March 28, 2024

మనం ఇలా ఉంటామెందుకు?

రచన: వసంతశ్రీ

పొద్దున్న లేస్తూనే దేముణ్ణి పూజిస్తాం-

ఇంట్లో ఇల్లాలిపై మాత్రం కసుర్లు.

శివుడు తనలో అర్ధ భాగమిచ్చాడని తలుస్తూ-

నీకేమీ తెలీదని భార్యని దెప్పి పొడుస్తూ.

పుస్తకాన్ని సరస్వతీ అని నమస్కరిస్తుంటాం-

ప్రతీదానికీ పేపర్ చెత్త కోసం వాడతాం.

అగరబత్తి డబ్బా పైన ఉండే దేముని బొమ్మనీ దాస్తాం-

ప్రతీ అబద్దానికీ దేముడిపై ఒట్టేస్తూ.

లక్ష్మీ దేవిని పూజిస్తూ-

లక్ష్మీ బాంబుని పెల్చేస్తూ దీపావళి.

ప్రతీ రోజూ గుడి కెళ్లాలని ప్రయత్నిస్తాం-

వెళ్ళినా వరసలోనిలబడకుండా ముందుకు తోసుకెళ్ళిపోతూ.

ప్రసాదం కళ్ళకద్దుకుని తింటాం-

చేతిని గుడి గోడలకి రాసేస్తూ…(మనం శుభ్రంగా ఉండాలి కదా!!)

అందర్లో దేముణ్ణి చూడమన్నాడని తెలుసు-

కానీ మన స్వార్ధం మాత్రం మనదే!!

మన సుఖం,మన సంతోషం మన భావోద్వేగాలూ మనకి ముఖ్యం.

మన ఈర్ష్యా అసూయాలని సరి అయినవే అని చూపడానికి –

మనం ఎంతైనా వాదిస్తాం.

చేసింది ఎంత తప్పైనా సమర్ధించుకోడానికీ మన తెలివితేటల్ని వాడతాం.

కానీ మనకి తెలిసిన జ్ఞానాన్ని మన అభ్యున్నతికి వాడే అవకాశం తీసుకోము.

ఉన్న ఒక్క జన్మని పరోపకారానికీ వాడి,

సక్రమంగా ఉపయోగించడానికే 84కోట్ల జీవరాశులలో ఉత్కృష్టమైన ఈ జన్మని వృధా చేసుకోవద్దు.

2 thoughts on “మనం ఇలా ఉంటామెందుకు?

  1. అనుకున్నామని జరగవు అన్నీ
    అనుకోలేదని ఆగవు కొన్ని..
    అందుకే ఇలా ఉంటామేమో..

  2. ఏవిటో….నేననుకునేవన్నీ మీరు అక్షరరూపం ఇచ్చేసేరు….
    చాలా బాగుంది

Leave a Reply to కన్నాజీరావు Cancel reply

Your email address will not be published. Required fields are marked *