తగారింట్లో తిన్న అరిసెలు, మినపసున్నుండలు ఇంకా అరిగినట్టు లేదు. ఇటువైపు సీత కన్నేసే వేంటి?” అన్నాడు తన ఏకాంత మందిరంలో బూరుగు దూది పరుపుల మీద పడుకుని భక్తులు భక్తిప్రపత్తులతో […]

గిలకమ్మ కతలు – నందినోర్రావుడు ఈడేరిందంటల్లా..!

“ లచ్చివొదినే.. ఇనపళ్ళేదా? ఏంజేత్నా..వంటవ్వలేదా ఏటి..ఇటో అడుగెయ్..?” బాగ్గెలచ్వి ఇంటి ఈధరగు మీదున్న తంబానికి నడుంజేరేత్తానే గుమ్మాలోంచి లోనకంటా సూత్తా సూరయ్యమ్మన్న మాటకి సుట్టింట్లో పప్పు గుత్తితో ముద్దపప్పు మెదాయిత్తన్న ఆ ఇంటావిడికి పేనాల్లేచొచ్చినట్తయ్యి దాన్నామట్నే వొదిలేసి సెయ్యి కడుక్కుని సెంగుకి తుడ్సుకుంటా..బేటికొచ్చి “ఏదీ కానేల గేదీన్నట్టు ..ఇయ్యాల్టప్పుడు ఇలాగొచ్చేవేటి..? ముంతెట్టేసేవేటి “ ఈపుని గోడకి జేరేసి కూకుంటా అంది. “ బియ్యం కడిగి నానబెట్టిటొచ్చేను ..సేలో మందేత్తాకి ఇయ్యాల తెల్లారగట్తే ఎల్లేరు. పాలెర్నంపుతారంట ముంతకి. అయ్యి […]

మాయానగరం 46

రచన: భువనచంద్ర రెండు శవాలు. ఒకటి చాకు గుండెల్లో సూటిగా గుచ్చుకుపోగా చచ్చిపోయిన మహాదేవన్‌ది. రెండోది త్రాచుపాము కాటుతో చనిపోయిన పరమశివానిది. చాకుమీద వేలిముద్రలు పరమశివానివని రుజువు కావాలి. త్రాచుపాము కోరల గుర్తులు రుజువయ్యాయి. కోరల గుర్తులే కాదు నల్లగా విషంతో మాడిన శరీరమూ, నోటి నుండి నురగ. మౌనదేవతలా నిల్చుంది నందిని. ఎంతమంది కూర్చోమన్నా కూర్చోలేదు. తెల్లార్లూ నిలబడే వుంది. నిలబడే ఓపిక లేక కూర్చుండిపోయాడు వెంకటస్వామి. అతని కళ్ళల్లో నీరు ఇంకిపోయింది. పోలీస్ స్టేషన్ […]

కంభంపాటి కథలు-2 – ‘చుట్ట’పు చూపు

రచన: కంభంపాటి రవీంద్ర ‘పూర్వం రోజుల్లో మా అక్కా వాళ్ళ కుటుంబం శెలవులకి హైదరాబాద్ వచ్చినప్పుడు అందరం కలిసి భలే సరదాగా గడిపేవాళ్ళం కదండీ. ఇల్లంతా చాలా సందడిగా ఉండేది’ అంది రాధిక. ఆఫీసు నుంచొచ్చి బాత్రూంలో కాళ్ళూచేతులూ కడుక్కుంటున్న వాళ్ళాయన శ్రీధర్ ’మీ అక్కా వాళ్ళు గుర్తొస్తున్నారా? ఈ ఏడాది శెలవులకి వాళ్ళని ఇక్కడికి రమ్మని ఫోన్ చేయాల్సింది. ఇప్పటికైనా ఏమొచ్చింది. వాళ్ళకోసారి ఫోన్ చేసి పిలవొచ్చుగా ?. వద్దులే. మీ బావగారికి నేనే ఫోన్ […]

రెండో జీవితం – 7

రచన: అంగులూరి అంజనీదేవి ”నేను ఆర్‌.టి.సి. బస్‌లో పనిచేస్తున్న రోజుల్లో నా భార్య డబ్బు మీద ఆశతో నన్ను బాగా సంపాయించమనేది. జీతాన్ని మించిన సంపాదన నాకెలా వస్తుంది? రోజుకోరకంగా, ఏదో ఒకటి లేదంటూ తనలోని వెలితిని బయటపెట్టి బాధపడేది. నన్ను బాధపెట్టేది. రాను రాను ఇంటికి రావాలంటేనే భయపడేవాడిని… అప్పటికే శ్యాం పుట్టాడు. శ్యాం కోసమైనా నేను నా భార్య మాట వినాలి. లేకుంటే నన్ను ఇంటికి రానివ్వదు. బస్‌లో టికెట్స్ ఇవ్వకుండానే ప్రయాణీకుల దగ్గర […]

కలియుగ వామనుడు – 6

రచన: మంథా భానుమతి మళ్లీ ఎలాగా ట్రాక్ కెళ్లాలి. ఆ రోజు చాలా పనే చేయించారు వాళ్ల చేత. ఎప్పడెప్పుడు కాసేపు వాలదామా అని చూస్తున్నారు. చిన్నా టి.వి ఆన్ చేశాడు. వెంటనే ఆన్ అయింది. చిన్నాకి ఆనందంతో గంతులేయాలనిపించింది. అయితే.. ఒక్క దుబాయ్ ప్రోగ్రామ్స్ మాత్రమే వస్తున్నాయి. కేబుల్ కనెక్షన్ లేదు. ఎక్కువ అరేబిక్.. ఏదో ఒకటి. కొత్త మనుషులు, కొత్త పరిసరాలు కని పిస్తున్నాయి. అందులో అరాబిక్ లెసన్స్ ఒక ఛానల్ లో వస్తోంది. […]

చందమామ పాటలు – 2

చందమామ రావె.. జాబిల్లి రావె అంటూ బిడ్డను చంకనెత్తుకొని తల్లులు గోరుముద్దలు తినిపించే సన్నివేశాలు కనిపించేవి ఒకప్పుడు.ఏ సాంకేతిక ఆటవస్తువులు, ఉపకరణాలు లేని రోజుల్లో నింగిలో మెరిసే చందమామే ఆటవస్తువు. చందమామను అద్దంలో చూపేవరకూ బాల రాముడు పాలబువ్వ తినేవాడు కాదనీ పురాణాల్లోను, పుస్తకాల్లోనూ చదువుకున్నాం. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో తరచుగానే సందర్భానుగుణంగా చందమామను చూపించే సన్నివేశాలు ఉండేవి. ఇప్పుడూవున్నా -అప్పుడప్పుడనే చెప్పాలి. నిజానికి దక్షిణాదిన రూపుదిద్దుకున్న అనేక సినిమాల్లో చందమామ కూడా ఒక పాత్రధారే. అమ్మ […]

పాజిటివ్ థింకింగ్

రచన: గిరిజ కలవల పూజ, టిఫిన్ అవగానే…. వంటకు తొందరలేదు.. ఈరోజు లంచ్ కి ఈయన ఎలాగూ రానన్నారు.. నెమ్మదిగా ఆలోచిద్దాం దాని సంగతి అనుకుంటూ, చాలా రోజులుగా పెండింగ్ లో వున్న నవలని తీసుకుని సోఫాలో చతికిలపడ్డాను. రెండు పేజీలు చదివానో లేదో, వసుధ దగ్గరనుండి ఫోను వచ్చింది. ” వాణీ… ఏం చేస్తున్నావు…. ఉన్నపళంగా బయలుదేరి మా ఇంటికి రా..” అంది.. ఏమీటే సంగతి అని అన్నా కూడా ఏం చెప్పలేదు. ఇక చేసేదేం […]