April 19, 2024

కౌండిన్య హాస్యకథలు – కథ కంచికి ప్రేక్షకులు ఇంటికి

రచన: రమేశ్ కలవల ఇంద్రుడితో యుద్ధం చేసి అమృతం తెచ్చిన వైనతేయుడిలా డిస్ట్రిబ్యూటర్లతో పోరాడి డబ్బులు కట్టల బ్యాగు అచ్యుతరావుగారికి అందించాడు పక్కిసామి. సినిమా ప్రొడ్యూసర్ అచ్యుతరావు గారికి ఎక్కడకైనా వెళ్ళేటపుడు పక్కిసామి పక్కన ఉండి తీరాల్సిందే. పక్కిసామి ఎన్ని డబ్బులు కట్టలు బ్యాగులలో మోసుకొచ్చిన ఒక్కసారి కూడా లోపలకు కన్నేసి కూడా చూడడు. నిస్వార్థపరుడు, అచ్యుత రావు గారి మీద గౌరవం అలాంటిది. అచ్యుతరావుగారు ఆ అందించిన బ్యాగులోంచి డబ్బుల కట్టలు తీసి తను పడుకునే […]

మార్నింగ్ వాక్

రచన: మణికుమారి గోవిందరాజుల “రేపటినుండి యేమైనా సరే వాకింగ్ కి వెళ్ళాల్సిందే. ” అద్దంలో ముందుకూ వెనక్కూ చూసుకుంటూ అనుకుంది . “కానీ మరీ లావణ్య వర్ణించినంత లావుగా యేమీ లేనే?” మళ్ళీ చూసుకుంది . యేమోలే చూసేవాళ్ళకు లావుగా కనపడుతున్నానేమో. . అయినా అయ్యో అయ్యో యెంత మాట అనేసింది దొంగమొహం. వారం క్రితం ఇంట్లోకి వస్తూనే అన్నది కదా “ఒసే రేఖా! పేరుకి తగ్గట్లు రేఖలా వుండేదానివల్లా సున్నాలా అవుతున్నావే” అని దానికి శ్రీవారి […]

నాకు నచ్చిన కధ చెన్నూరి సుదర్శన్ గారి “అడకత్తెరలో పోక చెక్క-“

అంబడిపూడి శ్యామసుందర రావు చెన్నూరి సుదర్శన్ గారు ఉపాధ్యాయుడిగా పదవి విరమణ చేసి సెకండ్ ఇన్నింగ్ లో రచయిత అవతారమెత్తి వ్రాసిన కధల సంపుటి నుండి తీసుకున్న కధ. ఇప్పటివరకు నేను వివిధ పత్రికలలో (ఆన్ లైన్) చాసో, రావి శాస్త్రి మునిమాణిక్యం , కొడవటిగంటి వంటి పాత రచయితల కథలకే సమీక్షలు వ్రాశాను అనుకోకుండా సుదర్శన్ గారి “ఝాన్సీ హెచ్ ఎమ్ “అనే కధల సంపుటి చదవటం తటస్తించింది అందులో అడకత్తెరలో పోక చెక్క కధానిక […]

తేనెలొలుకు తెలుగు-4

రచన: తుమ్మూరి రామ్మోహనరావు కూరిమిగల దినములలో నేరములెన్నడును కలుగ నేరవు మరియా కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతీ. . . ఇది నేను చిన్నప్పుడు చూచిరాత కాపీలో అభ్యాసం చేసిన మొదటి పద్యం. దీని తరువాత చీమలుపెట్టిన పుట్టలు పాములకిరవైనయట్లు పామరుడు తగన్ హేమంబు కూడబెట్టిన భూమీశుల పాలజేరు భువిలో సుమతీ ఉపకారికినుపకారము విపరీతముగాదు సేయ వివరింపంగా అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతీ బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా! […]

ఒద్దిరాజు అపూర్వ సోదరులు

రచన: శారదాప్రసాద్ ‘ఒద్దిరాజు అపూర్వ సోదరులు’ గా ప్రసిద్ధులైన సీతారామచంద్రరావు, రాఘవరంగారావు గార్లు సంస్కృతాంధ్ర పండితులు మరియు ప్రచురణ కర్తలు. ఒద్దిరాజు సీతారామచంద్రరావుగారు ఒద్దిరాజు సోదరులలో పెద్దవాడు. ఒద్దిరాజు రాఘవ రంగారావుగారు ఒద్దిరాజు సోదరులలో చిన్నవాడు. వీరికి సుమారు పది భాషలలో పాండిత్యం ఉంది. వీరి తల్లిదండ్రులు వెంకట రామారావు మరియు రంగనాయకమ్మలు. వీరు వరంగల్లు మండలం మానుకోట తాలూకా, ఇనుగుర్తి గ్రామ వాస్తవ్యులు. ఈ గ్రామం నుండే వీరు తెనుగు అనే పత్రికను నడిపారు. ఈ […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 29

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య “అర్ధము పురుషార్ధములలో నుత్తమము. అర్ధవంతుడు న్యాయము దప్పక మరియే ఉపాయము చేతనైనను ద్రవ్యము సంపాదించవచ్చును” అంటాడు పరవస్తు చిన్నయసూరి తన నీతిచంద్రికలో. అలాగే అన్నమయ్య ఆ ధనాన్ని గురించి మరొక విషయం చెప్తున్నాడు. ఆపదలలో ఉపయోగపడకుండా వున్న ధనం ఎవరికోసం? అని ప్రశ్నిస్తున్నాడు ఈ కీర్తనలో అన్నమయ్య. ఆ వివరాలేమిటో ఈ కీర్తనలో చూద్దాం. కీర్తన: పల్లవి: అక్కర కొదగని యట్టి అర్ధము లెక్కలెన్ని యైనా నేమి లేకున్న నేమిరే చ.1. దండితో […]

విశ్వపుత్రిక వీక్షణం .. “ప్రేమ రేఖలు”

రచన: డా. విజయలక్ష్మి పండిట్     మెరిసే మేఘల తివాసీపై నడిచి వస్తూందా హిరణ్యతార, ఆమె పాదాలు సోకి అడుగు అడుగుకు రాలుతున్నాయి నక్షత్రాలు ముత్యాల్లా .., రాలుతున్న ప్రతినక్షత్ర విస్పోటనం కురిపిస్తూంది బంగారు రజినివర్షం.., ధారగా జలజలా రాలుతున్న కాంచనచినుకులు.., ఆ హిరణ్యతార బంగారు చేలాంచలమై సముద్రుని ఒంటిపై జీరాడుతూ .., భూమ్యాకాశాన్ని కలిపే బంగారు జలతారు వంతెనయింది .., ఆ బంగారువారధి రజనిసోపానాలపై క్రిందుకి దిగితూ వచ్హాడు అందమయిన ఆ పురుషుడు..శశాంకుడు, సముద్రతలానికి […]

బాల్యం… ఓ అద్భుతలోకం, ఓ సుందర స్వప్నం

రచన: శ్రీధర్ చౌడారపు   ఆ కళ్ళు నిష్కల్మషాలు ఆ పెదాలపై అనుక్షణం నవ్వు తాండవిస్తూంటుంది అది బోసినవ్వో? భళ్ళుమన్న నవ్వో అక్కడ సిగ్గు బుగ్గల్లో ఎరుపుతో తలదాచుకుంటూంది అక్కడ ఉక్రోషం కాళ్ళను నేలకు బలంగా తాటిస్తుంటూంది అక్కడ కోపం “గీ”మంటూ “గయ్యి”మంటూ అరుస్తూంటుంది అక్కడ ఆశ కళ్ళను పెద్దవి చేసుకుని పెదాలు తడుపుకుంటూంటుంది అక్కడ నిరాశ సర్వం కోల్పోయి దిగాలుగా కూర్చుంటుంది అక్కడ గెలుపు దిగంతాలకెగురుతుంటుంది అక్కడ ఓటమి భోరుమని ఏడుస్తూంటుంది అక్కడ ఆనందం అంతులేని […]