March 30, 2023

మాలిక పత్రిక జులై 2018 సంచికకు స్వాగతం

Jyothivalaboju Chief Editor and Content Head ఒక నెల ఆలస్యమైనా అదే ఉత్సాహంతో  మరింత ఎక్కువ కథలు, వ్యాసాలతో మీ ముందుకు వచ్చింది మాలిక పత్రిక జులై సంచిక.  ఎల్లవేళలా మాకు అండగా ఉండి ఆదరిస్తున్న పాఠక మిత్రులు, రచయితలకు మనఃపూర్వక ధన్యవాదాలు. మాలిక పత్రిక కంటెంట్ గురించి మీ అభిప్రాయములు, సలహాలు, సూచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com ఈ సంచికలోని విశేషాలు: మాయానగరం– 47 బ్రహ్మలిఖితం – 19 3.   ఏడు విగ్రహాలు  గిలకమ్మకథలు […]

మాయానగరం – 47

రచన: భువనచంద్ర మబ్బులు కమ్ముకుంటున్నై. అప్పటిదాకా జనాల్ని పిప్పి పీల్చి వేసిన ఎండలు నల్లమబ్బుల ధాటికి తలవొంచక తప్పలేదు. తెలుపు నలుపుల సమ్మేళనంలా వుంది వెలుగు. గాలి చల్లగా వీస్తూ చెట్లని, మనుషుల్నీ పరవశింపజేస్తోంది. “ఓ రెంకన్నొరే.. వర్షవొచ్చీసినట్టుంది. రారేయ్ “ఏలూరినించి వచ్చిన ఓ రిక్షా కార్మికుడు ఆనందంగా అరిచాడు. “హా భయ్.. బారిష్ ఆయేగీ “ఓ ముస్లీం సోదరుడన్నాడు. “సారల్.. సారల్.” సన్నగా పడుతున్న చినుకులని చేతుల్లో పట్టేట్టు అటూఇటు నాట్యం చేస్తున్నట్టుగా కదులుతూ అనంది […]

బ్రహ్మలిఖితం – 19

రచన: మన్నెం శారద కార్తికేయన్ ఒక పెద్ద చెట్టు మ్రాను కానుకొని కళ్ళు మూసుకొని జీవచ్చవంలో ఏదో జపిస్తూనే ఉన్నాడు. అతని ధోరణి, రూపు చూసొఇ లిఖిత వస్తోన్న దుఃఖాన్ని పెదవులు బిగించి ఆపుకుంటోంది. “నేనొస్తానక్కా!” అన్నాదు బేరర్ లేచి నిలబదుతూ. లిఖిత కృతగ్నతగా తలాడించి పర్సులోంచి కొంత డబ్బు తీసి అతని చేతిలో పెట్టబోయింది. అతను చేతిని వెనక్కు లాక్కుని “ఎందుకక్కా?” అనడిగేడు ఆస్చర్యంగా. “నువ్వు నాకు చాలా సహాయం చేసేవు. నా తండ్రిని నేను […]

ఏడు విగ్రహాలు

రచన: ఝాన్సీరాణి.కె భార్గవ్‌ రవి మారేడ్‌పల్లి చేరేసరికి అక్కడంతా మనుషులు హడావిడిగా మాట్లాడుకుంటున్నారు. షెనాయ్‌ నర్సింగ్‌ హోం నుంచి తుకారాంగేట్‌కి వెళ్ళేదారిలో ఒక అపార్ట్మెంట్‌ ముందు జనం గుమిగూడి వున్నారు. ఫోటోగ్రాఫర్స్‌, ఫింగర్‌ప్రింట్‌ ఎక్స్‌పర్ట్‌ అంబులెన్స్‌ హత్య జరిగిన వాతావరణం పోలీసు వాసన గుర్తు చేస్తున్నాయి. భార్గవ్‌ మీట్‌ మిస్టర్‌ వంశీకృష్ణ జర్నలిస్ట్‌ వీరు భార్గవ్‌, రవి సౌరభా డిటెక్టివ్‌ ఏజన్సీ వాళ్ళు అని పరస్పరం పరిచయం చేశాడు. మీ గురించి చాలా విన్నాను. మిమ్మల్నిలా కలవడం […]

గిలకమ్మ కతలు .. గిలకమ్మ..ఆర్నెల్ల ముందే పెద్దదైపోయిందంటల్లా..!

“ఎవర్నీ కొట్టగూడదు..అర్ధవయ్యిందా..?” పాయల్ని బలం కొద్దీ గట్టిగా లాగి జడల్లుతా సరోజ్నంది. “పలకలు పగలగొట్తేవంటే ఈపు ఇమానం మోతెక్కుద్ది ఏవనుకున్నావో..కణికిలసలే తినగూడదు..” మాట్టాళ్ళేదు గిలక. ఊకొట్టిందంతే.. “ ..ఎవర్నీ గిల్లగూడదు..గిచ్చగూడదు..ముక్కూడొచ్చేతట్టు నోటితో కొరెకెయ్యగూడదు…యే ఇనపడతందా..మూగెద్దులా మాట్తాడవే..” చేతిలో ఉన్న జుట్టలాపట్టుకునే ఒక్క గుంజు గుంజింది సరోజ్ని కూతుర్ని.. “ ఊ..అన్నాను గదా..నీకినపడాపోతే నేనేంజెయ్యనూ..” తల్లి విదిలింపులతో అసలే విసిగెత్తిపోయి ఉందేమో..అంతకంటె గట్టిగా ఇసుక్కుంది గిలక ఆళ్లమ్మ మీద. “ నువ్ నోట్టో..నోట్టో..అనుకుంటే నాకినపడద్దా..? గట్టిగా అను. నోరు […]

లేలేత స్వప్నం

రచన: రామా చంద్రమౌళి   ఆమె లీలావతి – పదవ తరగతి అప్పటిదాకా ‘లీలావతి గణితం’ చదువుతోంది.. అన్నీ లెక్కలు కాలం – దూరం, కాలం – పని, ఘాతంకముల న్యాయం చకచకా ఒక కాగితం తీసుకుని రాయడం మొదలెట్టింది పెన్సిల్ తో బయట ఒకటే వర్షం.. చిక్కగా చీకటి 2 చెత్త.. తడి చెత్త.. పొడి చెత్త ఆకుపచ్చ.. నీలి ప్లాస్టిక్ టబ్స్ ” ఐతే చెత్త ఎప్పుడూ పదార్థ రూపం లోనే ఉండదు చెత్త […]

కలియుగ వామనుడు 7

రచన: మంథా భానుమతి అల్లా ఎందుకు ఒక్కొక్కరికి ఒక్కోలా ఇస్తాడు జీవితాన్ని? నోరంతా చేదుగా అయిపోయింది. “అన్నా ఆ ఎలుగుబంటి గాడు నిన్ను యబ్యూజ్ చేస్తున్నాడా? నీ మీద పడుతున్నాడా?” చిన్నా బాంబేసినట్లు అడిగాడు. అబ్బాస్ కళ్లు పెద్దవి చేసి చూడ్డం తప్ప ఏం మాట్లాడలేక పోయాడు. “నాకు తెలుసన్నా. హోమో సెక్షువల్స్, పీడో ఫైల్స్.. చాలా పుస్తకాల్లో చదివాను. కంప్యూటర్ లో కూడా వాళ్ల గురించి చదివాను.” అబ్బాస్ ఇంకా మిడిగుడ్లేసుకుని చూస్తున్నాడు. “నాకు పన్నెండేళ్లే […]

విశ్వపుత్రిక వీక్షణం – “ఆ ఏడు భూములు”

  రచన: విజయలక్ష్మీ పండిట్ అంతరిక్షకు ఆ రోజు కాలు ఒకచోట నిలవడం లేదు. అంతరిక్షంలో తేలుతున్నట్టే వుంది. అందుకు కారణం ఆమెకు అమెరిక అంతరిక్ష సంస్థ “నాసా”(NASA) నుండి తనకు “ట్రాపిస్ట్-।”నక్షత్రం చుట్టు తిరుగుతున్న 7 భూములపై ప్రయోగాలలో అవకాశాన్ని కలిగిస్తూ ఆహ్వానం. అంతరిక్షకు తన అద్భుతమైన కల నిజమయిన అనుభవం. తన బాల్యం నుండి అంతరిక్షకువిశ్వం అంటే ఎంతో మక్కువ. అందుకు పునాదులు వేసింది వాళ్ళ అమ్మ వసుంధర చిన్నప్పటి నుండి అంతరిక్షకు చేసిన […]

కంభంపాటి కధలు – ఎన్ని’కులం’

రచన: కంభంపాటి రవీంద్ర ఉదయాన్నే ఏడున్నరకి నోటీసు బోర్డులో ఏదో నోటీసు అంటిస్తున్న అపార్ట్మెంట్ సెక్రటరీ నరహరి గారిని చూసి, బేస్ మెంటులో వాకింగ్ చేస్తున్న వరాహమూర్తిగారు ఆసక్తిగా వచ్చి ‘ఏమిటండీ ..ఏదో అంటిస్తున్నారు ? ‘ అని అడిగితే ‘ఇక్కడేమీ కొంపలు అంటించడం లేదు లెండి .. జస్ట్ కాయితాన్నే అంటిస్తున్నాను .. అదీ నోటీసు బోర్డులో ‘ అని తనేసిన జోకుకి తనే గెట్టిగా నవ్వేసుకుంటూ వెళ్ళిపోయేడు నరహరి. ఒళ్ళు మండి ‘ఇప్పుడీ నోటీసు […]

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

July 2018
M T W T F S S
« May   Aug »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031