March 19, 2024

డే కేర్..

రచన: మణికుమారి గోవిందరాజుల “ వర్ధనమ్మా డే కేర్” లోపలికి వస్తూ ఆ బోర్డుని ఆప్యాయంగా చూసుకుంది సరళ . వర్ధనమ్మ సరళ తల్లేమో అనుకుంటే పప్పులో కాలేసారన్నమాటే. . అత్తగారిని తల్చుకుని మనసులోనే దండం పెట్టుకుంది. ఆ రోజు వర్ధనమ్మా డే కేర్ వార్శికోత్సవం. అందుకే డే కేర్ అంతా చాలా హడావుడిగా వుంది . లోపలికి వెళ్ళి మధ్య హాలులో నిల్చుని చుట్టూ చూసింది. . అత్తగారు నవ్వుతూ చూస్తున్నట్లు అనిపించింది. చిన్నగా ఆఫీసు […]

దీపావళి పద్యములు

రచన: జెజ్జాల కృష్ణ మోహనరావు దీపావళికి సంబంధించిన పదములతో ఉండే వృత్తములను ఏరి పండుగ సందర్భముగా శుభాకాంక్షలతో ఇక్కడ అందిస్తున్నాను. అన్య నామములను కుండలీకరణములలో చూపినాను. * గుర్తుతో నున్నవి నా కల్పనలు. ప్రతి ఛందమునకు రెండు ఉదాహరణములను ఇచ్చినాను. ఇందులో వాడబడిన ఛందములు 20, అవి – దీప్తా, లక్ష్మీ, అర్చిస్సు, భాస, దీపకమాలా, మౌక్తికమాలా, కాంతి, మణిమాలా, ప్రభా, బభ్రులక్ష్మీ, నిగ్గు, దీపక, భామ, భాతి, హరిణీ, కలాపదీపక, దీపికాశిఖ, దీపార్చి, జ్యోతి, దీప. […]

మాలిక పత్రిక 2018 సంచికకు స్వాగతం

 Jyothivalaboju Chief Editor and Content Head  దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ | దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమ్మోస్తుతే ||   దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చే […]

గిలకమ్మ కతలు – గిలకమ్మ పందేరం. ఆహా..! ఏమి యవ్వారం.

రచన: కన్నెగంటి అనసూయ యేగోరింట్లో పిల్లోడ్ని పెళ్ళి కొడుకుని సేత్నారంటే అయ్యాల తెల్లారగట్తే లేసి పన్జేసుకుంది సరోజ్ని. మల్లీ ఎండెక్కితే కుదరదని పిల్లలు నిదళ్ళు లేత్తాకి ముందే తలిప్పి సిక్కుల్లేకుండా దువ్వెన్తో దువ్వి..తల్నిండా నూనెట్టి మరీ పైకి ముడెట్తేసి..బాగా మసిలి,మసిలీ పొగలొచ్చేసిన రాగి బిందెడు నీళ్లతో నీళ్ళోసేసుకుని ఏదో పాత సీరుంటే సుట్తబెట్టి బీరువాలోంచి పగడాల గొలుసుదీసి మెళ్ళో ఏసుకుని అద్దంలో సూసుకుంది. సూత్రాల గొలుసునీ, నల్లపూసల గొలుసుని అంతకు ముందురోజే కుంకుడుకాయల పులుసులో నానేసి మరీ […]

రెండో జీవితం 11

రచన : అంగులూరి అంజనీదేవి శృతికను చూశాక సంవేదకి ఒక్కక్షణం ఏమి అర్థంకాలేదు. బయట మనం కొనుక్కునే బొమ్మల్లో కూడా కొంచెం ఫీలింగ్స్‌ కన్పిస్తాయి. ఈమెలో ఒక్క ఫీలింగ్‌ కూడా కన్పించలేదు బొమ్మను మించిన బొమ్మలా వుంది. ఇదేంటి ఇలా? ద్రోణ గారు బొమ్మలు వేసి, వేసి భార్యను కూడా ఓ బొమ్మను చేశారా? లేక ఆమె మనస్తత్వమే అంతనా? అయినా ఆవిడ గురించి నాకెందుకులే…ఆయన భార్యను చూడాలన్న కోరికైతే తీరింది. అది చాలు. అనుకుంటూ శృతిక […]

బ్రహ్మలిఖితం 21

రచన: మన్నెం శారద అంబులెన్స్ లో అతి బలవంతంగా నల్గురు వార్డు బాయిల సహయంతో ఈశ్వరిని డాక్టర్ ప్రభంజన దగ్గరకి తీసుకెళ్లారు. ఈశ్వరి ఏడుస్తూ గింజుకుంటుంటే ప్రభంజన వార్డుబాయిల కేసి చూసి “ఆమెనెందుకు హింసిస్తున్నారు. ఆమె కేమన్నా పిచ్చా? షి ఈజ్ ఆల్‌రైట్. ఆమె నొదలండి.”అంది. వార్డుబాయిలు ఈశ్వరినొదిలేసేరు. ఈశ్వరి ప్రభంజన్ తనని సపోర్టు చేసినట్లుగా ఫీలయింది. ఆమె ప్రభంజన కేసి ఫిర్యాదు చేస్తున్న చంటిపిల్లలా చూసి “చూడండి. నేనెంత చెప్పినా వీళ్ళు నా మాట వినకుండా […]

విరక్తి

రచన: వాత్సల్య రాత్రి పదిన్నరవుతోంది. మానస మంచం మీద విసుగ్గా అటూ ఇటూ కదులుతోంది, ఎంత ప్రయత్నించినా నిద్రాదేవి కరుణించట్లేదు. అరగంట క్రితం గుండెల్లో సన్నని మంట మొదలయ్యింది. లేచి కాస్త మజ్జిగ కలుపుకుని తాగిందే కానీ అరగంటైనా తగ్గట్లేదు. మంచం దిగి మాస్టర్ బెడ్రూం లోకి వెళ్ళింది. అక్కడ పని చేసుకుంటున్న భర్త దీపక్ కనీసం ఈమె రాకని గమనించినట్లు కూడా లేదు. కొన్ని సెకన్లు అతనికెదురుగా నిలబడి తనని గమనించట్లేదని బాత్రూంలోకి వెళ్ళి వచ్చి […]

తపస్సు – సంతకం

రచన: రామా చంద్రమౌళి ఆవులిస్తూ మనిషి ఒళ్ళు విరుచుకుంటున్న ప్రతిసారీ సవరిస్తున్నప్పుడు సాగే ఫిడేల్‌ తీగ సారిస్తున్నప్పటి విల్లు అల్లె తాడూ జ్ఞాపకమొస్తాయి స్ట్రెచ్‌.. స్ట్రెచ్‌ హృదయమూ, ఆత్మా వ్యాకోచిస్తున్నపుడు సముద్రం అలలు అలలుగా విస్తృతమౌతున్నట్టు మనిషిలోని తరతరాల వారసత్వావశేషాలు మేల్కొనడం తెలుస్తూంటుంది మంచుతుఫానుల్లో మనిషి గడ్డకడ్తూండడం మండుటెండలో మనిషి కరిగిపోతూండడం ఒక సత్యాన్ని ప్రవచిస్తుంది సంకోచించగల మనిషో.. ఒక అక్షరమో ఎప్పుడో ఒకప్పుడు తప్పక వ్యాకోచిస్తాయని – కాళ్ళని నిక్కించి మునగదీసుకుంటున్న కుక్క తను నీ […]

తేనెలొలుకు తెలుగు – 5

రచన: తుమ్మూరి రామ్మోహనరావు తెలుగు భాషను సుసంపన్నం చేసిన మరో దేశీఛందస్సుకు చెందిన ప్రక్రియ ఆటవెలది. ఆటవెలది అనగానే అనగననగరాగమతిశయిల్లుచునుండు తినగ తినగ వేము తియ్యనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ అనే పద్యం గుర్తుక వస్తుంది ఆటవెలదుల్లో అనేక లౌకిక వాస్తవాలను వెల్లడించిన ప్రజాకవి వేమన. మేడిపండు జూడ మేలిమై యుండును పొట్టవిప్పి చూడ పురుగులుండు పిరికి వాని మదిని బింకమీలాగురా విశ్వదాభిరామ వినుర వేమ ఇలా వందల పద్యాలు వేమన పేరుమీద […]

ఇరుకు

రచన: డా. తంగిరాల. మీరా సుబ్రహ్మణ్యం. బంధువుల ఇంట్లో పెళ్ళికి బెంగుళూరు వెళ్ళాను. ఆ పెళ్ళికి చిన్న మామయ్య కూతురు మాధవి వచ్చింది. చాలా సంతోషంగా అనిపించింది. ఎప్పటిలాగే నిరాడంబరంగా వుంది. ఆప్యాయంగా పలుకరించింది . చిన్న మామయ్య అరుణాచలం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఆయన తన అక్కా చెల్లెళ్లను ఆదరించిన తీరు నాకు ఆయన ఎడల గౌరవాన్ని పెంచింది. ఆయనకు వచ్చే జీతం తక్కువ. అయిదుగురు పిల్లలు. కానీ మేమంత మామయ్య ఇంటికి సెలవుల్లో […]