April 25, 2024

కాంతం సంఘసేవ

రచన: మణికుమారి గోవిందరాజుల     కాంతానికి దిగులెక్కువయింది. ముఖ్యంగా “స్వచ్ఛ్ భారత్ వుద్యమం “ప్రాజెక్ట్ ఫెయిల్ అయిన దగ్గరనుండి తాను దేశానికి యేమీ చేయలేక పోతున్నాను అన్న బాధ యెక్కువయ్యి అన్నం కూడా సయించడం లేదు. వూహ తెలిసినప్పటి నుండి కూడా కాంతానికి సొసైటీకి యేదో ఒకటి చేసి మాతృదేశానికి తన వంతు సేవ అందించాలనేది చాలా గాఢమైన కోరిక. అదేమి చిత్రమో యేది చేద్దామన్నా యేదో ఒక అడ్డంకి వచ్చేది. యెవరికన్నా చెప్తే నవ్వుతారేమో […]

కౌండిన్య హాస్యకథలు – ప్రేమాయణం

రచన: రమేశ్ కలవల ‘రెండు రోజుల నుండి చూస్తున్నా మిమ్మల్ని! ఏంటి చెత్త మా ఇంటిలోకి విసురుతున్నారు?’ అని చిరుకోపంతో అడిగింది పక్కింటి అలేఖ్య. చెత్త కాదండి. తొక్కలు విసిరాను. ‘తొక్కలో… ‘ అనేలోగా ఆ అమ్మాయి అడ్డుకొని ‘మాటలు జాగ్రత్త’ అంది కోపంతో వేలు చూపిస్తూ ‘నే చెప్పేది వినండి. అసలు తొక్కలో ఏముంది అనుకుంటాం కదా. తొక్కలు వేస్తే మొక్కలు బాగా పెరుగుతాయి మీకు తెలుసా? అందుకే మీ తోటలో మొక్కలకోసం విసిరాను’ అన్నాడు […]

ఆసరా.. 1.

రచన: పద్మజ యలమంచిలి   అమ్మగారూ…అమ్మగారూ…మన పక్కింటి ఆవిడ  ఇద్దరి పిల్లలతో బావిలో దూకేసిందట…  ఈతగాళ్లను బెట్టి తీయించేరట… పెద్ద పానం దక్కింది కానీ పసి పాణాలు ఎల్లిపోనాయి.. ఇక ఆయమ్మ బతికినా సచ్చినా ఒకటే… రత్తాలు ఊపిరి తీసుకోకుండా చెప్పుకుపోతానే ఉంది.. నా గుండె ఆగినంత పనైంది..తేరుకుని ఇప్పుడే వస్తానని పక్కింట్లోకి పరిగెత్తాను.. ఎప్పుడూ నవ్వుతూ ఇంటి పని, వంటపని చేస్తూనే బీఎడ్ కి ప్రిపేర్ అవుతూ  పిల్లలతో నిమిషం తీరికలేకుండా ఉండే నీరజ ఎందుకిలా […]

‘నా కొడుకా’ అని ఒక్కసారి పిలువమ్మా!

రచన : సోమ సుధేష్ణ     “కొత్త ఇంట్లో చాల బావుంది శ్రీను.” అంటూ హిమ ఫేమిలీ రూమ్ లో నలుమూలలా తాను చేసిన అలంకారాలు సరి చేసుకుంటూ అంది. శ్రీనివాస్ కు కూడ అలంకరణ నచ్చింది. రాబోయే తల్లిదండ్రులకోసం అన్ని సిద్దంగా ఉన్నాయి. తృప్తిగా తలాడించాడు. ఇద్దరూ ఆ పక్కనే ఉన్న బెడ్ రూమ్ లోకి వెళ్ళారు. కింగ్ సైజు బెడ్ దానికి రెండు వైపులా టేబుల్స్ పై లాంప్స్ ఉన్నాయి. బెడ్ కు […]

సమర్ధత

రచన:   నిష్కల శ్రీనాథ్   గడియారంలో  పెద్ద ముల్లు పన్నెoడు దగ్గరికి  చిన్న ముల్లు ఆరు దగ్గరికి రాగానే సీటులోంచి లేచాను . ఈరోజు మధ్యాహ్నం బాక్స్ కూడా తీసుకురాలేదని ఏమో ఆకలి కాస్త ముందుగానే వేసింది. ఇక ఆలస్యం చేయకూడదు అని ఆఫీస్ బయటకు నడిచాను, దగ్గరలోనే హోటల్ ఉంది త్వరగా వెళితే మంచిది అనుకుంటూ నాలుగు అడుగులు వేశానో లేదో విజయ్ కనిపించాడు. వాడి ఆఫీస్ కూడా మా ఆఫీస్ కి దగ్గరే […]

హిమవత్పద్యములు-2

  రచన:  జెజ్జాల కృష్ణ మోహన రావు   కందగీతి – బేసి పాదములు – తేటగీతి మొదటి మూడు గణములు, సరి పాదములు – తేటగీతి పాదము ప్రేమ యామనిన్ బెంపొందు ప్రేమ నీరామనిన్ నిండి – పెల్లుబుకును ప్రేమ శిశిరపు రంగులౌ ప్రేమ హేమంత కాలపు – వెచ్చదనము   కమలగీతి – సూ/సూ/సూ – సూ/సూ రవి వెలుంగు తగ్గె – రాత్రి హెచ్చె భువిని చెట్టులెల్ల – మ్రోడువారె దివిని పులుఁగు […]

తేనెలొలుకు తెలుగు-ఆమ్రేడిత శోభ

  రచన: తుమ్మూరి రామ్మోహనరావు     ~~~~~~~~~~~~~ “గలగలా గోదారి కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటే ~~~~~~~~~~   ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను జ్యోతి వలబోజుగారి సందేశం రాకముందే ‘చకచకా’ వ్యాసం రాసి పంపించాలని. కాని కొంత పనుల నెపం, మరికొంత బద్ధకం.  ‘గబగబా’ ఏదో రాయటం కాదుగదా. అసలే రాసేది తేనెలొలుకు తెలుగు గురించి. తెలుగు భాష తియ్యదనం గురించి. సరే ఈసారి ఆమ్రేడితాల గురించి మాట్లాడుకుందామనిపించింది.  వేరే భాషల గురించి తెలియదు కాని […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 35

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 35   విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య ఈ కీర్తనలో అన్నమయ్య వాదన బహు చిత్రవిచిత్రంగా ఉంటుంది. మనిషి యొక్క పాపపుణ్యాలకు కారణమైనది మనసు. ఆ మనస్సును నియంత్రించేది భగవంతుడే కదా!  అలాంటప్పుడు పాప పుణ్యాలను చేయించే బుద్ధిని  తప్పు మానవులది ఎలా అవుతుంది?  అందువల్ల ఆయన్నే అడగాలి. మనం చనిపోయాక మన పాపపుణ్యాల చిట్టా చిత్రగుప్తునిచే            చదివించి యమధర్మరాజు శిక్షించే పద్ధతిని ప్రశ్నిస్తున్నాడు అన్నమయ్య. చిత్తగించండి. కీర్తన: పల్లవి: అతని నడుగవో చిత్రగుప్త […]

NALEDI – ఒక బుజ్జి ఏనుగు కథ.

రచన: చక్రధర్ ఈ ప్రపంచంలో మనుషులతో పాటు ఎన్నో రకాల జంతువులు పక్షులు కీటకాలు సూక్ష్మజీవులు సముద్ర జీవులు ఉన్నాయి. దగ్గరగా ఉండి గమనిస్తే ప్రతి జీవి చేసే జీవన పోరాటం వాటి సాంఘికజీవనం ఆ జీవనంలో ఎదురయ్యే సమస్యలు శారీరక మానసిక బాధలు అన్ని అందరికీ ఒకటే. చూడటానికి భారీకాయులైనా మానసికంగా చాలా సున్నితమైన స్వభావం కలిగినవి ఏనుగులు. ఇవి శాకాహారులు. అనాదిగా మనిషితో స్నేహంగా ఉంటూ అతనికి ఎన్నో విధాల సాయపడిన జీవులు. ముఖ్యంగా […]

నడక-నడత

రచన: శారదాప్రసాద్ ఈ రోజుల్లో ప్రతివారూ నడకను గురించి మాట్లాడేవాళ్లే! సాధారణ నడక చాలని నా అభిప్రాయం. బజార్ కెళ్ళి మన పనులు మనం చేసుకుంటే చాలు. అతిగా నడవటం వలన అనర్ధకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. గుండెను వేగంగా పరిగెత్తిస్తుంటారు. ఈ నడక పిచ్చివాళ్లల్లో విపరీతమైన పోటీ కూడా ఉంటుంది . నేను 10 రౌండ్లు వేశానని ఒకాయన అంటే మరొకాయన నేను 12 వేసాను అంటాడు! ఇంతకీ ఆ రౌండ్స్ ఏమిటో? నడక పూర్తి […]