April 16, 2024

చిన్నారితల్లి నా చిట్టితల్లి

రచన: తులసి భాను నాన్నా అంటూ వెనుకనుంచీ మెడచుట్టూ చేతులు వేసి గారాలు పోతోంది 28 యేళ్ళ చిట్టితల్లి, తన తండ్రి ఆనంద్ దగ్గర. ఏమ్మా ఏం కావాలీ అన్నాడు ఆనంద్ తన పని ఆపేసి. నాన్నా ఇప్పుడు పెళ్ళి వద్దు నాకు అంది దిగులుగా రేణుక తండ్రి చెవుల్లో రహస్యంగా. తల్లి వింటే తిడుతుందని భయం మరి,ఇన్నేళ్ళొచ్చాయి, పెళ్ళి వద్దు వద్దు అని ఇన్నేళ్ళు సాగదీసావు, ఇంకా ఇప్పుడు కూడా దాటేయాలని చూస్తే ఊరుకోను అని […]

అత్తగారు – అమెరికం

రచన: సోమ సుధేష్ణ గణ గణ మోగుతున్న ఫోను అందుకుని “హలో వదినా, నేనే ఫోను చేద్దామని కుంటున్నాను, ఇంతలో నువ్వే చేసావు. నీకు నూరేళ్ళ ఆయుష్షు. రేపు రవీంద్ర భారతికి వెళ్తున్నావా?” అంది అరుణ. “నూరేళ్ళు వద్దులే అరుణ. ఉన్నన్ని రోజులు కాళ్ళు చేతులు బాగుండి పోయేరోజు వరకు మంచం ఎక్కకుండా ఉంటే చాలు. నువ్వు, లలిత రావడం లేదు. నేనొక్క దాన్నే రవీంద్ర భారతికి ఏం వెళ్ళను చెప్పు. రేపు ఏం చేస్తున్నావు? ఇక్కడికిరా, […]

కౌండిన్య కథలు – ప్రకృతి క్రితి

రచన: రమేష్ కలవల ఈ ప్రదేశం గురించి చాలా సార్లు విన్నాడు గీత్. ఎన్నో రోజుల నుండి అక్కడికి రావాలని ప్రయత్నిస్తున్నాడు. దగ్గర ఉన్న గ్రామంలో కొన్ని రోజులు ఉండి, ఆ చుట్టుపక్కలా ఉన్న పరిసరాల ప్రకృతిని చిత్రీకరించటాని కావలసినవన్నీ తనతో తీసుకొని వచ్చాడు. అక్కడికి వెతుక్కుంటూ వచ్చాడు. అక్కడ చూడటానికి అంతా కనువిందుగా, ఆహ్లాదకరంగా ఉంది, చుట్టూ నిశ్శబ్ధం ఆవహించి కదలిక లేని కొలను కనబడుతుంది. ఆ కొలనులో ఓ భాగం సూర్యుడి కిరణాలు పడుతూ […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 39

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య ఒక దొంగకు ఒక పాపాత్మునికి తల్లియైన స్త్రీ ఎవరికీ తన మొహం చూపలేక ఒంటరిగా మసలుతున్న రీతిని మనం గత జన్మలనుండి తెచ్చుకున్న పాపపుణ్యాలు రహస్యంగా ఖర్చవుతూనే ఉంటాయి అని ప్రభోదిస్తున్నాడు అన్నమయ్య ఈ కీర్తనలో. కీర్తన: పల్లవి: ముచ్చుగన్నతల్లి చేరి మూలకు నొదిగినట్టు తెచ్చినసంబళమెల్ల దీరుబో లోలోనె ||ముచ్చు|| చ.1.దప్పముచెడినవానితరుణి కాగిట జేరి అప్పటప్పటికి నుస్సురనినయట్టు వొప్పయినహరిభక్తివొల్లని వానియింటి కుప్పలైనసంపదలు కుళ్ళుబో లోలోనె ||ముచ్చు|| చ.2.ఆకలిచెడినవాని అన్నము కంచములోన వోకిలింపుచు నేల […]

విశ్వనాథ వారి విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు

రచన: రాజన్   ఒక జాతి గొప్పదనం ఆ జాతి యొక్క భాష, ఆచారవ్యవహారముల వల్లనూ, ఆ జాతిలో పుట్టిన మహాత్ముల వల్లనూ, ఆ జాతికి సంబంధించిన సార్వజనీన గ్రంధముల వల్లనూ విలసిల్లుతూ ఉంటుంది. జ్ఞానవైరాగ్యముల పుట్టినిల్లయిన భారతావనిలో భాషాపరంగా జాతులను చూడగోరితే అందులో తెలుగు జాతికి ఒక విలక్షణమైన స్థానమున్నది. సంస్కృతం తరువాత అందునుండే పుట్టిన భాషలలో అత్యంత సంస్కరింపబడిన భాష తెలుగు భాష. మనకు అమ్మమ్మ సంస్కృతమైతే, తెలుగు అమ్మ; అమ్మమ్మ సంతానంలోకెల్లా మన […]

బాల్యం కురిపించిన హాస్యపు జల్లులు

రచన: సి.ఉమాదేవి మనసుకు రెక్కలు తొడిగి జ్ఞాపకాల వలను తడిమినపుడు వెలువడే అనేక సంఘటనలు చిరస్మరణీయమైన మధురానుభూతులు. ఒకనాటి కుటుంబ వ్యవస్థను, అనుబంధాలను, ఆనాటి కట్టుబాట్లను మనముందుంచి, మన మనోవల్మీకములో నిక్షిప్తమైన మన చిన్ననాటి జ్ఞాపకాలను సైతం తోడి మనకందిస్తారు మన్నెం శారద. విభిన్నకళలలో ప్రవేశంగల రచయిత్రి ఆ కళలను నేర్చుకునే క్రమంలో వచ్చిన అడ్డంకులను తనదైన కళాస్ఫూర్తితో అధిగమించి కళలకే తన జీవిత ధ్యేయంగావించుకున్న కళారాధకురాలు. ఫేస్ బుక్ లో చక్కని చిత్రాలతో అందరినీ అలరించి […]

ఆంధ్రుల సాంఘిక చరిత్రకు విధాత సురవరం ప్రతాపరెడ్డి​ గారు ​

  రచన: శారదాప్రసాద్ ​తెలంగాణ రాజకీయ,  సాంఘిక చైతన్యం అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు సురవరం ప్రతాపరెడ్డి​ గారు.   ​తెలుగుభాషకు,  తెలుగువారి సమైక్యతకు జవజీవాలు పోసిన మహామహులలో సురవరం ప్రతాపరెడ్డి గారు ఒకరు.  పత్రికా సంపాదకు​డిగా,  పరిశోధకు​డిగా,  పండితు​డిగా,  రచయితగా,  ప్రేరకు​డిగా,  క్రియాశీల ఉద్యమకారు​డిగా బహుముఖాలుగా సాగిన ప్రతాపరెడ్డి ​గారి ​ప్రతిభ,  కృషి అనన్యమైనది.   స్థానిక చరిత్రల గురించి,  స్థానిక ప్రజల కడగండ్ల గురించి ఆయన పడిన నిరంతర తపనకు ప్రతి అక్షరం ప్రత్యక్ష సాక్ష్యం. […]

తేనెలూరు తెలుగు

రచన: తుమ్మూరి రామ్మోహనరావు తెలుగు మాటల ప్రపంచము సువిశాలమైనది. అందులో స్త్రీల పాటలది ఒక ప్రత్యేక ప్రపంచము. ఈ పాటల పుట్టుక పరిశోధనకందనిదని పూర్వ పండితులు గ్రహించినారు. నన్నయకు పూర్వమే శాసనాల్లో కనిపించే తరువోజ పద్యాలు పనిపాటలు చేసుకుంటూ స్త్రీలు పాడే రోకటి పాటలకు చాళుక్య పండితులు తీర్చిన రూపమని ఊహించుటకు వీలున్నది. నన్నెచోడుని కాలానికే ఊయలపాటలున్నాయని పరిశోధకుల అభిప్రాయము. పదమూడవ శతాబ్ది వరకు అంటే పాల్కురికి సోమనాథుని కాలానికి ఊరూరా పాటలు గట్టి పాడే సిరియాళ […]

శివ ఖోడి ( గుహ )

రచన: కర్రానాగలక్ష్మి భక్తునికి భయపడి గుహలో దాక్కున్న శివుడి గురించి విన్నారా?. ఎవరైనా శతృవుకి భయ పడతారు కాని భక్తుడికి భయపడడమా? అదీ ముల్లోకాలను కాపాడే పరమ శివుడు భక్తునికి భయపడి గుహలో దాక్కోడమా?, అదెలా జరిగింది, ఎక్కడ జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం యెందుకు పూర్తిగా యీ వ్యాసం చదవండి. మీకే తెలుస్తుంది. ఉత్తర భారత రాష్ట్రమైన జమ్మూ కశ్మీరులో జమ్మూ నగరానికి 110 కిమీ..దూరంలో, ‘ రియాసి’ జిల్లాలలో వున్న ‘ రంసూ’ గ్రామానికి […]