March 29, 2024

బుడుగు-సీగేన పెసూనాంబ

రచన: ధనికొండ రవి ప్రసాద్.

బుదుగు: సీ గేన పెసూనాంభా ! ఏంటలా డల్ గా మూతి ముడుచుక్కూచ్చున్నావ్ ! ఏం జరిగింది? అన్నం కూరా ఆడుకుందామా?
సీగేన:హేమి అన్నం కూలా? ఇవ్వాల్ల అన్నమే తినాలనిపించ లేదు. అమ్మ కొత్తుతుందని తిన్నా .
బుడుగు: హస లేమైంది?
సీగేన: అమ్మా నాన్నా పోట్టాడుకున్నారు.
బుడుగు:హ్హదా ! పెద్దాళ్లన్నాక కాసేపు పోట్టాడుకుంటారు. మళ్లీ కలుసుకుంటారు . ఇంతకీ దేనికి?
సీగేన: నాకేమద్దమౌతుంది? పెద్దాల్ల తగాదా. ఏదన్నా అలిగితేనేమో “పిల్లాల్లు. మీ కెందుకు ?” అంతాలు.
బుడుగు: ఇంతకీ అమ్మ నిన్నేమన్నా అందా ? దాచకండా చెప్పు. మనం ఫెండ్స్ కదా !
సీగేన: అసల్నా తప్పేం లేదు. ఎందుకు పోట్టాడుకున్నాలో తెలీదు. అమ్మ మటుకూ “ఇదిగో ! ఈ పిల్ల ముందొకతి తద్దినమైంది . ఇది లేక పోతే నుయ్యో గొయ్యో చూసుకునే దాన్ని ” అని నా జుత్తు పత్తుకుని రెండూపు లూపింది.
బుడుగు: నువ్వేం భాద పడకు. దాని సంగతి నే చెపుతాగా ! రేపొకసారి కనిపించు.
(మర్నాడు)
బుడుగు: ఏ ! సీగెన పెసూనాంబా ! టు డే హ్యాపీనా ?
సీగేన: టు డే ఆల్ హ్యాపీ.
బుడుగు: ఇంతకీ నిన్న మీ అమ్మేమంది?
సీగేన: ఈ పిల్లముందొకతుంది కానీ—– లేక పోతే—–నాకుమల్లీ ఏలుపొస్తోంది బులుగూ .
బుడుగు: “నుయ్యో గొయ్యో చూసుకునే దాన్ని అంది” అంతేగా !
సీగేన: ఊ.
బుడుగు: ఇక్కడ హస్సలు పాయింటొకటుంది. ఈ పెద్దాళ్లుంటారే ! వీళ్లేదో మనని రష్చిస్తున్నామనుకుంటారు. కానీ వాల్లని రష్చించేది మనమే అని వాల్లకి తెలియదు. వాల్లకి మన మీద పేమ ఉంటుంది. అది వాల్లని పోట్టాడుకున్నా మళ్లీ కలుపుతోంది. వాళ్లు నుయ్యొ గొయ్యో చూసుకోకండా రష్చిస్తోంది. మనం మన ఆటలతో వాల్లని నవ్విస్తుంటే అది వొదులుకో లేక బతుకుతున్నారు. అది వొదులుకో లేక ఈక్నెస్ తో మల్లీ బుద్దిగా పోట్టటమానేసి “ఇవ్వాల్ల కూరేంటీ” అనే డైలాగ్ మొదలేస్తారు .
సీగేన: అంతే నంతావా బులుగూ !
బుడుగు: అంతే. ఈ సారి మీ అమ్మ తిడితే “హసలు మీ కాపరమో అదేదో దాన్ని రష్చించేది నేనే అని చెప్పు.
సీగేన: నీకు చాలా తెలుసు బులుగూ ! హ్హి హ్హి. ఎవల్చెప్పాలు?
బుడుగు: అమ్మా నాన్నలకి పిల్లల మీద పేమ ఆ భగమంతుడే పెట్టాడనీ అది లేక పోతే ఈ సుష్ఠి మోత్థం నడవదనీ మా బామ్మ చెప్పిందిలే . హ్హి హ్హి. నాకే చెప్పింది . మల్లీ అమ్మకి, నాన్నకి చెప్ప లేదు. వాల్లకర్దం కాదని .

3 thoughts on “బుడుగు-సీగేన పెసూనాంబ

Leave a Reply to మాలిక పత్రిక Cancel reply

Your email address will not be published. Required fields are marked *