March 29, 2024

బూలా ఫిజీ

రచన: మీరా సుబ్రహ్మణ్యం నాడి విమానాశ్రయంలో ఆగిన విమానం నుండి దిగగానే ఇండియాకు వచ్చేసినట్టు అనిపించింది. ట్యాక్సీ కోసం బయకునడుస్తున్న మాకు దారికి ఇరువైపులా ఎర్రని మందార పూలు స్వాగతం పలికాయి. ఆస్ట్రేలియా నుండి అమెరికాకు ప్రయాణంలో మధ్యలో ఫిజీ లో నాలుగు రోజులు గడపాలని ముందుగానే అక్కడ డెనరవ్ ద్వీపంలో ఎస్టేట్స్ అనే రిసార్ట్ లో ఇల్లు తీసుకుంది అమ్మాయి. ఫిజీ దీవులు ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతం. ప్రకృతి సౌందర్యానికి ఆటపట్టు. ఎక్కడ చూసినా […]

శిక్ష

రచన: నిష్కల శ్రీనాథ్ “అమ్మా! రసం చాలా బాగుంది, ఈ రోజు వంట నువ్వే చేసావు కదా ?” అంది రోషిణీ ఎదో కనిపెట్టినట్టు ముఖం పెట్టి. దానికి సమాధానంగా గీత నవ్వుతూ ” అవును..సరే త్వరగా తిను ఇప్పటికే చాలా లేట్ అయింది పొద్దునే త్వరగా లేవాలి ” అంటూ ఇంకోసారి భర్తకు ఫోన్ చేసింది. లాభం లేదు ఈసారి కూడా ఎత్తలేదు అని పక్కన పెట్టి తినడం మొదలుపెట్టింది. ” నేను తినడం అయిపోయిందమ్మా […]

కౌండిన్య హాస్యకథలు – మనుషులు చేసిన బొమ్మల్లారా…

రచన: రమేశ్ కలవల “సార్, నేను ‘చెప్పుకోండి చూద్దాం’ కంపెనీ నుండి ఫోన్ చేస్తున్నాను” “ఏ కంపెనీ? “ “చెప్పుకోండి చూద్దాం” “ఎపుడూ వినలేదే మీ కంపెనీ పేరు” “గెస్ కంపెనీ సార్, మీరు తెలుగు వారు కదా అని ‘చెప్పుకోండి చూద్దాం’ కంపెనీ అన్నాను” “ఓ.. ఎందుకు కాల్ చేసారు?” అన్నాడు “మీ యావిడ గారి డెలివరీట కదా?” “ఎవరు నువ్వు ? అసలు ఎవరిచ్చారు నా నెంబరు? బుద్దుందా లేదా? యావిడ అంటావేంటి, ఆవిడ […]

కాంతం_కనకం – ఒక చెత్త కథ….

రచన: మణి గోవిందరాజుల దుప్పటీ ముసుగు తీసి నెమ్మదిగా తల పక్కకి తిప్పి చూసాడు కనకారావు. కాంతం కనబడకపోయేసరికి గుండె గుభిల్లుమంది. “అప్పుడే వెళ్ళిందా వాకింగ్ కి?” నీరసంగా అనుకున్నాడు. అయినా ఆశ చావక “కాంతం” అని పిలిచాడు , పిలిచాననుకున్నాడు. యేదో తుస్ తుస్ మని సౌండ్ వచ్చిందే కాని పిలుపు బయటికి రాలేదు. గొంతు సవరించుకుని మళ్ళీ పిలిచాడు కొంచెం గట్టిగా”కాంతం”.. “వస్తున్నానండి” అంటూ వచ్చి చిరునవ్వులు రువ్వుతూ తన యెదురుగా నిలిచిన కాంతాన్ని […]

కధ కానిదీ… విలువైనదీ…

రచన: గిరిజ పీసపాటి “మీరెన్నైనా చెప్పండి. అమ్మాయికి ఇంత చిన్న వయసులో పెళ్ళి చెయ్యడం నాకు అస్సలు ఇష్టం లేదు” అంది నాగమణి, భర్త రామ్మూర్తి కంచంలో అన్నం మారు వడ్డిస్తూ… “ఇప్పుడు ఈ సంబంధాన్ని కాలదన్నుకుంటే మళ్ళీ ఇంత మంచి సంబంధం మన జన్మలో తేలేము. అబ్బాయి అందంగా ఉంటాడు, ఆస్తి ఉంది, ఏ వ్యసనాలు లేనివాడు, పైగా ఏరి కోరి మనమ్మాయే కావాలనీ, కానీ కట్నం కూడా ఆశించకుండా చేసుకుంటానంటున్నాడు” అంటున్న భర్త మాటలకు […]

సంగీతానిది ఏ మతం ?

రచన: కాంత గుమ్మలూరి ఇంట్లో అందరూ సంగీత ప్రియులే. అమ్మేమో చాలామందికి కర్నాటక్ క్లాసికల్ సంగీతం నేర్పిస్తుంది. నాన్నయితే అన్నిరకాలూ హిందుస్తానీ, కర్నాటక్ సంగీతాలే కాక పాత తెలుగూ , హిందీ సినిమా పాటలూ, నిజానికి ఏ భాషయినా పాట బాగుందనిపిస్తే సమయం దొరికినప్పుడల్లా వింటూనే ఉంటారు. అన్నయ్య డాక్టరీ చదువు. కాలేజీలో ప్రతీ మ్యూజిక్ కాంపిటీషన్ లోనూ పాల్గొంటాడు.. ప్రైజులు కూడా తెచ్చుకుంటాడు. అక్క హైయర్ సెకండరీ. సంగీతం నేర్చుకుంటోంది. చాలా బాగా పాడుతుంది కూడా. […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 32

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య “బాలస్తావత్‌ క్రీడాసక్తః – తరుణస్తావత్‌ తరుణీ సక్తః – వృద్ధస్తావత్‌ చింతాసక్తః – పరమే బ్రహ్మణి కో పినసక్తః” ఈ దేహాన్ని గురించి, దాని యదార్థ తత్వాన్ని గురించి తెలుసుకోలేని సామాన్యులు జీవితాన్ని ఎలా వ్యర్థం చేసుకుంటున్నారో ఆది శంకరులు తెలిపిన శ్లోకమిది. ‘మోహముద్గరం’ గా పేరొందిన 31 శ్లోకాల ‘భజగోవిందం’లోని ఏడో శ్లోకం యిది. మానవుడు.. బాల్యంలో ఆటపాటల మీద ఆసక్తితో ఉంటాడు. యౌవనంలో స్త్రీల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. […]

శ్రీ కాళహస్తీశ్వర శతకం నుండి పదకొండు పద్యాలు

రచన: శారదా ప్రసాద్ మిత్రులకు నమస్కారములతో, కొంతమంది శ్రేయోభిలాషులు, హితులు మిత్రులు, కార్తీక మాస సందర్భంలో ‘శ్రీ కాళహస్తీశ్వర శతకం’నుండి కనీసం పది పద్యాలను, వాటి అర్ధాలను తెలియచేయమని ఆశీర్వచనపూర్వకంగా ఆదేశించారు. దానిని శివాజ్ఞగా భావించి, కొన్ని పద్యాలను గురించి చెప్పటానికి ప్రయత్నిస్తాను. విశేషమేమంటే, నేను శ్రీకాళహస్తిలో అయిదు సంవత్సరాలు పనిచేసాను. ఆలయంలో గోడలపై ‘శ్రీ కాళహస్తీశ్వర శతకం’లోని పద్యాలన్నిటినీ చెక్కారు. అలా, నేను ఆ పద్యాలన్నిటినీ అతి జాగ్రత్తగా చదివాను. చాలావరకు నోటికి వచ్చు. అర్ధాలను […]

సుభద్ర జోషి

రచన: అంబడిపూడి శ్యామసుందరరావు భారతరత్న, మాజీ ప్రధాని, ఉత్తమ పార్లమెంటేరియన్ గా పేరెన్నికగన్న అటల్ బిహారీ వాజపేయి 10సార్లు లోక్ సభకు , రెండుసార్లు రాజ్యసభకు ఎన్నిక అయిన వ్యక్తి. అటువంటి రికార్డులు సృష్టించిన, ప్రజాదరణ పొందిన, అన్ని పార్టీల నుండి ప్రశంసలు పొందిన మహా రాజకీయవేత్త 1962 లోక్సభ ఎన్నికలలో అయన సుభద్ర జోషి అనే మహిళా చేతిలో ఓటమిని చవి చూడవలసి వచ్చింది రాజకీయాలలో ముఖ్యముగా ఎన్నికలలో గెలుపు ఓటములు సహజము. పెద్దపెద్ద నాయకులు […]