April 18, 2024

మన ఇళ్లలో ఉండే క్యాన్సర్ కారకలు (కార్సినోజెనిక్ మెటీరియల్స్)

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు.

మన మన ఇళ్లలో ఏ రోగాలు రొష్టులు లేకుండా సుఖముగా బ్రతకాలని ఆశిస్తాము. కానీ మనకు తెలియకుండానే కొన్ని హానికరమైన పదార్ధాలను మనతో పాటే మన ఇళ్లలో ఉంచుకొని రోగాల పాలవుతాము. ప్రస్తుతము మానవాళిని వేధించే జబ్బుల్లో క్యాన్సర్ ఒకటి అటువంటి క్యాన్సర్ ను కలుగజేసే కారకాలను మనము మనకు తెలియకుండా ఇళ్లలో ఉంచుకుంటాము(వాటి ప్రభావము తెలియకుండా)అవి ఏమిటో అవి మన ఆరోగ్యముపై చూపే ప్రభావము ఏమిటో తెలుసుకుందాము. క్యాన్సర్ కలుగజేసే పదార్ధాలను కార్సినోజెనిక్ పదార్ధాలు అంటారు అందరికి తెలిసిన కార్సినోజెనిక్ పదార్ధము పొగాకు ధూమపానము ఆరోగ్యానికి హానికరం అనే హెచ్చరికను సిగరెట్ పెట్టెలపై ముద్రించి అమ్ముతున్నారు. ఇప్పుడు చెప్పబోయే కార్సినోనేజినిక్ పదార్ధాలు ఇంచుమించు అందరి ఇళ్లలో దర్శనమిస్తాయి.

1. ఎయిర్ ఫ్రెషనర్ : ఇళ్లలో చెడు వాసనలను తొలగించటానికి ఎయిర్ ఫ్రెషనర్లను ఉపయోగిస్తారు. వీటిలోని పదార్దాలు అంటే కొన్ని రసాయనాల సమూహాలు క్యాన్సర్ ను కలుగజేస్తాయి వీటిలోని DEHP అనే పదార్ధము మనుష్యులలో క్యాన్సర్ ను కలుగజేయటమే కాకుండా మెదడు అభివృద్ధిని, లైంగిక అభివృద్ధిని ఆటంక పరుస్తాయి అమెరికాలోని నేషనల్ టాక్సికాలజి ప్రోగ్రాంలో ఈ విషయాలను తెలియజేసారు. ఈ ఎయిర్ ఫ్రెషనర్లు సహజ సిద్దమైనవి అని చెప్పినా వీటిలో హానికరమైన పదార్ధాలు ఉంటాయి. వీటివల్ల ఎక్కువ బాధితులు పిల్లలు, గర్భిణీలు, దీర్ఘ్కాలిక రోగులు. కాబట్టి మనము ఈ ఎయిర్ ప్రెషనర్స్ బయట కృత్రిమమైనవి వాడకుండా వాటిని ఇంట్లో తయారు చేసుకొని వాడటం శ్రేయస్కరము

2. బాత్ రూములలో వాడే షవర్ కర్టెన్లు, ఇతర ప్లాస్టిక్ వస్తువులు:-మీరు పోలి వినైల్ క్లోరైడ్ (PVC) పేరు వినే ఉంటారు. ఇది ప్లాస్టిక్ లలో తఱచుగావాడే మూడవ రకము ప్లాస్టిక్ దీనిని మురుగు నీళ్ల గుట్టలుగా వాడితే ప్రమాదం ఏమిలేదు కానీ షవర్ పైపులు గాను షవర్ కర్టెన్లగాను వాడటం మంచిది కాదు. వీటిలో కొన్ని విషపూరిత పదార్ధాలు ఉంటాయి షవర్ తో పాటు ఇవి కూడా వస్తాయి. ఈ విషపదార్ధాలు శ్వాస , ప్రత్యుత్పత్తి వ్యవస్థలలో క్యాన్సరును కలుగజేస్తాయి. కాబట్టి బాత్ రూములో వాడే షవర్ కర్టెన్లను పివిసి తో కాకుండా ఇతర పదార్ధాలతో చేసినవి వాడాలి. అంతేకాకుండా పిల్లలు వాడీపీలాస్టిక్ కంటైనర్లు బొమ్మల విషయములో కూడా జాగ్రత్త వహించాలి వీలైనంతవరకు పివిసి సామాగ్రి వాడకూడదు. ప్లాస్టిక్ కంటైనర్ల పైన బొమ్మలపైనా రకరకాల బొమ్మలు ఉంటాయి వాటి పట్ల అవగాహన కలిగి ఉండటం అవసరము వాటిలో ఏవికూడా మైక్రోవేవ్ హీటింగ్ కు పనికిరావు మైక్రోవేవ్ హీటింగ్ వాడే ప్లాస్టిక్ కంటైనర్లపై ” మైక్రోవేవ్ సేఫ్ “అన్న లేబిల్ ఉంటుంది అంటే దాని అర్ధము మైక్రోవేవ్ లో వాడే తప్పుడు ఆ వేడికి కరగదు అనేది దాని అర్ధము సాధారణముగా ప్లాస్టిక్ లను వేడిచేసినప్పుడు హానికరమైన రసాయనాలు ఆహారములోకి ప్రవేశిస్తాయి.
3. బట్టలను, కార్పెట్లను శుభ్రము చేయటానికి వాడే షాంపూలు (డిటర్జెంట్లు):- మీరు బట్టలను శుభ్రము చేయటానికి లేదా కార్పెట్లపై గల మరకలను తొలగించటానికి డిటర్జెంట్లను వాడుతున్నట్లైతే వాటిలో ట్రై క్లోరో ఈథేన్ లేదా నాఫ్తాలిన్ లేకుండా చూసుకోండి. ఎందుకంటే ఈ రసాయనం ఊపిరితిత్తుల, లేదా గొంతు క్యాన్సర్ వచ్చే అవకాశాలను పెంచుతుంది కాబట్టి మీరు వాడే షాంపూ లేదా డిటెర్జెంట్ల ఇండిగ్రీన్స్ లిస్ట్ లో ఈ రసాయనం ఉంటె అది ఉపయోగించకండి కొంతమంది వ్యాపార సంస్థలు ఈ రసాయనాన్ని కలిపినా ఇండీగ్రంట్స్ లిస్ట్ లో ఆ పేరును సూచించారు అటువంటప్పుడు ఆ వస్తువులను కొనకండి సింపుల్ గాబేకింగ్ సోడా వాడటం వలన మొండి మరకలను వదిలించుకోవచ్చు. కొద్దిగా టైం పట్టినా బేకింగ్ సోడా వాడటం సురక్షితం.

4. డ్రై క్లినింగ్ చేసిన దుస్తులు:-అమెరికన్ క్యాన్సర్ సొసైటీ వారు తెలియజేసినదానిని బట్టి డ్రై క్లినింగ్ లో వాడే ట్రైక్లోరోఎథిలిన్ అనే రసాయనం బట్టలకు అంటుకుంటుంది ఈ పారదర్శకమైన ద్రవ వాయువు ను పీల్చినపుడు కేంద్రీయ నాది వ్యవస్థ దెబ్బతిని ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఏర్పడే దుష్ఫలితాలను కలుగజేస్తుంది దీనివలన తలనొప్పి తలా దిమ్ముగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అదనంగా ఈ రసాయనం క్యాన్సర్ కలుగజేసే కారకము కూడా

5. క్రిమిసంహారకాలు (పెస్టిసైడ్స్), క్రిములను ప్రాలద్రోలేవి (పేస్ట్ రిపేలెంట్స్):- మనము ఇళ్లలో పెంచుకొనే కుక్కలాంటి పెంపుడు జంతువులు చాలా రకాల క్రిములకు ఆవాసము వాటిని చంపటానికి బజారులో దొరికే క్రిమి సంహారకాలను వాడతాము. డిటెర్జెంట్ల లాగానే వీటిలో కూడా వివిధ రకాలైన కార్సినోజెనిక్ పదార్ధాలు ఉంటాయి. ఉదాహరణకు తలలో ఉండే పేలను చంపటానికి వాడే క్రిమిసంహారక మందులలో పెర్మిత్రిన్ లేదా ఆర్గానో ఫాస్ఫెట్స్ ఉంటాయి ఇవి క్యాన్సర్ కలుగజేసే ప్రమాదకర రసాయనాలు. కాబట్టి క్రిమిసంహారక మందులు కొనేటప్పుడు తగిన జాగ్రత్త తీసుకోవాలి.

6. టాల్కము పౌడర్ :- చాలా మంది టాల్కమ్ పౌడర్ ను సాక్స్ ల్లో చెమట వాసన లేకుండా ఉండటానికి, కొంతమంది తల్లులు పిల్లల డైపర్స్ వాడేటప్పుడు పిల్లలకు ర్యాషెష్ (దద్దుర్లు) రాకుండా ఉండటానికి వాడు తుంటారు కొన్ని టాల్కమ్ పౌడర్లలో ఆస్బెస్టాస్ ఫైబర్స్ ఉంటాయి ఇవి ప్రమాదకరమని US ఫుడ్ అండ్ డ్రగ్ ఎడ్మినిస్ట్రేషన్ వారు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈ ఆస్బెస్టాస్ ఫైబర్ అండాశయ క్యాన్సర్ ను ఊపిరి తిత్తుల జబ్బులకు కారణమవుతుంది.

7. ఇళ్లకు వేసే లేదా ఇళ్లలో ఉపయోగించే రంగులు:- ఇళ్లకు కొంతకాలము గడిచాక మల్ల కొత్తగా అనిపించటానికి గోడలకు తలుపులకు రంగులు వేయించటం మాములే పైంట్లు చాలా త్వరగా సరిపోతాయి ఇవి ఆరిన వెంటనే వాటిలోని రసాయనాలు గాలిలోకి విడుదల అవుతాయి. ఇలా చాలా కాలము కొనసాగుతాయి. రంగులు వేసిన గదులలో నివసించేవారు ఈ రసాయనాలను పీలుస్తారు ఫలితముగా తలనొప్పి, డిజినెస్ మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి రంగులు వాడేటప్పుడు తక్కువ వోలటైల్ రసాయనాలు ఉండే రంగులను వాడటం మంచిది.

8. టెఫ్లాన్ కోటెడ్ వంట సామగ్రి:- ఈ టెఫ్లాన్ వంట సామాగ్రిలో PFOA అనే క్యార్సినోజెనిక్ పదార్ధము ఉన్నట్లు అమెరికన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ వారు చాలా ఏళ్ల క్రితమే తెలియజేసారు. అంతేకాకుండా టెఫ్లాన్ ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద విష వాయువులను విష పదార్ధాలను ఉత్పత్తిచేస్తుంది. వీటివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. టెఫ్లాన్ వంటసామాగ్రి వాడేటప్పుడు వాటిని ఎక్కువ ఉష్ణోగ్రతలతో వాడకూడదు అవి పాడవుతుంటే వాడి వాడకం మానేయాలి.

9. యాంటీ బ్యాక్టీరియల్ ఉత్పత్తులు:- మనకు యాంటీ బ్యాక్టీరియల్ ఉత్పత్తులు మన పరిసరాలను క్షేమముగా ఉంచుతామని నమ్మకము మనము వాడే కాస్మొటిక్స్, హైజీన్ ఉత్పత్తులు (సబ్బులు , పేస్ట్ లు వంటివి) ట్రైక్లోసాన్ అనే పదార్ధాన్ని కలిగిఉంటాయి అమెరికన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ వాఋ తెలియజేసిన ప్రకారము ఇది కీటక సంహారిణి (ఇన్సెక్టిసైడ్) కాబట్టి ఇది క్యారేజినిజెనిక్ ఇప్పటివరకు ఈ అంశముపై ఎలుకల మీద పరిశోధనలు జరిపి ఇది క్యారేజినిజెనిక్ అని నిర్ణయించి ఈ రసాయనం కలిగిన ఉత్పత్తులను యూరోపియన్ యూనియన్ దేశాలు నిషేధించాయి.

10. డియోడరెంట్ స్ప్రేలు:-చాలా మంది చంకల్లో చెమట వాసన పోవటానికి , శరీరము నుండి మంచి ఆసన రావటానికి వివిధరకాల వాసనలతో అనేక రకాల డియోడరెంట్లను వాడటము చూస్తున్నాము బయటికి వచ్చే ముందు ఈ డియోడరెంట్ ను స్ప్రే చేసుకొని మరి వస్తారు. వీటిని యాంటీ పెర్సిస్టెంట్ ఉత్పత్తులు అంటారు వీటిలో అల్ల్యుమినియం లవణాలు ఉంటాయి ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలకు దోహదపడతాయి. ముఖ్యముగా ఆడవారిలో స్తనాల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ.

11. సువాసన వెదజెల్లే క్యాండిల్స్ (కొవ్వొత్తులు):- మనము ఇళ్లలో వాడే సువాసనలు వెదజల్లే క్యాండిల్స్ వాడేటప్పుడు వాటివల్ల వచ్చే ప్రమాదాలను కూడా గమనించాలి. అమెరికన్ కన్స్యూమర్ కౌన్సిల్ వారు సీసపు వత్తులు కలిగిన క్యాండిల్స్ అమ్మకమును నిషేదించారు కానీ వాటి వాడకం జరుగుతూనే ఉన్నది . అటువంటి క్యాండిల్స్ ను గుర్తించటానికి చిన్న పరీక్ష ఉంది వత్తితో తెల్లకాగితముపై రుద్దితే ఏరకమైన గుర్తు పడకపోతే సీసము లేనట్లే సీసం ఉంటె వత్తిని కాగితము మీద రుద్దినప్పుడు నల్లగా గుర్తు కనిపిస్తుంది.
ఈ విధముగా పైన తెలియజేసిన వస్తువుల పట్టిక సంపూర్ణముకాదు ఇంకా కొన్ని పదార్ధాలు ఉండి ఉండవచ్చు.
ఈ వ్యాసము యొక్క ఉద్దేశ్యము ప్రజలలో భయాందోళనలు కలుగజేయటం కాదు మనము వాడే వస్తువుల పట్ల అవగాహన కల్పించటమే ఫలితముగా మన మన కుటుంబసభ్యుల ఆరోగ్యాలను కాపాడుకోవటమే.

4 thoughts on “మన ఇళ్లలో ఉండే క్యాన్సర్ కారకలు (కార్సినోజెనిక్ మెటీరియల్స్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *