March 29, 2024

తన్మయి

రచన: శారద యామిని

తటాలున పెదవిని ముద్దాడిన వానచినుకు..
ముందునాడే సమర్పించుకున్న మైమరపు..
తలపుల కొలిమిలో రాజుకున్న తపనలు..
దృష్టికి రాకనే మానిపోయినవేవో గాయపు గుర్తులు..
ఆత్మనెపుడో నింపుకున్న ఆలింగనపు తమకాలు..

ప్రేమ అకారణమయినపుడు,
మధువులూరు పెదవంచున ముదమయూఖమై ఫలియించినపుడు..
పడమటి సంధ్య కాంతులన్నీ అరచేత గోరింట పూయించుకున్నపుడు..
మరులుగొలిపే నీ అడుగుల మల్లెల బారున నా ఆలోచనల మరువాలల్లుకున్నపుడు..
నీ ఊసుల హరివిల్లుకు నా ఊపిరి రంగును పులుముకున్నపుడు..
ఆరుబయట మందారాన్నై పూచి.. నీ రాకకై వేచినపుడు..
ఆకలినీ మరిపించుకున్న ఆనంద తన్మయినైనపుడు..

తుమ్మెదయి వాలు తక్షణం..!
వాడనీయక ఏ క్షణ కుసుమం !!

2 thoughts on “తన్మయి

  1. చాల మృదు మధురమైన విరహ కవిత ..
    చదివేవారి వయసుకు తగ్గ ఆలోచనలని కల్గించే భావరసోన్మాద సాహితీ పద గుళికలు …
    కళ్ళు చదువుతున్నా ..
    తటాలున మనసుని కమ్ముకునే
    మధుర భావనలతో/కలలతో/ఆశలతో/తీపి జ్ఞాపకాలతో నో ..
    చదువరి పెదవిపై తెలియక తెప్పించే చిరునవ్వు !
    “ఆత్మనెపుడో నింపుకున్న” .. ఎంత గొప్ప భావన

    యామిని మీ భావన నిజం
    “ప్రేమ అకారణమయినపుడు,
    వాడదు “ఏ క్షణ కుసుమం” ఎందుకంటే అవి
    “ఆత్మనెపుడో నింపుకున్న ఆలింగనపు తమకాలు..”

    మీకు హృదయపూర్వక అభినందనలు యామిని గారు

  2. చాల మృదు మధురమైన విరహ కవిత ..
    చదివేవారి వయసుకు తగ్గ ఆలోచనలని కల్గించే భావరసోన్మాద సాహితీ పద గుళికలు …
    కళ్ళు చదువుతున్నా ..
    తటాలున మనసుని కమ్ముకునే
    మధుర భావనలతో/కలలతో/ఆశలతో/తీపి జ్ఞాపకాలతో నో ..
    చదువరి పెదవిపై తెలియక తెప్పించే చిరునవ్వు !
    ఎంత గొప్ప భావన “ఆత్మనెపుడో నింపుకున్న”

    యామిని మీ భావన నిజం
    “ప్రేమ అకారణమయినపుడు,
    వాడదు “ఏ క్షణ కుసుమం” ఎందుకంటే అవి
    “ఆత్మనెపుడో నింపుకున్న ఆలింగనపు తమకాలు..”

    మీకు హృదయపూర్వక అభినందనలు యామిని గారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *