March 19, 2024

మాలిక పత్రిక జనవరి 2019 సంచికకు స్వాగతం

Jyothivalaboju Chief Editor and Content Head Maalika Web Magazine మిత్రులు, రచయితలు, పాఠకులు అందరికీ మాలిక పత్రిక తరఫున ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.  కాలెండర్ మార్పు తప్ప ఇతరత్రా ఎటువంటి తేడాలు కనపడవు. కాని మనం ఏదైనా చేయాలి, సాధించాలి అనుకున్నప్పుడు అదే నూతన సంవత్సరం , అదే సంబరం అనుకోవచ్చు. కాని మనమందరం ఒక కొత్త ఉత్సాహం, ఉల్లాసాన్ని ఈ విధంగా జరుపుకోవచ్చు. సంతోషానికి ముహూర్తం,తేదీ అవసరం లేదు కదా. జనవరి […]

బ్రహ్మలిఖితం 21

రచన: మన్నెం శారద అతను కళ్ళద్దాలు సవరించుకొని అందులో రసింది దీక్షగా చదివేడు. ఆ పైన పకపకా నవ్వాడు. కాన్హా అసహనంగా చూస్తూ నిలబడ్డాడు. “ఏముంది అందులో?” “ఏముంటుంది? మామూలే. నీకు తనకి ఉన్న అనుబంధానికి వెల లేదట. నువ్వు చేసిన సహాయానికి డబ్బిస్తే నువ్వు బాధపడతావని డబ్బివ్వడం లేదట. ప్రేమకి పర్యవసానం పెళ్లి కాకపోతే ఆమె హృదయంలో మొదటి స్థానం నీదేనట. మనసు నెప్పుడైనా ఒంటరితనం ఆవహించినా, బాధ కల్గినా మొదటిసారి గుర్తు చేసుకునేది నిన్నేనట. […]

గిలకమ్మ కతలు – అద్దీ.. లెక్క! కుదిరిందా.. తిక్క?

రచన: కన్నెగంటి అనసూయ మజ్జానం బడి వదిలే ఏలయ్యింది. పొద్దున్ననగా పెరుగన్నం తినెల్లినోళ్ళు ఆకలితో నకనకలాడతా ఇంటికొత్తారని.., ఆళ్లకి అన్నాలు పెట్టి తను తినొచ్చులే అని పనంతా అయ్యాకా నీళ్ళోసుకుని ఈధి తలుపులు దగ్గరకేసి వసారా మీద గోడకి నిలబెట్టున్న నులక మంచాన్ని వాల్చి దుప్పటీ, తలగడీ లేకుండా ఆమట్నే ఇలా నడుం వాల్సిందో లేదో సేస్సేసున్న ఒల్లేవో..ఇట్టే కునుకట్తేసింది సరోజ్నికి. అంతలోనే తలుపు మీదెవరో “మేడంగారా..మేడంగారా..” అంటా సేత్తో కొట్టిన సప్పుడై సటుక్కున లేసి కూకుంది […]

తపస్సు – ఆఖరి మెట్టు పైనుండి.

రచన: రామా చంద్రమౌళి ఇక్కడనుండి చూడు.. ఈ ఆఖరి మెట్టుపైనుండి ముషాయిరా.. రాత్రిని కాల్చేస్తూ కాల్చేస్తూ ఎలుగెత్తిన స్వరాలను మోసుకుంటూ గాలిలో .. ఒక దుఃఖజీర ప్రక్కనే నిరంతరమై ప్రవహిస్తూ.. నది.. నిశ్శబ్దంగా – ఔనూ.. శరీరంలోని ప్రాణం శబ్దిస్తుందా పాదాలు ఒక్కో మెట్టు ఎక్కుతున్నప్పుడు అందుకోవాలని అలలు పడే యాతన.. ఒక వియోగ జీవక్షోభ గజల్‌ గాయని ఒక్కో వాక్యకణికను యజ్ఞంలోకి సమిధగా అర్పిస్తున్నపుడు అక్షరాలు.. అగ్నిబిందువులై తేలి వస్తూంటాయి గాలిలో సముద్ర జలాలపై లార్క్‌ […]

కథ గురించిన కథ చెబుతా – ఏడు తరాలు

రచన: ఓరుగంటి శ్రీలక్ష్మి నరసింహ శర్మ. నాకు ఇప్పటికి బాగా గుర్తు. నన్ను చిన్నప్పుడు మా హీరో తన హీరో సైకిల్ పైన కూర్చోపెట్టుకుని ఆ రోజ నన్ను మొదటిసారి మా ఊరిలో ఉన్న ఆ లైబ్రరీకి తీసుకునివెళ్ళడం. ముప్పై రెండు సంవత్సరాల క్రితం నాకు ఆ లైబ్రరీలో తొలి నేస్తంగా మారింది ఈనాడు ఆదివారంలో వచ్చే “ఫాంటం” కధలు. అలా మొదలైన పుస్తకాలతో నా అనుబంధం ఆ లైబ్రరీలో ఉన్న నా వయస్సుకి తగ్గ పుస్తకాలన్నింటిని […]

తేనెలొలుకు తెలుగు – 5

రచన: తుమ్మూరి రామ్మోహనరావు విశ్వవ్యాప్తంగా తెలుగు మాట్లాడేవాళ్లు కోట్ల సంఖ్యలో ఉన్నారు. కాని రాను రాను వాడేవాళ్లు తగ్గి భాష ఎక్కడ అంతరించిపోతుందోనన్న భయం కొంతమందికి లేకపోలేదు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవునేమో అనిపిస్తుంది కూడా. ఇంత అందమైన మన మాతృభాష అంతరించకుండా ఉండాలంటే ఒక తరం నుండి ఇంకొక తరానికి అది అందించబడాలి. మన తెలుగులో చాటువులు అని ఉన్నాయి. వాటికి తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అసలు చాటువంటే ఏమిటి? కవులైన […]

జలజాక్షి. జలజాపతి. ఎక్సర్ సైజులూ. ఎగస్ట్రాలూ.

రచన: గిరిజారాణి కలవల వీక్లీలో. స్లిమ్ గా వున్న హీరోయిన్ వైపూ. జలజాక్షి వైపూ. మార్చి మార్చి చూసాడు మన జ. ప. జుట్టంతా నడినెత్తికి చేర్చి ఓ క్లిప్పు పెట్టేసి, గోనెసంచీ లాంటి నైటీ తగిలించుకుని పైనుంచి కింద దాకా ఒకే ఆకారంలో కాళ్ళు చాపుకుని, టీవీ చూస్తున్న జలజం. లంకలో సీతాదేవికి కాపలా వున్న రాక్షసకన్యలాగా, సన్నటి మెరిసే మెరుపుతీగలా, తళుకులీను చీరలో ఆ బ్యూటీ హీరోయిన్ జ. ప కళ్ళకి దేవకన్యలా కనపడుతోంది. […]

కంభంపాటి కథలు – రంగు పడింది.

కంభంపాటి రవీంద్ర నందగోపాల్ గారికి ఉదయాన్నే, అంటే సూర్యుడు తన చిరు వెలుగుల్ని ప్రసరించకుండానే లాంటి మాటలెందుకులెండి గానీ, సూర్యుడు డ్యూటీలోకి దిగకముందే వాకింగ్ కి వెళ్లడం చాలా ఇష్టం. ఈ మధ్యనే రిటైర్ అయ్యేరేమో, ఖాళీగా ఉండడం ఇష్టం లేక, వాళ్ళ అపార్ట్మెంట్ అసోసియేషన్ సెక్రటరీ బాధ్యత తీసుకున్నారు. ఈ పదవి తీసుకోకముందు ఏదో తన మానాన తాను ఓ గంటసేపు అందరినీ పలకరించుకుంటూ వాకింగ్ చేసుకునొచ్చేసేవారు. ఇప్పుడు ఆ పలకరింపులు కాస్తా, ఫిర్యాదులయ్యేయి. ఇంతకు […]

బూలా ఫిజీ

రచన: మీరా సుబ్రహ్మణ్యం నాడి విమానాశ్రయంలో ఆగిన విమానం నుండి దిగగానే ఇండియాకు వచ్చేసినట్టు అనిపించింది. ట్యాక్సీ కోసం బయకునడుస్తున్న మాకు దారికి ఇరువైపులా ఎర్రని మందార పూలు స్వాగతం పలికాయి. ఆస్ట్రేలియా నుండి అమెరికాకు ప్రయాణంలో మధ్యలో ఫిజీ లో నాలుగు రోజులు గడపాలని ముందుగానే అక్కడ డెనరవ్ ద్వీపంలో ఎస్టేట్స్ అనే రిసార్ట్ లో ఇల్లు తీసుకుంది అమ్మాయి. ఫిజీ దీవులు ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతం. ప్రకృతి సౌందర్యానికి ఆటపట్టు. ఎక్కడ చూసినా […]