ఆమె-అతడు

రచన: భమిడిపాటి స్వరాజ్య నాగరాజారావు.

 

ఆమె నిలకడగా నిలిచుంటుంది,

అలజడులను గుండెల్లోనే దాచుకున్న సంద్రంలా .

అతడు ఆమె మదిని తెలుసుకోకుండానే

ఆమె వైపుకు ప్రవహిస్తాడు కలవాలనే తహతహతో ఉన్ననదిలా.

ఆమెకి నివేదించుకోవటమే తప్ప నిరాకరించటం తెలియదు,

అతనికి ఆక్రమించుకోవటమే తప్ప ఆదరించటం నచ్చదు.

ఆమె తన విశాలత్వంతో అతని విశృంఖలత్వాన్ని భరిస్తుంది,

అతను తన పశుతత్వాన్నే ప్రయోజకత్వంలా చరిస్తాడు.

ఆమె అతడిని అంగీకరించటమే తన ఆశయంలా జీవిస్తుంది,

అతడు ఆమెను దోచుకోవటమే తన పరాక్రమానికి సంకేతంలా భావిస్తాడు.

అతనిని అపార్ధం చేసుకోవాలనే ఆలోచనే ఉండదు ఆమెకి,

ఆమెను అర్ధం చేసుకోవాలనే ధ్యాసే ఉండదు అతనికి.

కారుణ్యం ఆమెకు దాసి,కరుకుతనం అతని సహవాసి.

కొల్లగొట్టబడిన నిధిలా ఆమె,ఆమె పాలిటి దురదృష్టపువిధిలా అతడు.

 

 

1 thought on “ఆమె-అతడు

Leave a Comment