స్పర్శ

రచన: రోహిణి వంజరి

చంటి బిడ్డకే తెలుసు అమ్మ
పొత్తిళ్ళలోని వెచ్చదనపు స్పర్శ……
ఎడారిలో ఎండమావికే తెలుసు, ఎప్పుడో ఏనాటికో
నింగి నుండి జారి పడే
వాననీటి స్పర్శ…….
యుద్ధవీరునికే తెలుసు
విజయం వరించినపుడు
భుజం తట్టి అభినందించే
అనుంగుల చేతి స్పర్శ…….
నిరాశ నిండిన మనసుకే తెలుసు, జీవితంలో ఏది
సాధించలేని ఓటమి స్పర్శ…….
ఓటమికే తెలుసు, ఓడిపోయినా వీడిపోక
వెన్నుతట్టి ధైర్యం చెప్పే
మిత్రుని ప్రోత్సాహపు స్పర్శ……….
రాఖీ కట్టే సోదరికే తెలుసు
సోదరుని కరచాలనపు
ఆత్మీయ స్పర్శ……..
కానీ
ప్రతి అతివకూ తెలుసు
బాహ్య,అంతర్గతాన
కామాన్ని నింపుకుని
దుర్మార్గపు దాడికి పాల్పడాలనుకునే
మదపిశాచుల నిక్రృష్టపు
కరస్పర్శ………..‌.‌

1 thought on “స్పర్శ

Leave a Comment