అడగాలి

రచన: పారనంది శాంతకుమారి.

తల్లితండ్రులను విశాల హృదయం అడగాలి
తోబుట్టువులని తీరని బంధం అడగాలి
పిల్లలను నవ్వులు అడగాలి
పెద్దలను దీవనలు ఆడగాలి
ప్రేయసిని మాయని అనుభూతి అడగాలి
స్నేహితుడిని అండ అడగాలి
భార్యని బాంధవ్యం అడగాలి
కనులను కలలు అడగాలి
కౌగిలిని వెచ్చదనం అడగాలి
తనువును సుఖం అడగాలి
మనసును శాంతి అడగాలి
బుద్ధిని మౌనం అడగాలి
రాత్రిని నిదుర అడగాలి
కోరికను తీరమని అడగాలి
ఏకాంతాన్ని ఏకాగ్రత అడగాలి
జ్ఞానాన్ని అనుభవజ్ఞానం అడగాలి
రక్తిని విరక్తి అడగాలి
దైవాన్ని జ్ఞానం అడగాలి
జీవితాన్ని మోక్షం అడగాలి

Leave a Comment