June 25, 2024

లాస్య – నేటి తరం అమ్మాయి

రచన: మణికుమారి గోవిందరాజుల కళ్యాణమంటపంలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. పెళ్ళివాళ్ళు అలిగారట అంటూ. పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఈ రోజుల్లో కూడానా అనుకుంటూ. “అబ్బా! మళ్ళీ వెనకటి రోజులొచ్చాయి. పెళ్ళికొడుకుల తల్లులు యేమి ఆశిస్తున్నారో? యెందుకు కోపాలు తెచ్చుకుంటున్నారో అర్థం కావడం లేదు. “ఇంతకీ ఇప్పుడెందుకో కోపాలు?కారణమేంటొ?” “యేమీ లేదు. హారతి ఇచ్చేప్పుడు రెండు వత్తుల బదులు ఒకటే వత్తి వేసారట అదీ కోపం.” “అది కాదులే పెళ్ళికొడుకు తల్లి అన్నగారి తోడల్లుడి కూతురి తోడికోడలి […]

కౌండిన్య హస్యకథలు – 2 – ఇడ్లీ డే క్యాట్ వాక్ విత్ ఇడ్లీస్

రచన: రమేశ్ కలవల   ఆ రోజు ఇడ్లీ జంట తమను తాము చూసుకుంటూ ఎంతో మిడిసి పడుతున్నాయు. వాటిని చూసి అక్కడున్న రెండు వడలు “ఎందుకో అంత మిడిసిపాటు?” అన్నాయి అందులో మిస్టర్ ఇడ్లీ కొంచెం గర్వం ప్రదర్శిస్తూ “ఈ రోజు తారీకు ఎంతో తెలుసా” అని అడిగాయి. “తారీకులు గుర్తుపెట్టునేంత ఏ సంగతో?” అన్నాయి వడలు “ఈ రోజు మార్చి మప్పై. ప్రపంచమంతా ఇడ్లీల దినాన్ని ఘనంగా మూడేళ్ళ నుండి చేసుకుంటున్నారు. మీకు ఏమి […]

తేనెలొలుకు తెలుగు-2

రచన: తుమ్మూరి రామ్మోహనరావు భాషలోని తియ్యదనం తెలియాలంటే కొంచెం వెనక్కి వెళ్లక తప్పదు. నగరాలు ఇంతగా అభివృద్ధి చెందని కాలంలో గ్రామీణ జీవితాల్లోకి తొంగి చూస్తే… అప్పటి ఆటలు, పాటలు, వేడుకలు, సంబరాలు, జాతరలు, బారసాలలు, వ్రతాలు, నోములు, పెళ్లిళ్లు, పేరంటాలు అన్నీ సాహిత్యంతో ముడిపడి ఉన్నవే. పుట్టిన దగ్గర్నుంచి పుడకల్లోకి చేర్చేదాకా అన్ని సందర్భాలను సాహిత్యమయం చేశారు మనవాళ్లు. పుట్టిన పిల్లవాడు ఏడుస్తుంటే ఊరుకోబెట్టడానికి తల్లి చిన్నగా రాగం తీస్తూ పాట పాడుతుంది. ఏమని. . […]

సినీ (మాయా)లోకం – తారే జమీన్ పర్

పరిచయం: సరితా భూపతి ఎప్పట్లాగే ఈ సంవత్సరమూ ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి. తొమ్మిది వందల తొంభై ఆరు మార్కులు సాధించిన విద్యార్థిని ఆ నాలుగు మార్కులేమయ్యాయని అరిచారు. సబ్జెక్ట్ పోయిన విద్యార్థిని వెలివేసారు. తక్కువ మార్కులొచ్చిన విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎంత సాధారణంగా వినగల్గుతున్నామో ఇవన్నీ. పువ్వుల్లాంటి పిల్లల బాల్యాన్ని చదువుల పేరుతో ఎలా నలిపేస్తున్నామో! పొద్దు పొద్దున్నే నిద్రలేపి, గాడిద బరువులు భుజానికేసి బడికి పంపిస్తాం. రాచిరంపాన పెట్టే చదువులు, పనిష్మెంట్లు బడిలో. ఇంటికి రాగానే […]

జీవితమే ఒక పెద్ద పోరాటం

రచన: నిర్మల సిరివేలు అమ్మా! అమ్మా! అని పిల్లలు ఏడుస్తూ ఉన్న హృదయ విదారకమైన సంఘటన చూస్తే ఎటువంటి వారికైనా కంతనీరు రాకమానదు. పాలుతాగే పసిబిడ్డను వదిలి ఆ కన్నతల్లి ఎలా వెళ్లగలిగిందో ఏమో పైలోకాలకి వెళ్లిపోయింది. పెద్దపిల్ల అమ్మా అని ఏడుపు. చిన్నబిడ్డకు ఏమీ తెలియని పసి వయసు. ఆకలితో పాలకోసం తల్లి మీద పడి ఏడుస్తూ ఉంది. చూసినవాళ్లు ఆ బిడ్డను పక్కకు తీసికెళ్ళి ఆ తల్లిని సాగనంపడానికి ఆలోచనలు చేస్తున్నారు. ఆ శవాన్ని […]

మనోవేదికపై నర్తించిన అక్షరరవళి

రచన: సి.ఉమాదేవి ఆంగికం భువనం యశ్య వాచికం సర్వవాఙ్మయమ్ ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్త్వికం శివమ్ అభినయ దర్పణములో ప్రారంభ శ్లోకంతో కోసూరి ఉమాభారతి రచించిన వేదిక నవలపై సమీక్ష ప్రారంభించడానికి కారణం నవల నడిచిన కాదు నర్తించిన తీరు. భరతముని రచించిన నాట్య శాస్త్రమును నాట్యవేదమంటారు. వేదిక నవల నాట్యశాస్త్రాన్ని గుర్తు చేయడం కాకతాళీయమే కాని విభిన్న నృత్యాంశాలకు చక్కటి మార్గదర్శినిగా నిలిచిన నాట్యశాస్త్రం నృత్యాభిలాష ఉన్నవారికి కరదీపిక అని పునశ్చరణ చేసుకోవడం నవలలో […]

ఏనుగు లక్ష్మణ కవి

రచన: శారదా ప్రసాద్ ఏనుగు లక్ష్మణ కవిగారు క్రీ. శ. 18 వ శతాబ్దికి (1797) చెందిన వారు. ఈయన తల్లిగారి పేరు పేరమాంబ, తండ్రిగారి పేరు తిమ్మకవి. జన్మ స్థలము పెద్దాపురము (ప్రస్తుత తూర్పుగోదావరిజిల్లాలోని సామర్లకోటకు దగ్గరులో ఉన్నది). శ్రీ లక్ష్మణ కవిగారి ముత్తాతగారు “శ్రీ పైడిపాటి జలపాలామాత్యుడు”. ఈయన పెద్దాపుర సంస్థానీసాధీశ్వరుల యొద్ద ఏనుగును బహుమానముగా పొందుట చేత కాలక్రమేణ వీరి ఇంటిపేరు “పైడిపాటి” నుండి “ఏనుగు” వారిగా స్దిర పడినది. ఆ జలపాల […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 26

    విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య   భగవంతుని కరుణను గ్రహించలేక పోయాను. ఏవేవో అవసరం లేని వాటికి వెంపర్లాడాను. బాధలు కలిగినప్పుడల్లా, కోపం వచ్చినప్పుడల్లా నోటిదూల తీరేంతవరకూ ఎదురుగా ఎవరుంటే వాళ్ళను దూషించడమే పనిగా పెట్టుకున్నాను. ఇంతకాలం నా బ్రతుకు అడవి గాచిన వెన్నెల అయింది కదా అని ఆవేదన చెందుతూ కీర్తించిన గొప్ప ఆధ్యాత్మిక కీర్తన.   కీర్తన: పల్లవి: ఇంతగాలమాయను యేడనున్నారో వీరు వింతలై యడవిఁ గా సే వెన్నెలాయ బ్రదుకు     […]

అమర్ చిత్ర కథా సృష్టికర్త-అనంత్ పాయ్

  రచన: అంబడిపూడి శ్యామసుందరరావు     చిన్నపిల్లలకు బాగా ఇష్టమైన బొమ్మల కధల పుస్తకాలు అమర్ చిత్ర కథా సీరీస్ ఆ పుస్తకాల ద్వారా పిల్లలకు రామాయణము, భారతము వంటి పురాణాలను బొమ్మల ద్వారా వారిలో ఆసక్తి పెంచి చదివించేటట్లు చేసి పిల్లలకు పురాణాల గురించి జ్ఞానాన్ని కలుగజేసిన వ్యక్తి అనంత్ పాయ్. 1967లో దూరదర్శన్ లో పిల్లలకు నిర్వహించే క్విజ్ ప్రోగ్రామ్ అందులో పిల్లలు గ్రీక్ పురాణాల గురించి అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పటం […]

నదుల తీరాలపైననే నాగరికతలన్నీ

రచన: రామా చంద్రమౌళి     నాగరికతలన్నీ నదుల తీరాలపైననే పుట్టినపుడు మనిషి తెలుసుకున్న పరమ సత్యం .. ‘ కడుక్కోవడం ‘ .. ‘ శుభ్రపర్చుకోవడం ‘ ఒంటికంటిన బురదను కడుక్కోవడం , మనసుకంటిన మలినాన్ని కడుక్కోవడం చేతులకూ, కాళ్ళకూ.. చివరికి కావాలనే హృదయానికి పూసుకున్న మకిలిని కడుక్కోవడం కడుక్కోవడంకోసం ఒకటే పరుగు కడుక్కోడానికి దోసెడు నీళ్ళు కావాలి .. ఒక్కోసారి కడవెడు కావాలి మనిషి లోలోపలి శరీరాంతర్భాగమంతా బురదే ఐనప్పుడు కడుక్కోడానికి ఒక నదే […]