April 20, 2024

మార్మిక శూన్యం

రచన: రామా చంద్రమౌళి
అనువాదం: అనంత పద్మనాభరావు

మార్మిక శూన్యం

నిజానికి చాలాసార్లు మనకు ఏమి కావాలో మనకు తెలియదు
ఖాళీ గ్లాస్‌ వంటిది జీవితం అని ఒక ఉవాచ
గ్లాస్‌ సగం నిండి ఉందా.. సగం ఖాళీగా ఉందా అని ఒక చతురుడి ప్రశ్న
అసలు ఈ ‘ ఖాళీ ’ ఏమిటి లోపల .. ఆత్మలో అని ఒక మీమాంస
ఇక అన్వేషణ మొదలౌతుంది
అప్పుడు ఏదో అభౌతిక ప్రతిద్రవ్యం ( anti matter ) దేహమంతా విసరిస్తూ
మనిషి ఒక ఆకాశమౌతూ.. ఒక అరణ్యమౌతూ.. ఒక సముద్రమౌతూ
కొండల్లోకి వ్యాపిస్తున్న రైలు పట్టాలౌతూ
లోయ లోతుల్లో పొగమంచుతో నిండిన ఒక ఏకాంతమౌతూ
గమ్య రహితంగా ఎందుకో ఆకాశాన్నీదుతున్న ఒంటరి పక్షి ఔతూ
ఎండుటాకుపై నడుస్తూ వెళ్తున్న పాదాలౌతూ
ఆత్మ నిండా అంతా మార్మిక శూన్యం .. నిశ్శబ్ద ధ్వని

నిద్రిస్తున్న పాప
మూసిన పిడికిట్లో ఏముందో తెలుసా
పాప కనురెప్ప వెనుక ఎన్ని సంచలితాకాశాలు
సంభాషిస్తున్నాయో తెలుసా

కళ్ళేమో అప్పుడప్పుడు సముద్రాలౌతూ .. మరొకప్పుడు గగన ద్వారాలౌతూ
ఒట్టి ఖాళీతనమే అంతిమమా.. అని ఒక చిత్త విభ్రమ.. విచికిత్స –
ఖాళీతనం నిర్వచనం నిజంగా మనిషి నిర్వాసితుడైనప్పుడే తోస్తుంది
పొరలు పొరలుగా తనను తాను
తవ్వుకుంటూ తవ్వుకుంటూ .. నీటిలోకి రాయిలా జారిపోతూ జారిపోతూ
అసలు భౌతికమైన ఉనికినే కోల్పోయే ఒక మహానుభూతి ఒకటి
ప్రతి మనిషినీ అప్పుడప్పుడు ఆవరించి
ఖాళీతనమే కరదీపమై నడిపిస్తున్న దివ్యానుభవమొకటి ఎరుకౌతూంటుంది
అప్పుడు ఎదుట ఉన్న కొమ్మపైకి
పక్షి ఎప్పుడు వచ్చి వాలిందో తెలియదు
వచ్చిన ఆ పక్షి ఎప్పుడు ఎగిరిపోతుందో కూడా అర్థంకాదు –
అంతా శూన్య మార్మికత.. ఒట్టి మార్మిక శూన్యమే –

************************

The Mystic Vacuum

In fact many a time we don’t know what we want
There is a saying-
“Life is like an empty glass.
An intelligent man questioned,
“Whether it is half full or half empty?
What is the emptiness inside?
In the soul it is a perplexity
Then the search starts
Anti – matter expands into the entire body
Man becomes sky, a forest and sea.
He becomes rail lines spreading the hills
Becomes solitude in depths of valley filled with moist
Singled out bird swimming in the sky without a destination
Feet traveling on dried leaves
Mystic vacuum in the entire soul- silent sound

What is in the closed fist of the sleeping baby?
Have you any idea?
How many moving skies behind the eye lids of the baby
Speaking at us?
At times the eyes become seas
Otherwise it is doors opened to the sky
Whether emptiness is end of all?
It is a mental delusion and dilemma
Man recognizes the emptiness
If he really becomes a refugee
It digs in himself in layers
Falls like a stone in water
A feeling of loosing physical entity
A great feeling
It engulfs every individual
A great feeling of vacuum
Becoming a leading torch

Then it is unknown
When the bird perches on the branch
It is uncertain when it flies
Every thing is mystic vacuum
A complete mystic vacuum

1 thought on “మార్మిక శూన్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *