April 20, 2024

మేలుకొలుపు!

రచన:- నాగులవంచ వసంతరావు జీవితమంటేనే కష్టసుఖముల పెనుగులాట మర్మం తెలుసుకుంటే మనకది వెలుగుబాట లక్ష్యనిష్ఠలో నీకు కలిగిన మరపు చేస్తుంది జీవితానికి అంతులేని చెరుపు గరిటెడంత కృషిచేసి గొప్పగా పొంగిపోకు గంపెడంత ఫలితంరాలేదని దిగులుగా కృంగిపోకు క్షణికోద్రేకంలో చేసిన తప్పు తెస్తుంది జీవితానికెంతో ముప్పు గతాన్ని మరువనంతకాలం ఉంటుంది పురోగతి మరచిన మరుక్షణమే అవుతుంది అధోగతి సహజ జీవనమే సద్గతికి రహదారి విలాస జీవితమే వినాశనానికి వారధి చదువు నేర్పిన చక్కని సంస్కారాన్ని నిలువెత్తు స్వార్థం స్వాహా […]

ఇల్లాలు (భర్త అంతర్వీక్షణ )

రచన: మూలా వీరేశ్వరరావు   నీ కష్టాలను ఫిల్టర్ చేసి నాకు ఫిల్టర్ కాఫీ ఇచ్చావు ఇంటి ధూళినే మధూళి గా ధరించి ఉదయాన్ని మధోదయంగా మార్చావు ! గిన్నెలు కూడా నీ కన్నులతో మాట్లాడతాయని వంటిల్లు వదిలి పుట్టింటికి వెళ్ళినప్పుడే అర్ధమైంది ! గుట్టలు గా పెరిగిన నా బట్టలు నీ చేతిలో ఏ మంత్రముందో మల్లెల దొంతరలుగా మారిపోతాయి ! వంటింట్లో సామానులన్నీ నీ వుంటే శిక్షణ పొందిన సైనికులై నీ ఆజ్ఞతో అమృతానికి […]

‘పర’ వశం…

  రచన, చిత్రం : కృష్ణ అశోక్ గోవులు కాచే వయసుకే గోపెమ్మ చేతిలో చిక్కాను, ఆమె కమ్మని కబుర్ల ముద్దలు ప్రేమ పెదవుల ముద్దులు మొదలు..   వయసు తెలిసే వేళకే ఓ అంకం మొదలయ్యింది… ఒళ్ళంతా చిన్ని చిన్ని మోహాల మొలకలు లేలేత చిగుళ్ళు వేసి పరువపు గుర్తులుగా కొంచెం కొంచెం ఎదుగుతూ… ‘పరవశం’ కి అర్ధం తెలియకుండానే మనసు తనువు ‘పర’వశము…   తొలిరోజుల నాటిన ఆ ప్రేమమొక్క నాతోపాటు ఎదుగుతూనే ఉంది.. […]

అనుభవాలు….

రచన, చిత్రం : కాంత గుమ్ములూరి   ఐపోయిన సెలవులు మొదలైన బడులు పిల్లల నిట్టూర్పులు మండే ఎండలు ఉక్క పోతలు కొత్త పుస్తకాలు అర్ధంకాని పాఠాలు తెలియని భయాలు ఉపాధ్యాయుల బెదిరింపులు సహాధ్యాయుల వెక్కిరింతలు తండ్రుల సవాళ్లు తల్లుల ఓదార్పులు కొత్త స్నేహాలు విడువని కబుర్లు ప్రాణ స్నేహితులు కలిసి అల్లర్లు ఎఱ్ఱ రిబ్బన్లు రెండేసి జడలు తురిమిన మల్లెలు వేసవి గుబాళింపులు తొలకరి వానలు రంగుల గొడుగులు తడిసిన సంచులు పిల్లల కేరింతలు ఎదిగే […]

తపస్సు – హింస

రచన: రామా చంద్రమౌళి ఆ ముస్లిం మాతృమూర్తి గత ఏడేళ్ళుగా జైల్లో ఉంది యుద్ధఖైదీగా అప్పుడామె ఎడారులూ, కీకారణ్యాలో ఎక్కడో బయట ఉండవనీ అవన్నీ మనుషుల హృదయాల్లోనే రహస్యంగా ఉంటాయనీ గ్రహించింది ఏడేళ్ళుగా జైలు అధికారులను వేడుకుంటోందామె తన ఏడేళ్ళ ఒక్కగానొక్క కొడుకును ఒక్కసారి చూడాలని- ఆ రోజు అనుమతి లభించిందామెకు వర్షంలో తడుస్తున్న భూమిలా పుకించిపోతూ ‘ములాఖత్‌ ’ గదివైపు నడిచింది ఒంటినిండా నల్లని బురఖాతో.. విషాద దేవతవలె అప్పుడు గదమాయించాడు కాపలా సైనికుడు ‘దాన్ని […]

మనసుకు చికిత్స, మనిషికి గెలుపు

సమీక్ష: సి. ఉమాదేవి ఆరోగ్యాన్ని మించిన వరంలేదు. అనారోగ్యం కబళించినపుడు మనిషిలో భయం, నిరాసక్తత, జీవించాలనే తలపు సన్నగిలడం పొడసూపుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా క్యాన్సర్ సోకిందని తెలియగానే మనిషికన్నా ముందు మనసు వణుకుతుంది. వైరాగ్యంతో జీవితేచ్ఛను వారే బలవంతంగా తుంచివేయాలని చూస్తారు. మన సమాజంలో ఎవరినైనా క్యాన్సర్ కాటువేసిందని తెలియగానే ఎన్నాళ్లు బ్రతుకుతారో ఏమో అనే సందేహం ప్రశ్నగా బాధిస్తూనే ఉంటుంది. క్యాన్సర్ కు గురైన వ్యక్తికి మీరందివ్వాల్సింది ఓదార్పు కాదు. వాళ్లల్లో జీవనస్ఫూర్తి నింపి క్యాన్సర్ […]

బుడుగు-సీగేన పెసూనాంబ

రచన: ధనికొండ రవి ప్రసాద్. బుదుగు: సీ గేన పెసూనాంభా ! ఏంటలా డల్ గా మూతి ముడుచుక్కూచ్చున్నావ్ ! ఏం జరిగింది? అన్నం కూరా ఆడుకుందామా? సీగేన:హేమి అన్నం కూలా? ఇవ్వాల్ల అన్నమే తినాలనిపించ లేదు. అమ్మ కొత్తుతుందని తిన్నా . బుడుగు: హస లేమైంది? సీగేన: అమ్మా నాన్నా పోట్టాడుకున్నారు. బుడుగు:హ్హదా ! పెద్దాళ్లన్నాక కాసేపు పోట్టాడుకుంటారు. మళ్లీ కలుసుకుంటారు . ఇంతకీ దేనికి? సీగేన: నాకేమద్దమౌతుంది? పెద్దాల్ల తగాదా. ఏదన్నా అలిగితేనేమో “పిల్లాల్లు. […]

వీరి తీరే వేరయా…

రచన: పద్మజ యలమంచిలి నోరాడినట్టు రాలాడుతుంది అంటే ఏమిటో కొంతమందిని చూస్తే అర్ధమైపోతుంది! ఏమాత్రం వళ్ళు వంచరు.. సుఖాలకు, జల్సాలకు అలవాటు పడిపోయి ఎంతకైనా దిగజారిపోతారు. సంఘంలో ఇలాంటి చీడ పురుగుల వల్ల మొత్తం స్త్రీ జాతినే అసహయించుకునే పరిస్థితి వస్తుంది..అయినా అది వారికి పట్టదు! ********* చిన్నప్పటినుండీ ఇద్దరమూ ఒకే స్కూల్లో చదవడం వల్ల దుంధుభిని దగ్గరనుండి గమనించేదాన్ని. తనకు కావాల్సింది కష్టపడకుండా ఎదుటివారిని ప్రలోభాలకు గురిచేసో, మాటలతో బురిడీ కొట్టించో సాధించుకునే తత్వం! తెల్లగా, […]