April 19, 2024

మనం ఇలా ఉంటామెందుకు?

రచన: వసంతశ్రీ పొద్దున్న లేస్తూనే దేముణ్ణి పూజిస్తాం- ఇంట్లో ఇల్లాలిపై మాత్రం కసుర్లు. శివుడు తనలో అర్ధ భాగమిచ్చాడని తలుస్తూ- నీకేమీ తెలీదని భార్యని దెప్పి పొడుస్తూ. పుస్తకాన్ని సరస్వతీ అని నమస్కరిస్తుంటాం- ప్రతీదానికీ పేపర్ చెత్త కోసం వాడతాం. అగరబత్తి డబ్బా పైన ఉండే దేముని బొమ్మనీ దాస్తాం- ప్రతీ అబద్దానికీ దేముడిపై ఒట్టేస్తూ. లక్ష్మీ దేవిని పూజిస్తూ- లక్ష్మీ బాంబుని పెల్చేస్తూ దీపావళి. ప్రతీ రోజూ గుడి కెళ్లాలని ప్రయత్నిస్తాం- వెళ్ళినా వరసలోనిలబడకుండా ముందుకు […]

మాలిక పత్రిక అక్టోబర్ సంచికకు స్వాగతం

  Jyothivalaboju Chief Editor and Content Head ప్రియమైన పాఠకులకు, రచయితలకు, మిత్రులందరికీ ముందుగా దసరా పండగ శుభాకాంక్షలు. రాబోయే పండగలు మీకందరికీ శుభాలు కలుగజేయాలని మనసారా కోరుకుంటూ ఈ మాసపు మాలిక పత్రికను మీకు నచ్చిన, మీరు మెచ్చిన శీర్షికలు, కథలు, కవితలు, కార్టూన్స్, సీరియల్స్ మరియు వ్యాసాలతో  తీర్చిదిద్దడం జరిగింది. మీ రచనలను పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com మరి ఈ మాసపు విశేషాలను తెలుసుకుందాం. 1.గిలకమ్మ కథలు – పెత్తాట్టెంక, సింతాట్టెంక 2.  […]

గిలకమ్మ కతలు – పెత్తాట్టెంక, సింతాట్టెంక

రచన: కన్నెగంటి అనసూయ “ అబ్బబ్బా..! ఈల్లు పిల్లలుగాదమ్మోయ్..పిశాసాలు. పీక్కు తినేత్తన్నార్రా..బాబోయ్ ..ఒక్కక్కళ్ళూను. ఎదవలు బడుంటేనే నయ్యిం. బళ్ళోకి పోతారు. ఇంట్లో ఉండి సంపేత్తన్నారు . పట్టుమని పది నిమిషాలన్నా..పడుకోనిత్తేనా..? ” కెవ్వుమన్న పిల్లోడేడుపుకి నిద్దట్లోంచి లేసిందేవో..మా సిరాగ్గా ఉంది సరోజ్నీకి. లేసలా మంచం మీద గూకునే సెదిరిపోయిన జుట్టుని లాగి ఏలు ముడేసుకుంటంటే.. ధడాల్న తలుపు తోసుకుంటా గది లోకొచ్చిన కొడుకు ఏడుపిని మరింత సిర్రెత్తిపోయిందేవో…సరోజ్నికి ఆ కోపంలో ఆడ్ని గభాల్న దగ్గరకి లాగి మెడలొంచి […]

బ్రహ్మలిఖితం 21

రచన: మన్నెం శారద ఆటో వేగంగా వెళ్తోంది. కేయూరవల్లి పరధ్యానంలో మునిగి ఉంది పూర్తిగా. ఈశ్వరి పరిస్థితి ఆమెకు జాలిని కలిగిస్తోంది. ఎందుకు మనుషులిలా ఇతరుల జీవితాలతో ఆడుకుంటారు. కేవలం తమ స్వార్ధం కోసం, స్వలాభం కొసం ఇన్ని అబద్ధాలాడి, ఇంతింత మోసాలు చేయాలా? ఒక పెద్ద ప్రయాణం లాంటిది జీవితం. సరిగ్గా ఆలోచిస్తే జనన మరణాల్ని కలిపే ఒక వంతెన జీవితం. ఇటీస్ స్పాన్ ఇన్ బిట్వీన్ లైఫ్ ఆండ్ డెత్ ఇటీజ్ జర్నీ టువర్డ్స్ […]

రెండో జీవితం 10

”బాధపడకు ముక్తా! కిందపడ్డప్పుడే పైకి లేచే అవకాశాలు వుంటాయి కదా! దాంతో వేగంగా కెరియర్‌లో ఇంప్రూవ్‌ అవ్వచ్చు. అందరి గౌరవం పొందొచ్చు. కీడులో మేలన్నట్లు ఇదికూడా ఓ ఇన్‌స్పిరేషన్‌ అనుకోండి” అంది సంవేద. వెంటనే సంవేద చేతిని మెల్లగా తాకి ”అది ఒక్కరోజులో రాత్రికి రాత్రే సాధ్యమయ్యేది కాదు వేదా! మణిచందన్‌ తన జీవితాన్ని తనకోసమే జీవించాలనే వ్యక్తి… తన జీవితాన్ని తనే శాసించాలి. తన సక్సెస్‌, తన పెయిల్యూర్‌ తన సంతోషం, తన కన్నీరు తనకే […]

విశ్వపుత్రిక వీక్షణం – “రహస్య స్నేహితులు”

రచన: డా. పి.విజయలక్ష్మి పండిట్ నింగిలోని నిశ్చల సంధ్య కిరణాలు నిశ్శబ్ధంగా నేలతల్లి ఒడిలో వాలి లాలిస్తున్నాయి తరులను లతలను , గడ్డి పోచలను, కొండ కోనలను. మెడలు వాల్చి పూలు ఆకులు పక్షులు నిదురమ్మ ఒడిలో తూగుతున్నాయి. అలసిన సూర్యుడ్ని అక్కున చేర్చుకుంది సంధ్య. కాలమే మైమరచి మమేక మయింది ఆ క్షణాలలో. అదనుచూసి ఆకుల సందులలో దూరి పరచుకుంటున్న నిశీధి నీడల ఊడలు, నాటుకుంటున్నాయి భూమాత శరీరంలో కర్కశంగా. అంతలో, అలముకున్న చీకటి తెరలను […]

చేసిన పుణ్యం

రచన: డా.తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం అరవింద శంషాబాద్ విమానాశ్రయం చేరేసరికి తెల్లవారు ఝాము మూడు గంటలయింది. ఉదయం ఆరు గంటల ముప్పై నిముషాలకి విమానం బయల్దేరుతుంది. విదేశీ ప్రయాణం కనుక మూడు గంటల ముందే సామాను చెక్ ఇన్ చేయాలి. అరవింద కేవలం రెండు వారాలు సెలవు మీద ఇండియా రావడం వలన తాను రెండు సూట్ కేసులు తెచ్చుకునే అవకాశం ఉన్నా ఒక పెట్టే తెచ్చుకుంది. క్యాబిన్ లగేజ్ గా చిన్న సూట్ కేసు ఒకటి […]

కౌండిన్య హాస్యకథలు – చెరగని మచ్చ

రచన: రమేశ్ కలవల తనకు ఊహ తెలిసిన రోజులు. అద్దంలో చూసుకుంటూ అక్కడ మచ్చ ఎలా పడిందా అని చిన్న బుర్రతో చాలా సేపు ఆలోచించాడు. అర్ధం కాక మళ్ళీ తువాలు కట్టుకొని అమ్మ దగ్గరకు బయలు దేరాడు. “అమ్మా, ఇక్కడ ఏమైయ్యింది నాకు?” అని వెనక్కి తిరిగి చూపిస్తూ అడిగాడు. “అదీ… నువ్వు పుట్టగానే ఎంతకీ మాట్లాడక పోయేసరికే ఆ హస్పటల్ లో ఓ నర్సు అక్కడ నిన్ను గట్టిగా గిచ్చగానే ఆ మచ్చ పడిందమ్మా” […]

కలం స్నేహం.

రచన: గిరిజారాణి కలవల మధ్యాహ్నం భోజనమయి పడుకునే టైమూ… కొరియర్ అబ్బాయి బెల్లు కొట్టే టైమూ.. ఎప్పుడూ ఒకేసారి అవుతాయి. సరిగ్గా మిట్టమధ్యాహ్నం ట్రింగ్ ట్రింగ్ కొట్టడం.. నిద్ర కాస్తా ఎగిరిపోతుంది దెబ్బకి. ఎన్నిసార్లో చెప్పాను శ్రీవారికి.. ఈ టైమన్నా మార్చండీ లేకపోతే మీ ఆఫీసు అడ్రస్ అయినా ఇచ్చుకోండీ అని.. వింటేగా.. విసుక్కుంటూ తలుపు తీసా… కొరియర్ వాడే.. అయితే ఏ వస్తువూ కాదు.. కవర్ ఇచ్చి వెళ్ళాడు. శుభలేఖలా వుంది. ఎవరిదబ్బా.. అని ఓపెన్ […]

గతం గతః

రచన-డా.లక్ష్మి రాఘవ ఆ గది తలుపులు తీస్తూంటే ఆసక్తిగా తొంగి చూసింది కమల వంటింట్లో నుండీ. అత్తగారు విశాలమ్మ, భర్త సూరి లోపలకు పోయి తలుపులు మూశారు. మామగారు విశ్వనాథం విశ్రాంతిగా పాత వాలుకుర్చీలో కూర్చుని వున్నారు. ఆయనకు ఇంట్లో ఏమి జరుగుతున్నా పట్టి నట్టే వుండదు. వంటింట్లో పని చూసుకుని బయటకు వచ్చేసరికి చేతిలో బ్యాగుతో బయటకు వస్తున్న సూరి, ఆ వెనుకే తలుపుకు తాళం పెడుతున్న అత్తగారు కనిపించారు. ఇద్దరూ విశ్వనాధం దగ్గరికి వెడుతూంటే […]