March 29, 2024

మధ్యమహేశ్వర్

రచన: కర్రా నాగలక్ష్మి ఓఖిమఠ్ మఠ్ నుంచి కారులో సుమారు 18 కిలో మీటర్లు ప్రయాణించిన తరువాత ‘ ఉనియాన ‘ గ్రామం చేరేం. అక్కడ రాత్రి చిన్న గదిలో బసచేసుకొని మరునాడు పొద్దున్నే మధ్యమహేశ్వర్ వెళ్లాలనేది మా సంకల్పం. ఎందుకంటే పొద్దున్నే బయలుదేరితే రాత్రికి మధ్యమహేశ్వర్ లో బసచేసుకొని, మరునాడు పొద్దుట తిరిగి బయలుదేరి ఉనియానా చేరాలనేది మా ఆలోచన. రాత్రి మా బస యజమానిని మధ్యమహేశ్వర్ దారి యెలావుంటుంది వగైరా వివరాలు అడిగేం. పొద్దున్నే […]

తేనెలొలుకు తెలుగు – పర్యాయ పదాలు, నానార్థాలు

రచన: తుమ్మూరి రామ్మోహనరావు గత నెల తెలుగుభాషలో ఆమ్రేడితాల గురించి చర్చించుకున్నాం. ఒక భాష సుసంపన్నం, సుందరంగా రూపొందాలంటే అనేక విషయాలు పాటించాలి. భాషా సౌందర్యం మనం వాడే పదాల ఎంపికతో ఇనుమ డిస్తుంది. దానికి భాషలోని అనేక పదాలమీద అవగాహన, సాధికారికత ఉండాలి. అవసరమైనప్పుడు, ఎక్కువ విశదంగా చెప్పటం, అవసరంలేనప్పుడు సంక్షిప్తంగా చెప్పటం ఆవశ్యకం. సాధ్యమైనంతవరకు భావం పునః ప్రస్తావన రాకుండా, పదాలు పునరుక్తి కాకుండా, శబ్దాలంకారము, యతి ప్రాసలు మొదలైనవాటి మీద దృష్టి ఉంటే […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 36

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య   మానవుడు కన్ను, ముక్కు, చెవి, చర్మము, నోరు అనే పంచేంద్రియాలకు లోబడి వ్యవహరిస్తుంటాడు. కాలం గడిచే కొద్దీ వీటిపై వ్యామోహం పెరుగుతూ ఉంటుంది. వాటికి బానిసలై వ్యవహరిస్తాం. కానీ వీటిని ఎలా జయించాలి?  అని ఈ కీర్తనలోవాపోతున్నాడు అన్నమయ్య.   కీర్తన: పల్లవి: ఎట్టు గెలుతు బంచేంద్రియముల నే బట్టరానిఘనబలవంతములు   చ.1. కడునిసుమంతలు కన్నులచూపులు ముడుగక మిన్నులు ముట్టెడిని విడువక సూక్ష్మపువీనులు యివిగో బడిబడి నాదబ్రహ్మము మోచె           ॥ […]

మహాకవి శ్రీశ్రీ ని గురించి కొందరు ప్రముఖులు

రచన: శారదాప్రసాద్   ఒక్కడే మహాకవి, అతని పేరు శ్రీశ్రీ –శ్రీ విశ్వనాధ సత్యనారాయణగారు “ఆనందం ఆర్ణవమైతే అనురాగం అంబరమైతే అనురాగపుటంచులు చూస్తాం ఆనందపు లోతులు తీస్తాం. ” గిరి-అహో, ఏమిగీతం. ఎంత సొగసుగా వుంది. కవిత్వాన్ని వడబోసినట్లుందే. ఎవరయ్యా ఈ పాట రాసింది? హరి-ఈ పాట వ్రాసినతని పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. గిరి-కొత్త కవుల్లో ఇంతటి మహాకవులుంటారా? హరి-అట్టే మాట్లాడితే ఈ క్రొత్తకవుల్లో ఒక్కడే మహాకవి. అతని పేరు శ్రీశ్రీ. గిరి-అయితే శ్రీశ్రీ వంటి నవ్యకవిలో […]

కాముని పున్నమి

రచన: లక్ష్మీదేవి ఫాల్గుణ పూర్ణిమ నాటికి పువ్వుల రంగులతో చిగుళ్ళ ఎఱుపుతో వెన్నెల నిండిన నింగీ నేలా వసంతాలాడు కుంటుంటాయి. ఫాల్గుణాలలో తెలివెన్నెలలు కురిసే కామునిపున్నమి (హోళీ) ఆమని రంగిలి శోభించడానికి ముందుమాట/ స్వాగత గీతం వంటిదే. నిండుగా పూచిన వేప , మామిడి, కానుగ అనేముంది, తరువులన్నీ, తనువులన్నీ పూలగుచ్ఛాలై శుభాకాంక్షలు అంది పుచ్చుకుంటుంటాయి. సంజె వేళల్లో వీచే ఆహ్లాదకరమైన పిల్లగాలుల వేణునాదాలకు మదిలోని తలపులు పదాలు పలుకుతుంటే పెదాలు ఒద్దికగా ఒదిగిపోతూ మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నాయి. […]