April 25, 2024

ఆమె-అతడు

రచన: భమిడిపాటి స్వరాజ్య నాగరాజారావు.   ఆమె నిలకడగా నిలిచుంటుంది, అలజడులను గుండెల్లోనే దాచుకున్న సంద్రంలా . అతడు ఆమె మదిని తెలుసుకోకుండానే ఆమె వైపుకు ప్రవహిస్తాడు కలవాలనే తహతహతో ఉన్ననదిలా. ఆమెకి నివేదించుకోవటమే తప్ప నిరాకరించటం తెలియదు, అతనికి ఆక్రమించుకోవటమే తప్ప ఆదరించటం నచ్చదు. ఆమె తన విశాలత్వంతో అతని విశృంఖలత్వాన్ని భరిస్తుంది, అతను తన పశుతత్వాన్నే ప్రయోజకత్వంలా చరిస్తాడు. ఆమె అతడిని అంగీకరించటమే తన ఆశయంలా జీవిస్తుంది, అతడు ఆమెను దోచుకోవటమే తన పరాక్రమానికి […]

తియ్యదనం

రచన: రోహిణి వంజరి   కెజియా వచ్చి ప్రార్థన చేసిన కేకు తెచ్చి ఇచ్చింది…. రంజాన్ నాడు రజియా వచ్చి షీర్ కుర్మా రుచి చూడమంది…… దసరా పండుగ నాడు విజయ వచ్చి అమ్మ వారి ప్రసాదం చక్కెర  పొంగలి తెచ్చి నోట్లో పెట్టింది….. అన్నింటిలోనూ ఒకటే తియ్యదనం…… అదే మనందరినీ కలిపే మానవత్వం…….. అనురాగపు వెల్లువలో అందరం తడిసి మురిసే వేళ, ఎందుకు మనకు కులమతాల గోల…….    

మగబుద్ధి

రచన: పారనంది శాంతకుమారి     తనతో ఆవిడ నడుస్తుంటే సమానంగా, అతడు దానిని భావిస్తాడు అవమానంగా. పక్కవారితో ఆవిడ మాట్లాడుతుంటే అభిమానంగా, అతడు చూస్తుంటాడు అనుమానంగా. అతని పోరు పడలేక ఆవిడ పుట్టింటికి వెళ్తే స్వాభిమానంగా, ఆవిడ లేకుంటే అతడికి అంతాకనిపిస్తూ ఉంటుంది శూన్యంగా, ఆవిడ వచ్చేవరకు ఉంటాడు అతిదీనంగా, వెళ్లిమరీ బ్రతిమాలాడుకుంటాడు హీనంగా, ఆవిడనే తలుస్తుంటాడు తనప్రాణంగా, ఆవిడనే తలుస్తుంటాడు తదేకధ్యానంగా, ఆవిడని తీసుకువచ్చిన తరువాత కొన్నిరోజులు ఆవిడతోఉంటాడు నవ్యంగా, ఆవిడను చూసుకుంటాడు దివ్యంగా, […]