June 19, 2024

తపస్సు – కొంత స్థలం కావాలి

రచన: రామా చంద్రమౌళి


చిన్నప్పటినుండీ వాడంతే
చెప్పాపెట్టకుండా పారిపోతాడు.. ఎక్కడికో తెలియదు
ఆరో తరగతిలో మేమిద్దరం ఉన్నపుడు
ఆ సాయంకాలం.. మామిడికుంట నీటితలంపై
కంక కట్టెతో బాదుతూ కనిపించాడు
అడిగితే.. ‘ఈ నీళ్ళని ఎంత కొట్టినా విడిపోవెందుకురా ’ అన్నాడు
వాడి కళ్ళలోకి చూస్తే.. ఒట్టి శూన్యం
ఒక అవధూత.. నగ్నముని.. స్వాధిష్టాన చక్రంలో మహర్షి
మర్నాడు రాత్రే వెళ్ళిపోయాడు ఇంట్లోనుండి
ఎటు.?- తెలియదు
‘వెదకొద్దు నా కోసం.. మీ జీవితాలకోసం వెదుక్కోండి ’
అని ఒక చీటీ.. టేబుల్‌ పై రాయి కింద
చాలా రోజులే వెదికారు వాడికోసం
అందరూ మరిచిపోతూండగా మెరుపులా మళ్ళీ వచ్చాడు ఒకరోజు
వచ్చి ‘ పోయిన వాళ్ళందరూ మళ్ళీ తప్పక వస్తారు ’ అని ఒక నవ్వు
ఒకరి రాకకోసం నిరీక్షించడమైనా
ఒక మనిషికి వీడ్కోలివ్వడమైనా.. ఎంత కష్టమో
వెళ్ళిపోతున్న రైలును చూస్తున్నపుడు తెలుస్తుంది –
మనుషుల మధ్యా
బాంధవ్యాల అరలు అరల ‘ అర్రే ’ల మధ్య
తేనెటీగ వాలి.. ఝమ్మని లేచిపోతూ నెరిపే పాదరస బంధం
ఒట్టి తామరాకుపైనుండి వెన్నెల్లా ఒలికిపోతూ
‘జస్ట్‌ ఎ డ్రాపాఫ్‌ టియర్‌ ’
బంగాళాఖాతంపై లార్క్‌ పక్షి క్షణకాల మునక
కొంత తనదైన ‘ స్థలం ’ కోసం పరితపన
ఎక్కడా ఖాళీ దొరకదు.,
స్థలాన్వేషణలోనే మళ్ళీ మళ్ళీ పారిపోవడం
గమ్యముండదు
‘టికెట్‌ ఎక్కడికి ’ అంటే
‘ఈ రైలు ఎక్కడికి పోతుందో అక్కడికి ’ అని జవాబు
పట్టాలు దగ్గరికీ రావు.. దూరంగానూ విడిపోవు
నిర్ధారిత స్థాణత
ఒకే పట్టాపై ఎంతసేపు పరుగు.. మొసపోస్తూ
తాజ్‌ మహల్‌ను చూస్తున్నపుడు అడిగాను
‘ఏమి చూస్తున్నావు నువ్వు’ అని
‘దాని పునాదులెక్కడున్నాయో’ అంటూ ఫకఫకా నవ్వు
అప్పుడే ఫడేళ్మని వయొలిన్‌ తీగ ఒకటి తెగిపోయింది

పర్యటనలన్నీ అధ్యయన యాత్రలే ఐతే
రాత్రుళ్లకు రాత్రుళ్ళు
పురుషుడు నాగలై దున్నుతున్న ప్రతి క్షణమూ
రసరంజిత ఉద్విగ్న ఉత్సర్గ వైభవమే
నిద్రిస్తున్న అడవులనూ,
ఆవులిస్తున్న ఎడారులనూ,
అవిభాజ్య మదనోత్పల నదీనదాలనూ
కౌగిట్లో బంధించి బంధించి
అంతా లిబిడో..అతిరతి కాంక్ష
స్వయం సంయోగ విచ్ఛిత్తి పరితపన.,
రాత్రంతా ఉల్కలు ఉల్కలుగా కాంతి కురిసీ కురిసీ
ప్రాతఃకాలం శాంతిస్తున్న ప్రశాంత సమయంలో
అతను మళ్ళీ పారిపోయాడు
బంధనాన్నింటినీ చించుకుని.. తెంచుకుని –
ఒక మనిషి పారిపోతున్నాడూ అంటే
తనుంటున్న చోటు తనుండవసిన చోటు కాదని
తను జీవిస్తున్న జీవితం
తను జీవించవలసిన జీవితం కాదని
పక్షి తన గూడుకోసం జానెడు జాగాను వెదుక్కుంటున్నట్టు
మనిషి చారెడు ‘ స్థలాన్ని ’ ( Space ) అన్వేషిస్తున్నాడని
అన్వేషణంటే.. ఒక లేనిదాని ఉనికిని కనుక్కోవడమే… అని అర్ధమా !

Need Some Space

Translated by U. Atreya Sarma

Since his childhood, he’s been so.
Bolting out without a word, whither nobody can guess.
When he and I were in sixth grade,
I found him one evening
beating the water-surface of the village-pond afar
with a bamboo staff.
On noticing me, he said,
“Why don’t these waters cleave, though I beat them hard?”
I peered into his eyes, they were blank.
An ascetic, a naked hermit
In Swadhishtana Chakra, yogic posture,
he left home the next night, nobody knew where.
“Don’t search for me, only search for your self,”
left a note the table.

His people looked for him many days,
and when everyone almost forgot him,
he suddenly appeared on a certain day like lightning.

Smiling, he said, “Everyone who departs is sure to come back.”
How tough it is to wait for, or bid farewell to someone,
is known when we look at the departing train.
The human relations, a honeycomb maze of cells,
are a mercurial bond
like a honeybee landing on one of its cells
and flying away in a jiffy with a hum,
‘Just a drop of tear’ sliding like moonlight off a lotus leaf.
The lark takes a quick dive in the Bay of Bengal
and pines for a space of its own, but doesn’t find any.
It’s an unending quest for space with no destination.

It’s like querying “Ticket for which station?”
and getting the answer “For the station the train goes to.”
The rails never come nearer,
nor do they move apart from their fixed position.
How long can one run on a single rail, fretting and fuming?
While seeing the Taj Mahal, I asked,
“What’s it you’re looking for?”
And I received the guffaw
“For its foundation.”
And pronto, snapped a string of the fiddle.
If every travel is a study tour,
every nightly moment,
a man turns into a plough and tills,
turns into an intense flame of aesthetic thrill.

The sleepy forests, the yawning deserts,
and the unbroken streams of romantic lilies
in an embrace are tightened and tightened
full of libido, ruing the auto-erotic interruption.
In the serene moments of the dawn
unwinding from the hangover of the night
that soaked nonstop in the showers of shooting stars,
he broke lose once again.

If a man runs away, frantically snapping every bond,
it only means
that the place he has so far lived at is no longer his,
that the life he has so far lived is no more his,
that he is questing for a handful of space
like a bird looking for a nestful of space.
Quest is but seeking out a non-existent existence.

2 thoughts on “తపస్సు – కొంత స్థలం కావాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *