April 20, 2024

మగబుద్ధి

రచన: పారనంది శాంతకుమారి

 

 

తనతో ఆవిడ నడుస్తుంటే సమానంగా,

అతడు దానిని భావిస్తాడు అవమానంగా.

పక్కవారితో ఆవిడ మాట్లాడుతుంటే అభిమానంగా,

అతడు చూస్తుంటాడు అనుమానంగా.

అతని పోరు పడలేక ఆవిడ పుట్టింటికి వెళ్తే స్వాభిమానంగా,

ఆవిడ లేకుంటే అతడికి అంతాకనిపిస్తూ ఉంటుంది శూన్యంగా,

ఆవిడ వచ్చేవరకు ఉంటాడు అతిదీనంగా,

వెళ్లిమరీ బ్రతిమాలాడుకుంటాడు హీనంగా,

ఆవిడనే తలుస్తుంటాడు తనప్రాణంగా,

ఆవిడనే తలుస్తుంటాడు తదేకధ్యానంగా,

ఆవిడని తీసుకువచ్చిన తరువాత

కొన్నిరోజులు ఆవిడతోఉంటాడు నవ్యంగా,

ఆవిడను చూసుకుంటాడు దివ్యంగా,

కొద్దిరోజులకే అతనిబుద్ధి మళ్ళీ మారిపోతుంది అపసవ్యంగా,

ఇలా ఎన్నిసార్లయినా అతను ఆవిడతో ఉండలేడు అన్యోన్యంగా.

1 thought on “మగబుద్ధి

  1. మగాడు వేడి పోయి కింద మంట ఉన్నపుడే … ఎప్పటికైనా ఈ పరిస్థితి మారేనా… i think it is deeply rooted mindset… పూర్తి ప్రక్షాళనకి మరి కొన్ని తరాలు పట్టేలా ఉంది…. బాగా రాశారు ఇలాంటివి ఎప్పటికీ అప్పుడు అందరకి గుర్తు చేస్తూ ఉండాలి… ధన్యవాదాలు… …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *