April 25, 2024

మాలిక పత్రిక జూన్ 2019 సంచికకు స్వాగతం

    Jyothivalaboju Chief Editor and Content Head పాఠక మిత్రులు, రచయితలకు నమస్సుమాంజలి.. వేసవి చివరి అంచుల్లో వానచినుకుల సవ్వడికై ఎదురుచూస్తున్నాము. ఎవరేమీ అనుకున్నా బుుతువులు మారవు. తమ పని తాము చేసుకుంటూ వెళుతుంటాయి. మరి మనకెందుకు అడ్డంకులు, అలసత్వములు.. మీ అందరి ఆదరణతో ముంధుకు సాగుతున్న మాలిక పత్రిక మరిన్ని కథలు, కవితలు, వ్యాసాలు  సీరియళ్లు, సమీక్షలతో మళ్లీ మీ ముందుకు వచ్చింది.. ఇంకా ఏమైనా కొత్తగా చేయొచ్చంటారా? చేద్దామంటారా. మీ ఆలోచనలను […]

కౌండిన్య కథలు – పరివర్తన

రచన: రమేష్ కలవల “అబ్బ! ఎంత హడావుడిగా ఉందో చూడండి?” అంది కమలమ్మగారు, కూతురు కూడా పక్కనే నించొని ఉంది. “అవునవును. పండగలకు ఊరు వెళ్ళే వారంతా ఇక్కడే ఉన్నారు” అన్నారు రామనాధంగారు. మళ్ళీ “వాస్తవంగా బస్టాండు కంటే కూడా ఇక్కడే ఎక్కవ ప్రయాణికులు ఉంటున్నారు. ఇసకేస్తే రాలని జనం” అంటుండగా కాళేశ్వరరావు పంతులుగారు హడావుడిగా అటు నడుస్తూ వెళ్ళడం చూసి “కాళేశ్వర్రావుగారు” అంటూ పిలిచారు. ఆయన ఆగి “అరెరె మీరేంటి ఇక్కడ, ఎన్ని రోజులయ్యింది కలిసి” […]

ఆత్మీయ బంధాలు

రచన: కె. మీరాబాయి పసుపు రాసిన గడపలు, గుమ్మాలకు మామిడి తోరణాలు, ఇంటి ముందు పచ్చని కొబ్బరి ఆకుల పందిరి అమరేసరికి ఇంటికి పెళ్ళికళ వచ్చేసింది. పెళ్ళి జరిగేది కల్యాణ మండపంలోనే అయినా ఇంటి ముందు పందిరి , రంగవల్లులు వుంటేనే అందం శుభకరం. పెళ్ళికి నాలుగు రోజుల ముందే రమ్యని పెళ్ళికూతుర్ని చేసారు. ఆ రోజు ఉదయాన్నే రమ్యను, రమ్య అమ్మ నీరజను, నాన్న శ్రీనివాస్ ని పీటలమీద కూర్చోబెట్టి నుదుట , కుంకుమ పెట్టి, […]

ఖజానా

రచన : సోమ సుధేష్ణ రాత్రి నిద్రలో వచ్చిన కలల తాలూకు ఛాయలు ఉమ మోహంలో నీలి నీడల్లా కదులు తున్నాయి. ఆ నీడలను దులి పెయ్యాలని ఉమ కాఫీ కలుపుకుంది. కూతురికి లంచ్ బాక్స్ తీయాలని ఫ్రిజ్ డోర్ తీయబోయి అలవాటుగా డోర్ పై పెట్టిన ‘ఈ రోజు చేయాల్సిన పనుల’ లిస్టు చూసింది. సరసి డాన్స్ క్లాసు ఐదింటికి, వచ్చే దారిలో కొనాల్సినవి- పాలు, ఆరెంజ్ జ్యూస్, లంచ్ స్నాక్, డ్రై క్లీనర్స్ దగ్గర […]

గిలకమ్మ కతలు – పెద్దోల్లైపోతే ..ఏం పెట్రా?

రచన: కన్నెగంటి అనసూయ “సరోజ్నే…సరోజ్నే…! లోపలేంజేత్తన్నావో గానీ ఓసారిలా వత్తావా బేటికి..” గుమ్మం ముందు నిలబడి అదే పనిగా పిలుత్తున్న గౌరమ్మ గొంతిని లోపల బోషాణం పెట్టెలో ఏదో ఎతుకుతున్న సరోజ్ని ఇంకో రెండడుగులేత్తే లంగా సిరిగిపోద్దా అన్నంత ఏగంగా వచ్చేసింది పెద్ద పెద్ద అంగలేసుకుంటా.. “ఏటి గౌరొదినే..ఇంత పొద్దున్నే..ఇలాగొచ్చేవ్..?” అంది .. “ఏవీ లేదు ..పెసరొడేలు పెడదావని..తవ్విడు పప్పు నానబోసేను..గబ గబా పని కానిచ్చుకుని ఒకడుగు అటేత్తావేమోనని..” “..వత్తాన్లే గానీ మొన్నేగదా పెట్టేవు..కుంచుడో, మూడడ్లో అయినాయన్నావ్..? […]

నిన్నే ప్రేమిస్తా………

రచన: మణికుమారి గోవిందరాజుల “యేమిటలా చూస్తున్నావు?” “స్ఫటికం లాంటి నీ మనసుని. యెంత స్వచ్చంగా మెరిసిపోతూ కనపడుతున్నదో” తన్మయంగా అన్నది. “నా మనసులో యేముంది? నిన్ను నువ్వు చూసుకో యెంత అందంగా కనపడతావో?” “నేనా? అందంగానా? వెక్కిరిస్తున్నావా? యెటుపోయింది ఆ అందమంతా?” దుఃఖంతో గొంతు పూడుకు పోయింది. “మై డియర్ సాజీ నాకు ఇప్పుడు నువు వేరేగా కనపడవు. అప్పుడెలా వున్నావో ఇప్పుడూ అలానే కనపడతావు” “అయినా ఇదిగో ఇలా మాట్లాడావంటే నేను నీ దగ్గరికే రాను” […]

కంభంపాటి కథలు – ఫణి క్రిష్ణ స్టోరీ

రచన: రవీంద్ర కంభంపాటి ఒకటే వాన..రెండ్రోజుల్నుంచీ తెరిపినివ్వకుండా కురుస్తోంది. వర్షానికి, బిళ్ళ పెంకేసున్న ఆ మండువా ఇంట్లో వంటిల్లు, వరండా తప్ప అన్ని గదులూ కారుతున్నాయి. చేసేదేమీ లేక డెబ్భై ఐదేళ్ల పెద్దమ్మాయిగారు ఆ వరండాలో ముడుచుక్కూర్చుని ఆ వర్షాన్ని చూస్తున్నారు. లోపలికెళ్ళి ఏదైనా వండుకుందామనుకుంటే, కళ్లజోడెక్కడ పెట్టేసుకున్నారో ఏమో, అన్నీ మసక మసగ్గా కనిపిస్తున్నాయి ఆవిడ గాజు కళ్ళకి. రెండ్రోజులైంది ఆవిడ తిని, ఇవాళ ఏదో ఒకటి ఉడకేసేసుకుని తినకపోతే ఈ ప్రాణం ఉండబట్టేలా లేదు. […]

విశ్వపుత్రిక వీక్షణం “జ్ఞాపకాల గోడ”

రచన: విజయలక్ష్మీ పండిట్   అది చలికాలం.ఉదయం ఆరు గంటలకు  మదనపల్లెలో రైలు దిగి  నాగరాజు తెచ్చిన వ్యాన్లో మా అమ్మ వాళ్ళ ఇంటికొచ్చేప్పటికి ఏడుగంటలు కావస్తోంది. సూట్కేస్ ఇంట్లో పెట్టి నాగరాజు వెళ్ళాడు. వెళ్ళేప్పటికి అమ్మ ,నాన్న సుజాత మేలుకొని ఉన్నారు. సుజాత వంటపనే కాకుండా అమ్మ నాన్నకు  సహాయం చేస్తుంది వాళ్ళ అవసరాలలో. నేను గడపలో అడుగు పెట్టగానే ఇంట్లోనుంచి కాఫీ వాసన నా ముక్కుపుటాలలో దూరి నన్ను ఆప్యాయంగా ఆహ్వానించింది. మా అమ్మ […]

చీకటి మూసిన ఏకాంతం – 2

రచన: మన్నెం శారద ‘నిన్న లేని అందమేదో నిదుర లేచేనెందుకో. నిదుర లేచేనెందుకో!’ అద్దంలో బొట్టు పెట్టుకుంటున్న నిశాంత తృళ్లి పడి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నుండి లేచి నిలబడి చుట్టూ చూసింది. అక్కడ రేడియో కాని – టేప్ రికార్డర్ కాని ఆన్ లో లేవు. ఘంటసాల పాటలంటే ఆమెకి ప్రాణం తీసుకునేంత ప్రాణం! అతని పాటల కేసెట్లన్ని సంపాదించి పెట్టుకుంది. మనసు బాగున్నప్పుడు- బాగొలేనప్పుడు కూడా అవి హృదయాన్ని తెలిక పరిచి డోలలూగించి ఎవో […]

అమ్మమ్మ -3

రచన: గిరిజ పీసపాటి అన్నపూర్ణ శాస్త్రులు గారు చెప్పిన విధంగా సింహాచలం వరాహ నృసింహస్వామి సన్నిధిలో నలభై రోజుల పాటు సుందరకాండ ఒకరు పారాయణ చేస్తుండగా, ఇంటి దగ్గర పాలు ఇస్తున్న ఆవుకి, దాని దూడకి అమ్మమ్మ సేవ చెయ్యసాగారు. నలభై రోజుల పారాయణ, గో సేవ పూర్తయాక ఆ పుణ్యఫలాన్ని అన్నయ్యకి ధార పోసారు అమ్మమ్మ. తరువాత కొన్ని రోజులకే గవర్నమెంట్ రద్దు చేసిన సర్టిఫికెట్లు చెల్లుతాయని చెప్పి, తిరిగి ఇవ్వడమే కాకుండా ఆయనకి హెల్త్ […]