April 25, 2024

18. భారత నారీ నీకు జోహార్లు

రచన: ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి

 

“సావిత్రి భర్త పోయాడట “  అంటూ వచ్చింది పద్మ.

కంప్యూటర్ లో statement  చూస్తున్న శాంతి తలెత్తింది” ఎప్పుడు?” అడిగింది బాధగా.

“ఈ రోజే ఉదయం 6. ౦౦ గంటలకిట” అని  ‘వెళదామా’ అడిగింది.

తలూపింది శాంతి.

కంప్యూటర్ క్లోజ్ చేసి, పై ఆఫీసర్ పర్మిషన్ అడిగి బయలుదేరింది.

పద్మ ఇంకో ఇద్దరు లేడీస్  తో వచ్చింది.

గతం కళ్ళముందు మెదిలింది శాంతకి,

రెండు నెలలక్రితం ఆరోజూ పద్మే తీసుకోచింది న్యూస్.

‘సావిత్రి ఉద్యోగం మానేస్తుందిట   తెలుసా ‘అడిగింది లంచ్ లో.

‘ఎందుకూ” అంది శాంతి ఆశ్చర్యముగా.

అదొక గవర్నమేంట్ ఆఫీస్.  కొత్తగా రికార్డు అసిస్టెంట్ గా  చేరింది సావిత్రి.  ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం దొరకటమే కష్టం.  అలాటిది వచ్చిన ఉద్యోగం వదులుకోవటం అంటే అవివేకము, ఆశ్చర్యమేగా.  పోనీ బాగా చదువుకున్న మనిషీ కాదు.   ఇంకోటి వస్తుంది అనుకోవటానికి.  పదవ తరగతి వరకే  చదివింది.  ఇది రావటమే ఎక్కువ.

ఆఫీస్ లో ఎవరితోనయినా సమస్యా?లేక పనిలో ఏమైనా సమస్యా?

విషయం కనుక్కొని తీర్చేదైతే తీర్చాలి అనుకుంది.

ఎందుకంటే సావిత్రి మంచి మనిషి.  ఎవరేమి చెప్పిన నా పని కాదు అనకుండా చేసేది.  అందరితో స్నేహంగా ఉంటూ, అవసరమైతే సహాయపడుతుంది కుడా.  ఆమె అంటే అందరికీ ఇష్టమే.  అంతేకాక శాంతి లేడీస్ రేప్రేసెంట్ కూడా,

అందుకే లంచ్ లో సావిత్రి దగ్గరకు వెళ్లి కారణం అడిగింది.  మొదట “ఏమీ లేదంది”.  తటపటాయించింది.  చివరికి శాంతి ఒత్తిడి మీద చెప్పసాగింది.

వాళ్ళది లవ్ మ్యారేజ్.  ఇరువైపులా ఒప్పుకోలేదుట. భర్త ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం.  వచ్చినదానితో రోజులు బానే నడుస్తున్నాయి.  మెల్లగా అందరినీ కలుపుకోవచ్చు ఇరువైపులా వారినీ అనుకుంటున్నా సమయములో భర్తకి “కాన్సర్”  అని తెలిసింది.  ముదిరిపాయిందిట కూడా.  జీతనష్టంమీద ఉన్నాడు.

ఇంతలో అదృష్టవశాత్తూ తనకి ఈ ఉద్యోగం దొరికింది.

ఇంటిపని, ఆఫీస్ పని, హాస్పటల్ పని, భర్త పని ఇన్నటి తోటి సతమతమవుతున్న, ధైర్యం చెప్పేవాళ్ళు, సాయం చేసేవాళ్ళు లేకున్నా నెట్టుకొస్తోంది రోజులు.

కాని పరిస్తితి మారింది. అనారోగ్యం,అయినవాళ్ళు దూరంకావటం తను లేకపోతే తనను నమ్ముకుని అందరికి దూరమయి వచ్చిన భార్య పరిస్తితి ఏమిటి అనే చింత. వీటన్నిటితో డిప్రెషన్ కి లోనయ్యాడు భర్త.  అతనిని ఓదార్చటం కష్టమయి పోతోంది.  పైనించి తను వచ్చేస్తే ఉండే ఒంటరితనంతో  క్రుంగిపోతున్నాడు.

“పోనీ శలవు పెట్టచుగా” అనబోయింది శాంతి. కాని శాంతకి పరిస్తితి తెలుసు.  పద్మ  కొత్తగాచేరింది.  శలవలు, పెర్మిషన్లు ఎక్కువ దొరకవు                                                                                                                        అయినా ఆమెది  ఒకటి రెండు రోజుల సమస్య కాదుగా ఎవరయినా జాలిపడాలన్నా. అందుకే ఈ నిర్ణయం తీసుకుంది పద్మ

“మరి ఖర్చు ఎలా “అడిగింది.

పైకి చూపించి దణ్ణం పెట్టింది. ఇక చేసేది ఏమీ లేక సీట్ కి వచ్చేసింది శాంతా. అడపా తడప తోచిన సాయం చేసేది.

మూర్తీభవించిన దైన్యముల ఉన్న ఆమెని చూసి అందరికి కడుపు తరుక్కుపోయింది.  అందరిలోనూ అదే ఆలోచన.  ఆమె భవిష్యత్ ఏమిటి?భర్త పోయాడు.  ఉద్యోగం  వదులుకుంది ఇరుపక్కలా ఆదుకునేవారూ లేరు. చదువూ లేదు మల్లి ఉద్యోగం దొరకాలంటే ఎంత కష్టం?

ఆమె చేసింది కొద్దిరోజులైనా అందరికి తలలో నాలికలా ఉండేది.  కలిసి పోయింది.  అందుకే  రిజైన్ చేసినా  అందరు చూడతటానికి వచ్చారు.

మనసులో మాట దాచుకోలేని పద్మ అనేసింది.  ”అప్పుడు ఉద్యోగం మానద్దని చెబితే వినలేదు.  ఇప్పుడు చూడు.  మూడునేలల్లోనే పోతాడని తెలియదు నిజమే కాని, సీరియస్సు,  కొద్దికాలమే అనైతే తెలుసుకదా.  కొద్దిరోజులకోసం మంచి భవిష్యత్ ఒదులుకున్నావు “అంది.

అందరూ అదే అభిప్రాయం తిప్పితిప్పి చెప్పారు.  చాలసేపటి వరకూ మాట్లాడని సావిత్రి చివరికి తలెత్తింది.

“కాని నేను అలా అనుకోవటం లేదు. కొద్దిరోజులైనా ఆయనకి దగ్గరగా ఉన్నాను. సేవచేసి, మనసుకు శాంతి      కలిగించగలిగాను కొంతవరకైనా అనిపిస్తోంది. ఈ పని అంతకు ముందే ఎందుకు చేయలేదా  అని బాధగా ఉంది.” అంది.

భారత స్త్రీ ఔన్నత్యానికి ప్రతీకలా ఉన్న పద్మను చూస్తూ అలాగే ఉండిపోయారు అందరూ.

 

 

————————

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

1 thought on “18. భారత నారీ నీకు జోహార్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *