రచన: గిరిజ పీసపాటి కన్నాంబ, కాంచనమాల, టంగుటూరి సూర్యకుమారి, అమ్మమ్మ కలిసి తరచూ బీచ్ కి వెళ్తూ ఉండేవారు. ఒక్కోసారి ఎవరి కారులో వారు వెళ్ళి బీచ్ దగ్గర కలుసుకుంటే, మరోసారి అందరూ కలిసి ఒకే కారులో వెళ్ళేవారు. ఇక బీచ్ కి వెళ్ళాక వీళ్ళ సందడి అంతా ఇంతా కాదు. టంగుటూరి సూర్యకుమారి, అమ్మమ్మ పాటలు పాడితే, కన్నాంబ, కాంచన మాల సినిమా డైలాగ్స్ చెప్పేవారు. సరదాగా సినిమాలకి వెళ్ళేవారు. ఒకరి ఇంటి వంటలు మరొకరి […]
Month: May 2019
హృదయ బాంధవ్యం
రచన: డా.కె.మీరాబాయి “నేను జయంత్ నండి. నేను మీతో మాట్లాడాలి. ఈవాళ భోజన సమయంలో మిమ్మల్ని కలుసుకోవచ్చునా?” ఫోనులో అతని గొంతు వినగానే వారిజ గుండె ఝల్లుమంది. ” అలాగే మీ ఇష్టం ” అంది కంగారు ఆణుచుకుంటూ. ఫోను పెట్టేయగానే రుమాలుతో ముఖం తుడుచుకుంది. మొదటిసారి అబ్బాయిలతో మాట్లాడబోతున్న పదహారేళ్ళ పిల్లలాగా ఈ బెదురేంటీ? అని తనను తాను కుదుట పరచుకుంది. ఈ రోజు ఆఫీసుకు చీర గానీ , చుడీదారుగానీ వేసుకుని వుంటే బాగుండేది […]
కాంతం వర్సెస్ కనకం……
రచన: మణికుమారి గోవిందరాజుల ఆ రోజు వాళ్ళ పెళ్ళిరోజు. పొద్దున్నే పట్టిన ముసురులా కాంతానికి కనకానికి మొదలైన పోట్లాట ఇంతవరకు తెగడం లేదు. ఇద్దరూ కూడా నువ్వంటే నువ్వని అనుకోవడంతోనే సరిపోతున్నది . యెవరేమి చేసారో సోదాహరణ ఉదాహరణలతో సహా చెప్పుకుంటున్నారు. ఎవరికి వారు తమ మాటే నెగ్గాలని పట్టుమీదున్నారు. పైన అద్దెకున్న వాళ్ళొచ్చి సంధి కుదర్చబోయారు కానీ వాళ్ళను కరిచినంత పని చేసి వెళ్ళగొట్టారు. ముప్పయేళ్ళ సంసార జీవితంలో చాలాసార్లు యేదో ఒక విషయానికి […]
సుఖాంతం!
రచన: పద్మజ యలమంచిలి ఎప్పటిలానే.. టిఫిన్ లు తినిపించి, లంచ్ బాక్సులు కట్టేసి, పిల్లలని తయారుచేసి స్కూల్ కి పంపి, భర్తకు కావాల్సినవన్నీ అమర్చి ఆదరా బాదరా రెండు ముద్దలు కుక్కుకుని . తొమ్మిదినెలల గర్భిణిలా నిండుగా ఉన్న బస్సులోకి ఎలాగోలా జొరబడి చెమటలు కక్కుకుంటూ ఆఫీస్ కి చేరింది నీరజ… హమ్మయ్య సెక్షన్ హెడ్ ఇంకా రాలేదు అనుకుంటూ తన టేబుల్ మీద పెండింగ్ వర్క్ పూర్తిచేసే పనిలో పడింది. ఇంట్లో దివాకర్ చిర్రుబుర్రులాడి […]
తపస్సు – లేలేత స్వప్నం
రచన: రామా చంద్రమౌళి ఆమె లీలావతి – పదవ తరగతి అప్పటిదాకా ‘ లీలావతి గణితం ’ చదువుతోంది.. అన్నీ లెక్కలు కాలం- దూరం, కాలం – పని, ఘాతంకముల న్యాయం చకచకా ఒక కాగితం తీసుకుని రాయడం మొదలెట్టింది పెన్సిల్‌తో బయట ఒకటే వర్షం.. చిక్కగా చీకటి 2 చెత్త.. తడి చెత్త.. పొడి చెత్త ఆకుపచ్చ.. నీలి ప్లాస్టిక్ టబ్స్ ‘‘ఐతే చెత్త ఎప్పుడూ పదార్థ రూపంలోనే ఉండదు చెత్త ఎక్కువ ‘మానవ‘ రూపంలో […]
కార్టూన్స్.. జెఎన్నెమ్
కార్టూన్స్. జీడిగుంట నరసింహమూర్తి
అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 37
విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య ఈ త్రిభువనాలలో శ్రీహరిని మ్రొక్కని వారెవరు? మునులు, ఋషులు నీకై ఎన్నో సంవత్సరములు కఠోర దీక్షతో తపమాచరించారు. కొందరు సప్త ఋషులలో స్థానం సంపాదించారు. కొందరిని రకరకాల పరీక్షలకు గురి చేస్తావు. కొందరిని వెంటనే అక్కున చేర్చుకుని కైవల్యం ప్రసాదిస్తావు. ఏదైనా వారి జన్మ కర్మలు పరిపక్వం కానిదే మోక్షం రాదు గదా స్వామీ! మానవులనే కాదు జగత్తులో ఉన్న అన్ని జంతువుల ఎడ ప్రేమ చూపిస్తావు. నీవు జగత్పాలకుడవు శ్రీనివాసా! అంటూ […]
శ్రీ జిడ్డు కృష్ణమూర్తిగారి కొన్ని ఆలోచనలు
రచన: టీవీయస్. శాస్త్రి ఆలోచన వేరు, తెలివి వేరు-వాటి మధ్యన గల తేడాను పరిశీలించారా? ఒక అడవి మృగాన్ని చూసినప్పుడు స్వీయరక్షణ కోసం లోపలి నుండి స్వత:సిద్ధంగానే వచ్చే ప్రతిస్పందనను తెలివి అనీ, అది భయం కాదని ఇంతకు ముందు మీకు చెప్పాను. భయాన్ని పెంచి పోషించే ఆలోచన ఇందుకు పూర్తిగా విభిన్నమైనదని కూడా అన్నాను. మిత్రుల కోరికపై కొంత వివరణ ఇస్తాను. పైన చెప్పినవి రెండూ భిన్నమైనవి కదా? భయానికి జన్మనిచ్చి, పెంచి పోషించే ఆలోచనకు, […]
తేనెలొలుకు తెలుగు. .
రచన: తుమ్మూరి రామ్మోహనరావు గాయనం కొందరికి సహజ లక్షణం. అనాదిగా మాట పాటగా మారి పలువురిని ఆకట్టుకుంది. జన సామాన్యంలో వారికి తెలిసిన విషయాలను పాటలుగట్టే నేర్పు కూడా కొందరికి సహజ లక్షణమే. అలా వెనుకటినుంచీ అలా జానపదుల జీవితాలలో పాట ఒక భాగమయిన సందర్భాలున్నాయి. ముఖ్యంగా పలు వేడుకలకు పాట ఒక తోడుగా నిలువటం మనకు తెలిసిందే. అలాంటి పాటలు మౌఖికంగా వెలువడి ఆ తరువాత ఆ నోటా ఈ నోటా పాడబడి వాడుకలోకి రావడం […]
నాకు నచ్చిన కధ -కేతు విశ్వనాధ రెడ్డిగారి కథ- రెక్కలు
రచన: అంబడిపూడి శ్యామసుందర రావు రాయలసీమ నేపధ్యముగా కధలు వ్రాయటంలో పేరు పొందిన మార్క్సిస్టు కధకుడు విశ్వనాధరెడ్డిగారు తాను పుట్టి పెరిగిన ప్రాంతమును ప్రాతినిధ్యము వహిస్తూ, అక్కడి ప్రజల జీవితాలను చిత్రీకరిస్తూ, కధలు వ్రాయటము అయన ప్రత్యేకత. ఈయన 1939 జులై 10న కడప జిల్లా రంగరాయపురములో రైతు కుటుంబములో జన్మించాడు. కడప జిల్లాలోనే విద్యాభ్యాసము చేసి కడప జిల్లాలోని గ్రామాల నామాలను పరిశోధనాంశముగాతీసుకొని శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయము నుండి డాక్టరేట్ పొందాడు. 1958లో ఆమె […]
ఇటీవలి వ్యాఖ్యలు