April 20, 2024

మది మధనం!

రచన: పద్మజ యలమంచిలి తనకెందుకీ వేళ ఇంత అలజడి?? మనసంతా మెలితిప్పినంత బాధగా ఉంది.. ఏదో వెలితి,తెలియని అభద్రతాభావం… అతను చనిపోయాడు..అయితే…నాకెందుకీ బాధ?? అందరూ 11వ రోజని భోజనాలు చేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు కదా?? ఆఖరుకు అతని తల్లి కట్టుకున్న భార్య, పిల్లలు, అందరూ బానే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు?? తనేమిటిలా…ఈ ముప్పై సంవత్సరాల్లో ఒక్కసారైనా అతనితో మాట్లాడింది లేదు..చూసిందీ లేదు…మరెOదుకిలా?? దుఃఖం ఎగదన్నుకొస్తొOది?? నీకు తెలుసా…విజయమ్మగారి అబ్బాయి..ప్రాణం ఇక్కడే పోవాలని రాసిపెట్టున్నట్టుంది. […]

స్పర్శ

రచన: రోహిణి వంజరి చంటి బిడ్డకే తెలుసు అమ్మ పొత్తిళ్ళలోని వెచ్చదనపు స్పర్శ…… ఎడారిలో ఎండమావికే తెలుసు, ఎప్పుడో ఏనాటికో నింగి నుండి జారి పడే వాననీటి స్పర్శ……. యుద్ధవీరునికే తెలుసు విజయం వరించినపుడు భుజం తట్టి అభినందించే అనుంగుల చేతి స్పర్శ……. నిరాశ నిండిన మనసుకే తెలుసు, జీవితంలో ఏది సాధించలేని ఓటమి స్పర్శ……. ఓటమికే తెలుసు, ఓడిపోయినా వీడిపోక వెన్నుతట్టి ధైర్యం చెప్పే మిత్రుని ప్రోత్సాహపు స్పర్శ………. రాఖీ కట్టే సోదరికే తెలుసు సోదరుని […]

అడగాలి

రచన: పారనంది శాంతకుమారి. తల్లితండ్రులను విశాల హృదయం అడగాలి తోబుట్టువులని తీరని బంధం అడగాలి పిల్లలను నవ్వులు అడగాలి పెద్దలను దీవనలు ఆడగాలి ప్రేయసిని మాయని అనుభూతి అడగాలి స్నేహితుడిని అండ అడగాలి భార్యని బాంధవ్యం అడగాలి కనులను కలలు అడగాలి కౌగిలిని వెచ్చదనం అడగాలి తనువును సుఖం అడగాలి మనసును శాంతి అడగాలి బుద్ధిని మౌనం అడగాలి రాత్రిని నిదుర అడగాలి కోరికను తీరమని అడగాలి ఏకాంతాన్ని ఏకాగ్రత అడగాలి జ్ఞానాన్ని అనుభవజ్ఞానం అడగాలి రక్తిని […]

విలువ తెలుసుకో!

రచన: భమిడిపాటి స్వరాజ్య నాగరాజారావు ఎవరు లేకుంటే నీకు విలువ లేదో, నీవు నిలువ లేవో, గ్రహించలేకున్నావు, నీ అహంకారాన్ని నిగ్రహించలేకున్నావు. ఎవరు నీకు కంటివెలుగై, నీ కాలి అడుగై, నీ గొడుగై, నీకు నీడగా,నీ తోడుగా నిలుస్తున్నారో నీకు గెలుపునిస్తున్నారో తెలియలేకున్నావు. ఆమెను మనసారా కలియలేకున్నావు, ఆమె మనసును తెలియలేకున్నావు. ఆ తోడుని అలుసు చేస్తున్నావు ఆమెతో నీ అనుబంధాన్ని పెళుసు చేసుకుంటున్నావు. నిన్ను పట్టి పీడిస్తున్నది తెలియని అజ్ఞానమనుకోవాలా? తెలియనివ్వని అహంకారమనుకోవాలా? నిజంలో చరించ […]