April 24, 2024

అష్టావక్రుడు

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు పూర్వము ఏకపాదుడనే నిరంతర తపోనిరతుడైన బ్రాహ్మణుడు భార్య సుజాతతో శిష్యకోటికీ వేదములు బోధిస్తూ హాయిగా గురుకులములో కాలక్షేపము చేయసాగారు. వేద విద్య బోధించే ఏకపాదుడు విద్య బోధించే విషయములో శిష్యుల పట్ల చాలా కఠినముగా వ్యవహరించేవాడు. చాలా కాలానికి ఎన్నో నోముల ఫలితముగా భర్త అనుగ్రహము చేత సుజాత గర్భవతి అయినది. గర్భములో నున్న శిశువు తండ్రి శిష్యులకు భోధించుచున్న వేదములను వల్లె వేయసాగాడు. ఒకనాడు తండ్రి వల్లె వేస్తున్నప్పుడు గర్భములో […]

కర్ణాటక సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తిగారు

రచన: శారదాప్రసాద్ కర్ణాటక సంగీతాన్ని సుసంపన్నం చేసిన నేదునూరి కృష్ణమూర్తి తెలుగువాడు కావడం తెలుగు ప్రజల అదృష్టం. నేదునూరి కృష్ణమూర్తి గారు అక్టోబరు 10, 1927 న తూర్పు గోదావరి జిల్లాలోని కొత్తపల్లి గ్రామంలో రామమూర్తి పంతులు, విజయలక్ష్మి దంపతులకు జన్మించాడు. వీరి తండ్రి పిఠాపురం రాజా వారి సంస్థాన కార్యాలయంలో పనిచేస్తూండేవారు. నేదునూరి 1940 లో విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో వయొలిన్‌, గాత్రంలో ప్రాథమిక శిక్షణ పొందారు. కీర్తిశేషులు ద్వారం నరసింగరావు నాయుడు గారి […]

తేనెలొలుకు తెలుగు

రచన: తుమ్మూరి రామ్మోహనరావు (స్త్రీల పాటలు~ఊర్మిళాదేవి నిద్ర) —————————— ఆదికావ్యం రామాయణం. రామాయణంలోని ప్రతి పాత్రకూ ఓ విశిష్టత ఉంది. సీతారాముల కల్యాణంతో బాటే లక్ష్మణ భరత శతృఘ్నుల వివాహాలు ఊర్మిళా, శ్రుతకీర్తీ, మాండవిలతో జరిగాయి. అందరూ కొత్త దంపతులే. రావణసంహారం రామావతార లక్ష్యం గనుక కైకేయి వరాలడుగటం, రాముని పదునాలుగేళ్ల వనవాసం, రామునితో పాటు సీత కూడా వనాలకు వెళ్లడం, రామునితో పాటు లక్ష్మణుడు కూడా అనుసరించడం-ఇవన్నీ కార్యకారణ సంబంధాలు. కష్టమో నష్టమో రామునితో సీత […]

సరదాకో అబద్దం

రచన: రాజన్ ప్రపంచం లో ఎక్కువ శాతం మంది ఆడేది, ఆడేకొద్దీ ఆడాలనిపించేది …….అబద్దం. నాటి ధర్మరాజు దగ్గర నుండి నేటి రాజకీయనాయకుల వరకు అందరూ ఈ ఆటలో నిష్ణాతులే. ఆ మాటకొస్తే వారే ఏమిటిలెండి.. మీరు, నేను కూడా చిన్నవో, పెద్దవో అబద్దాలు చెప్పే వాళ్ళమే. మనం ఆడిన అబద్ధాన్ని నమ్మితే అవతలి వాడు, నమ్మకపొతే మనం ఓడిపోతాం. ఎవరో ఒకరే గెలిచే అవకాశం ఉంది కాబట్టే అబద్దాన్ని ఆడటం అంటారనుకుంటా. మానవ జీవితం నుండి […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 38

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య ఎవరికి ఎవరు దిక్కు? వచ్చేటప్పుడు భూమిపైకి ఒంటరిగా వస్తున్నాము. వెళ్ళేటప్పుడు ఒంటరిగానే వెళ్తున్నాం. ఎవరికి ఎవరు? ఈ బంధాలన్నీ అశాశ్వతం. అక్కడా ఇక్కడా ఆ శ్రీనివాసుడే మనకు దిక్కుయై రక్షిస్తున్నాడన్న విషయం మరవకండి అని ప్రభోదిస్తున్నాడు అన్నమయ్య ఈ కీర్తనలో. కీర్తన: పల్లవి: ఎవ్వరు గల రెవ్వరికి ఇవ్వల నవ్వల నితఁడే కాక ॥పల్లవి॥ చ.1. ముద్ద సేసినటు మొదలఁ గడుపులోఁ బెద్దగాఁ దాఁ బెరుగునాఁడు ఒద్దనెవ్వరుండిరొకరైనా ఒద్దికైన బంధుఁడొకఁడేకాక ॥ఎవ్వ॥ చ.2 […]

రఘునాథ మందిరం

రచన: నాగలక్ష్మి కర్ర హిందువులు అతి భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో శ్రీరామనవమి ఒకటి. చైత్ర శుద్ధ నవమిని శ్రీరాముడు జన్మించిన తిథిగా, శ్రీరామనవమిగా జరుపుకోవడం హిందువులకు అనాదిగా వస్తున్న ఆచారం. ఆంధ్రప్రదేశ్ ఆంద్ర, తెలంగాణగా విభజన జరిగిన తరువాత ఆంధ్ర లో శ్రీరామనవమి ఉత్సవాలు ఎక్కడ జరపాలి ఒంటిమిట్టలోనా? లేక రామతీర్ఠాలులోనా ? అనే విషయం మీద యెన్నో తర్జన భర్జనలు జరిగిన తరువాత ‘ఒంటిమిట్ట’లో జరపాలని రాజకీయ నాయకులు నిర్ణయించేరు. శ్రీరామనవమిని కుడా రాజకీయం […]