తియ్యదనం

రచన: రోహిణి వంజరి

 

కెజియా వచ్చి ప్రార్థన చేసిన

కేకు తెచ్చి ఇచ్చింది….

రంజాన్ నాడు రజియా వచ్చి షీర్ కుర్మా

రుచి చూడమంది……

దసరా పండుగ నాడు

విజయ వచ్చి అమ్మ వారి

ప్రసాదం చక్కెర  పొంగలి

తెచ్చి నోట్లో పెట్టింది…..

అన్నింటిలోనూ ఒకటే

తియ్యదనం……

అదే మనందరినీ కలిపే

మానవత్వం……..

అనురాగపు వెల్లువలో

అందరం తడిసి

మురిసే వేళ, ఎందుకు మనకు కులమతాల గోల…….

 

 

1 thought on “తియ్యదనం

Leave a Comment