*మొగ్గలు*

 

రచన:   – డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్

 

చీకటిలోకి ప్రయాణం చేస్తూనే ఉంటాను

వెలుగుచుక్కలను వెతికివెతికి ముద్దాడాలని

కిరణాలు వెలుతురు చినుకులు

 

దుఃఖాలను దిగమింగుతూనే బతుకుతుంటాను

జీవనసమరంలో ఆటుపోట్లు సహజాతిసహజమని

సుఖదుఃఖాలు జీవితంలో ఆలుమొగులు

 

కష్టాలతోనే జీవననౌకను నడుపుతుంటాను

ఆనందాల తీరాన్ని సునాయాసంగా చేరాలని

ఆనందాలు కౌగిట్లో వాలే పక్షులు

 

పూలను చూసి గర్వంగా మురిసిపోతుంటాను

స్వేచ్ఛగా నవ్వుతూ పరిమళాన్ని పంచుతాయని

పూలు మనసుకు హాయినిచ్చే మలయమారుతాలు

 

తొలకరి చినుకులకు జోలె పడుతుంటాను

పంటలన్నీ పసిడిరాశులుగా పండిపోవాలని

అన్నదాతకపుడే ఆనందాల హరివిల్లు

 

 

 

 

 

1 thought on “*మొగ్గలు*

Leave a Comment