February 21, 2024

32. ఆడతనం ఓడింది … అమ్మతనం ..గెలిచింది !?

రచన: సాయిగోపాల్ రాచూరి   ఈ మధ్య నా మనసేమీ బాగుండటం లేదు ,..అల్లకల్లోలం గా వుంది ,ఏ పని సరిగా చేయలేకపోతున్నా ..ఏదో అలజడి ..ఏదో అసంతృప్తి ,ఎంతకూ తెగని ఆలోచనల ప్రవాహంలో కాస్సేపు అటు ..కాస్సేపు ఇటు కొట్టుకు పోతున్నాను . అన్యమనస్కంగా ఉంటున్నానని ‘ చీవాట్లు ‘ కూడా తింటున్నాను ,ఏం చెయ్యను ? సాధారణం గా  నేను ఏ విషయం పట్టించుకోను , నా భర్త ,నా పిల్లడు ,నా ఇల్లు […]

31. స్నేహానికన్న మిన్న…

రచన: శైలజ ఉప్పులూరి   అన్నయ్యా! బాగున్నారా? మన పిల్లలిద్దరు అమెరికా నుండి ఎల్లుండికి ఇక్కడకు చేరతారుట.  సూర్యా ద్వారా మీకు కూడా ఈపాటికి విషయం  తెలిసే ఉంటుంది. మరి రాత్రి రైలుకు వదినగారితోపాటు మా ఇంటికొచ్చేయండి. మనమంతా కలసి చాలా రోజులయ్యింది, సరేనా? ఉంటాను మరే విషయం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫోను పెట్టేసింది ప్రభావతి. ఏలూరులో బ్యాంకాఫీసరుగా  పనిచేస్తున్న నరేంద్రగారితో మట్లాడింది ప్రభావతి. ఎనిమిదేళ్ళ క్రితం క్రిందట కామారెడ్డి దగ్గర ఉన్న ధరూర్ విలేజ్ […]

30. రామక్కవ్వ

రచన: RC కృష్ణస్వామిరాజు   రామక్కవ్వ తన  తిత్తి లోని పొగాకు చెక్కల్ని నముల్తూ రెడ్డోళ్ళ బావి కాడ నిలబడి ఆకాశం కేసి పదే పదే చూస్తోమ్ది. మిట్ట మధ్యాహ్నం మూడు గంటలైనా   కాలికి చెప్పులైనా  లేకుండా ఆకాశాన్ని చూసి చూసి విసిగింది. తల దించి నీళ్లు లేక ఎండిపోతున్న  తన సెనిక్కాయల కయ్యిల్నిచూస్తూ ఏడుపుమొఖంతో నిలబడి ఉంది. నాలుగు మూరల నారాయణవనం పంచె కట్టి సైకిల్లో సర సర పోతున్న సాంగెన్నని  తన  ఎడమ చేతితో […]

29. మరో అవకాశం.

రచన: గంటి భానుమతి   నా ఎదురుగా ఆ అమ్మాయి . రెండు రోజుల క్రితం పేపర్లలో, టీవీల్లో కనిపించిన అమ్మాయి. నీట్ పరీక్షలే జీవితం అనుకున్న అమ్మాయి, అందులో క్వాలిఫై అవలేదు కాబట్టి, జీవించడం దండగ అనుకున్న అమ్మాయి, ఓ పదంతస్థుల భవనం మీద నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకోడానికి సిద్ధపడ్డ  అమ్మాయి. సెక్యూరిటీ గార్డు చూడకపోతే , మార్చ్యూరిలో ఉండాల్సిన అమ్మాయి, కానీ ఇప్పుడు మాత్రం నా ఎదురుగా తల దించుకుని ఉంది. […]

28. అనుబంధాల అల్లికలు

రచన: కురువ శ్రీనివాసులు   “వంశీ… నాన్నా వంశీ…” “వస్తున్నా తాతయ్య…… ఏమిటి తాతయ్య…” “నాన్నొచ్చారా…?” “ఆ… ఇందాకె వచ్చారు తాతయ్య….” “అలాగా… ఓసారి మీ నాన్నమ్మను పిలు” మనసులో ఎదో తెలియని కలవరం… తెచ్చుంటాడా…? తెచ్చేవుంటాడ్లే.. మూడు నెలలుగా ఎదురుచూస్తున్నానని తెలుసుగా వాడికి… నా కొడుకని కాదుగాని…అబ్బాయి రాజేష్ చాలా మంచివాడు… ఒక్క దురలవాటు లేదు… ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్… నిజాయితీగా ఉంటాడు… వాడికి తగ్గట్టే మంచి భార్య దొరికింది…  పేరు వసుంధర… తనూ […]

27. మనసును కుదిపిన వేళ

రచన: PVV. సత్యనారాయణ తిరుపతి నుండి బస్ లో విశాఖపట్టణం తిరిగివస్తున్నాను నేను. నిద్రపోతున్నదానిని కాస్తా, ఏదో కలకలంతో మెలకువ వచ్చేసింది. బస్ ఆగి ఉంది. సమయం ఎంతయిందో తెలియదు. చుట్టూ చిమ్మచీకటి. అంతవరకు ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణం హఠాత్తుగా భీభత్సంగా మారిపోయింది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో ఆకాశం బ్రద్దలవుతున్నట్టుగా ఉంది. కుంభవృష్టి, తుఫాను వాతావరణమూను. వీస్తూన్న పెనుగాలులకు బస్ ఊగిపోతోంది. ముందుకు సాగలేక అరగంట సేపట్నుంచీ బస్ ఆగిపోయిందట. అక్కడే తెల్లవారిపోయింది. వాతావరణం కొంత తెరపిచ్చినా, […]

26. మరో సరికొత్త ఫేషన్

రచన: పెయ్యేటి శ్రీదేవి   ‘ఊ……రైట్ తీసుకో, లెఫ్ట్, మళ్ళీ రైట్ తీసుకో…….మళ్ళీ లెఫ్ట్.  యూ టర్న్ తీసుకుని మళ్ళీ లెఫ్ట్, తరవాత రైట్ తీ………..’ ‘ఇక మలుపులు చెప్పకండి మేడమ్.  డెడ్ ఎండ్ కొచ్చేసింది.’ అంది అసిస్టెంట్. ‘అయితే అక్కడ కలిపేసి, బారుగా దువ్వేసి, అటు ఇటు పొట్టిగా మధ్యన కట్ చేసి, నుదుటిమీద కొంచెం కట్ చేసి, చెంపలమీద కొచ్చేలా జుట్టు దువ్వి వదిలెయ్.’ అంటూ అసిస్టెంటుకి చెప్పింది బ్యుటీషియన్. శోభన బ్యూటీపార్లర్ కి వెడితే తలకి వంకర టింకర పాపిడి తీయమని అసిస్టెంటుకి చెప్పటానికి రైట్ తీసుకో, లెఫ్ట్ తీసుకో […]

25. లాస్ట్ డే

రచన: సౌజన్య కిరణ్   అప్పుడే కార్ పార్క్ చేసి దిగిన నాకు దూరం గా వస్తున్న రమ్య కనిపించింది .నేను తనను పిలిచేలోపే తాను నన్ను చూసి గట్టిగా “హాయ్ ..సీత “అని తానే పరుగు లాంటి నడకతో నా దగ్గరకు వచ్చింది.నేను ఎదో అడిగేలోపే తను “ఏంటి …ఈవాళ నువ్వు డ్రైవ్ చేసుకుని వచ్చావు ….రామం గారు ఎక్కడ ? ” అంది రమ్య “రామం కి వాళ్ళ ఆఫీస్ వాళ్ళు తనకు సెండాఫ్ […]

24. లైకా

రచన: విజయలక్ష్మీ పండిట్ ఆ రోజు తెల్లవారక ముందు మా ఇంటి వెనుక తలుపుపై ఏదో గోకుతున్న చప్పుడు . నాకు మెలకువచ్చింది. ఆ గోకుడు శబ్ధం ఆగి ఆగి వినిపిస్తూనేవుంది. మామూలుగ ఆ టైమ్ లో మా అమ్మ లేచే సమయం. అమ్మ లేచింది. హాలులో పడుకున్న నేను మా అక్క ఇద్దరం మేలుకున్నాము ఆ శబ్ధానికి . నాకప్పుడు దాదాపు పద్మాలుగేండ్ల వయసు. అమ్మ వెళ్ళి వెనక భోజనాల గది వంటగది కలిసిన పెద్దహోలు […]

23. నీ తలకాయ్…

రచన: కె. వెంకట సుధాకర్   అమ్మ రాజమండ్రిలో సడన్ గా పెళ్లి చూపులు ఫిక్స్ చేసింది. రేపు ఉదయం 9 గంటలకల్లా రాజమండ్రిలో ఉండాలంది. నేను హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ని. ఆఫీస్ నుంచి డైరెక్టుగా ట్రావెల్స్ వాడి దగ్గరికి వెళ్లి, బ్రతిమాలాడుకుని, సాయంత్రం ఏడు గంటలకు అమీర్ పేటలో దొరికిన బస్సు ఎక్కేసా. నాన్న చిన్నతనంలోనే చనిపోవడంతో, అమ్మ కష్టపడి నన్ను పెంచింది. 35 దాటినా పెళ్లి కాకపోవడంతో అమ్మకు దిగులు పెరిగిపోయింది. నేను […]