March 29, 2024

చెక్కిన చిత్ర శిల్పం..

రచన: కృష్ణ అశోక్.

నేనో రాతిని
చిత్రరచనలు చేసే ఓ రాతిని
పాలుగారే వయసునుండే,
అందుకేనేమో పాలరాతిని…

ఓ స్త్రీ మూర్తి నాలోని
సృజనాత్మక చిత్ర రసాన్ని
మనసు కంటితో వలచిందేమో
మలచడం మొదలెట్టింది…

కాలం కదిలిపోతుంది
నెలలో సంవత్సరాలో,
కళ్ళుతెరిచి చూస్తే
చుట్టూ భామల కోలాహలం…

పాలరాతి ప్రియుడిని
ఉలితో సుతిమెత్తగా వరించి
కృష్ణ మూర్తిగా తీర్చిదిద్ది
పూజలందుకొమ్మని దీవించి పోయింది…

మాయల కృష్ణుడి పేరు మహిమో,
రాతిని మూర్తిగ మలచిన రాధిక వరమో
నేను గీసే గీతలు రేఖలు, రంగులు సువర్ణాలు
మాటలురాని నేను, చిత్రకారుడ్ని ఈనాడు..

4 thoughts on “చెక్కిన చిత్ర శిల్పం..

  1. నీ ఆత్మ కథ చదువుతున్నట్టు ఉంది బాసు, నువ్వు రేఖా చిత్రాలతో మాత్రమే కాదు, రచనా చిత్రాలతో కూడా మనసు హరించే కృష్ణుడిని…కవిత అద్భుతః…

Leave a Reply to Anitha Cancel reply

Your email address will not be published. Required fields are marked *