March 28, 2024

గజల్

రచన: శ్రీరామదాసు అమరనాథ్

అల తాకగానే దరి పులకరించింది
నది సొగసుతో తాను పరవశించింది .

కల చెదిరి మదిలోన గుబులాయనేమో
ఒక మనసుకై తనువు పలవరించింది .

తలపైన పూబంతి వికసించెనేమో
ఒక ప్రేమ అనుభూతి పరిమళించింది .

ఇలలోన అందాలు దాగున్నవేమో
ఒక సొగసు వెన్నెలై పరితపించింది .

శిలలోని సొంపులను పరికించితే ‘శ్రీయా ‘
ఒక మూగ రస జగతి పలుకరించింది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *