March 28, 2024

మాలిక జులై స్పెషల్ సంచికకు స్వాగతం

    Jyothivalaboju Chief Editor and Content Head   శ్రీ శారద సత్యనారాయణ మెమోరియల్ ఛారిటబిల్ సొసైటీ మరియు అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడెమీ U.S.A సంయుక్తంగా నిర్వహించిన కథల పోటి, పద్య కథల పోటి విజయవంతంగా ముగిసింది. వందకు పైగా కథలు వచ్చాయి. అందులో ఉత్తమమైనవి బహుమతులు అందుకున్నాయి. అలాగని మిగతావి పనికిరానివి కాదు. అందుకే కాస్త తక్కువ మార్కులతో సాధారణ  ప్రచురణకు స్వీకరించిన కథలను ఏరి కూర్చి ప్రత్యేక సంచికగా అందిస్తోంది. […]

41. పూజాఫలం

రచన: సి.హెచ్.చిన సూర్యనారాయణ   “ఏమండీ! డ్యూటీ నుండి వచ్చేటప్పుడు ఒక కొబ్బరికాయ అరడజను అరటిపళ్ళు తీసుకురండి. రేపు శివాలయానికి వెళ్ళాలి“ నా చేతికి క్యారేజీ అందిస్తూ ప్రాధేయపడింది మా ఆవిడ.                                                                                           మా ఆవిడ అలా అడిగినప్పుడల్లా, నాకు చాలా కోపం వస్తుంది. లోలోపల అణచి వేస్తుంటాను. ఎందుకంటె నాలో నాస్తికత్వపు భావాలు కాస్తో కూస్తో వున్నప్పటికీ, దేవుడు ఉన్నాడేమోనని భయం కూడా నాలో లేకపోలేదు.ఈ సంధిగ్ద మనస్తత్వముతో సగటు జీవనం గడుపుతున్నాను . నా భార్యకు […]

40. పితృ యజ్ఞం

రచన: కె.వి.సుబ్రహ్మణ్యం   విజయ్ తన ఇంటి హాల్లో కూర్చుని ఉన్నాడు. ముందరి వైపుకు ఉన్న బెడ్ రూం గుమ్మంలో తల్లి నిలబడి, కొడుకు మూడ్ ని గ్రహించడానికి ప్రయత్నం చేసి, బాగానే ఉన్నట్లున్నాడని ముందరికి వచ్చింది. “నాయనా నీతో కొంచెం మాట్లాడాలిరా” కనపడని విసుగు, కనపడే నవ్వుతో, “వచ్చి కూర్చోమ్మా. అని చెప్పి, బహుశ భార్య అక్కడ దగ్గరలో ఉందేమోనని….వంటింటి గది వైపు చూశాడు. ఆతని ఇబ్బంది గమనించి… ” కోడలిక్కడ లేదులే, పేరంటానికి వెళ్లింది”  […]

39. నాలుగు చక్కెర రేణువులు

రచన: కృష్ణమూర్తి కడయింటి   సమయం సాయంత్రం ఐదు గంటలయ్యింది. చేసే పనిని ప్రక్కన పెట్టి స్నానానికి లేచాను. సంధ్యా దీపం వెలిగించి “సంధ్యా దీప నమోస్తుతే” అని ఒక నమస్కారం పెట్టుకుని సంధ్యా వందనానికి కూర్చోబోతూ అక్కడే తిరుగాడుతున్న రెండు చీమలను చూసి వాటిని పై పంచెతో దూరంగా తోసి వేయ బోయాను. మరుక్షణంలో అవి తిరుగాడడంలో ఏదో ఆదుర్దా కనిపించడంతో కొంచెం పరిశీలనగా చూశాను. ఓ చీమ అక్కడ అచేతనంగా పడి ఉంది. దాని […]

38. తోడు

రచన: బి.వి. శివప్రసాద్   స్నిగ్ధకంతా అయోమయంగా ఉంది. నాయనమ్మ చనిపోయి రెండు వారాలైనా ఆ అమ్మాయికి దుఖ్ఖమాగడంలేదు. ఒకటా రెండా పన్నెండు సంవత్సరాల అనుబంధం. ప్రతి మనిషి చనిపోవాలని, కొందరు ముందు, కొందరు వెనుక, చివరకందరూ తమకైన వాళ్ళకు, కొందరు కానివాళ్ళకు గుడ్ బై చెప్పవలసిందేనని ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా, నాన్నల ద్వారా కొంత మటుకు, మరికొంత సినిమాలు, టీవీ, ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుంది. కానీ ఆ చేదు వాస్తవం తనకు ప్రియాతి ప్రియమైన […]

37. మనవడు “మనవాడే”

రచన: ఉమాదేవి కల్వకోట   అది ఫిబ్రవరి మొదటివారం.అంత ఎండగానూలేదూ అంత చల్లగానూ లేదు.వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది.బయటి వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉన్నప్పటికీ ఆఇంట్లో మాత్రం అందరూ చాలా ఆందోళనగా,అసహనంగా ఉన్నారు. “మనకిదేం ఖర్మ అన్నయ్యా. ఎక్కడయినా పిల్లలతో తల్లిదండ్రులకు ఏవో సమస్యలు రావడం గురించి విన్నాం కానీ, తండ్రితో తమ పిల్లలకు ఇంత పెద్ద సమస్య రావడం మనవిషయం లోనే చూస్తున్నాం.నాకయితే పిచ్చిలేచిపోతోంది.ఎలా అన్నయ్యా ఈసమస్యనెలా పరిష్కరించడం?”అసహనంగా అన్నాడు కిషోర్. “ఏమోరా.నాకేం పాలుపోవడంలేదుఇది నేనసలు కలలోకూడా […]

36. దృష్టి

రచన: ఎమ్. రమేశ్ కుమార్                                                                                                               ఆమె మహారాణి..! ఏ రాజ్యానికీ కాదు.. అందంలో మహారాణి !  ఆమెను చూసిన వాడెవడూ దివి నుంచి దిగివచ్చిన సుందరి అంటే ఈమేనేమో… అనుకోకుండా ఉండలేడు. అలాంటి అద్భుత సౌందర్యం ఆమెది. పాల మీగడ మృదుత్వాన్ని సంతరించుకున్న శరీరం, తేనెరంగు కళ్ళు, చెంపల్లో దాగున్న మందారాలు, చీకటిని నింపుకున్న శిరోజాలు.. ఇవన్నీ ఆమె సొంతం. ఉన్నత స్థాయిలో వున్న కుటుంబం.. గారాబంగా చూసుకునే తల్లిదండ్రులు.. దేనికీ లోటు లేదు. చదువుకునే […]

35. ఆత్మీయ బంధం

రచన: శీలం విజయనిర్మల   ‘ముచ్చటకోసం ఎవరన్నా కుక్కపిల్లల్ని ,పిల్లిపిల్లల్ని పెంచుకుంటాను అంటారు నువ్వేమిటే వీళ్ళను పెంచుతాను అంటావు ?’అంది ధార్మిక తల్లి శారద . ‘అమ్మా !నేను ముచ్చటకోసం కాదు ఆ పిల్లల్లో తమ కోసం ఎవరో ఒకరు ఉన్నారనే ధైర్యాన్నిచ్చి ,వారి జీవితాలలో వెలుగు నింపే ప్రయత్నం చేద్దామని నా మాట వినమ్మా !’అంది ధార్మిక తల్లిని బతిమాలుతూ. ‘నేను విననుగాక వినను ఆ రోగిష్టి వాళ్ళను తెచ్చి నా ఇంట్లో పెడతానంటే  నే […]

34. కలహం

రచన: శాంతి ప్రభాకర్   కొర్తి బాంక్‌ నుండి వచ్చే సమయమైంది. చంప లేత మామిడి చిగురు రంగు చీర, కాటన్‌ది, దానిపైన నీలిరంగు జాకెట్టు వేసుకొంది. ఆమెది సహజమైన సౌందర్యం. పాశ్చాత్య వాతావరణంలో పెరిగినప్పటికీ ఆమెకు తెలుగువారి కట్టు బొట్టులంటే ప్రాణం. పొడవైన నల్లని కురులతో ఆమె కదిలినప్పుడల్లా కూచిపూడి నాట్యం చేసే నాలుగున్నర అడుగుల పొడవుగా, ఒత్తుగా ఉండే జడ ఆమె సొంతం. ఆ జడకు మంజీరాలా అన్నట్లు వ్రేలాడే జడగంటలు కనువిందు చేస్తుంటే, […]

33. నను కన్ననా తల్లే నా కన్నకూతురు.

రచన: ఎస్.వి.హనుమంతరావు   “సత్యా !నేను రాత్రికి ఊరు వెళుతున్నాను.రెండు రోజుల్లో వచ్చేస్తాను.ఆఫీస్ లో లీవ్ పెట్టాను.పనమ్మాయికి ,వంట మనిషికి  జాగ్రత్తలు చెప్పాను.అమ్మాయిల్ని టైంకు రెడీ చేసి స్కూల్ బస్ ఎక్కించే బాధ్యత మాత్రం మీదే.” రాత్రి ఏడుగంటలకు ఆఫీస్ నుండి వచ్చిన భర్త కు చెప్పేసింది ప్రయాణ సన్నాహాల్లో వున్న విజయ సత్యమూర్తి భార్య. “ఊరా?ఇవ్వాళా?ఏమిటి అంత అర్జెంట్?పెద్ద అమ్మాయి పరీక్షల టైంయిది.గుర్తుందా?” అవును ,కాదు అనకుండా ప్రశ్నలతో పిచ్చి ఎక్కిoచేస్తున్న భర్తను వింతగా చూస్తూ […]