April 19, 2024

మార్మిక శూన్యం

రచన: రామా చంద్రమౌళి అనువాదం: అనంత పద్మనాభరావు మార్మిక శూన్యం నిజానికి చాలాసార్లు మనకు ఏమి కావాలో మనకు తెలియదు ఖాళీ గ్లాస్‌ వంటిది జీవితం అని ఒక ఉవాచ గ్లాస్‌ సగం నిండి ఉందా.. సగం ఖాళీగా ఉందా అని ఒక చతురుడి ప్రశ్న అసలు ఈ ‘ ఖాళీ ’ ఏమిటి లోపల .. ఆత్మలో అని ఒక మీమాంస ఇక అన్వేషణ మొదలౌతుంది అప్పుడు ఏదో అభౌతిక ప్రతిద్రవ్యం ( anti matter […]

దేనికి ..?

రచన: భమిడిపాటి స్వరాజ్య నాగరాజారావు. మాటకా? మనసుకా? దేనికి నీ ప్రాధాన్యత? వయసా?వలపా? దేనితో నీ అన్యోన్యత? రూపానితోనా?గుణానితోనా? దేనితో నీ సారుప్యత? నిన్నటితోనా?నేటితోనా? దేనితో నీ తాదాత్మ్యత? జననంలోనా?మరణం లోనా? దేనిలో నీ తాత్వికత? సంపాదనతోనా?సత్యసంధత తోనా? దేనితో నీ సామీప్యత? మాయలకా?మహిమలకా? దేనికి నీ ప్రాధాన్యత? కరుణతోనా?కరుకుతనంతోనా? దేనితో నీ పరిపక్వత? శాంతికా?భ్రాంతికా? దేనితో నీమనో పులకిత? ద్వేషించటానికా?దీవించటానికా? దేనికి నీ అస్వస్థత? స్వార్ధమా?పరమార్ధమా? ఏది నీకు అలభ్యత?

ఆడంబరపు కోరికలు….

రచన : శ్రీకాంత గుమ్ములూరి. చక్కటి ఎర్రటి కలువలు బురద కొలనులో విరగబూచి పథికుల మనసును దోచిన రీతి ఊహలపై అల్లుకుని ఇచ్చకాల మాటలతో నా మనసును ఆవరించి సరస సల్లాపాలాడే ఆడంబరపు కోరికలారా వదలి పోరెందుకని ? ఉన్నత శిఖరాలను చేరాలని ఒంటరి లోకాలలో ఏకాకిగ పేరు ప్రతిష్టల వలయాలలో అంతరాత్మను కోల్పోయి భంగపడ్డ ఆశయాలు పదే పదే వెక్కిరించి అటూ ఇటూ కాకుండా తట్టని ఆలోచనలను పెంచిన ఆడంబరపు కోరికలారా వదలి పోరెందుకని ? […]

బొటన వేళ్లు

రచన: ఈతకోట సుబ్బారావు దేశం నిండా ఈ బొటన వేళ్ళ పంట తగ్గనంత వరకు ఇంతే. ఓటు వేసే రాచ కార్యం నుండీ నోటు పై సంతకం వరకు బొటన వేళ్లు పండుతున్నాయి. విత్తిన చేతుల నుండి వేలాడే శవాల వరకు అన్నీ బొటన వేళ్లే కదా. ఓ రైతు నడిగాను చదువుకోరాదా అని జవాబు విని నేను చనిపోయారు చదువుకున్న వాళ్లేగా మమ్మల్ని మోసం చేస్తున్నది చదువుకొని మేం మోసం చేయలేం బాబూ.