April 20, 2024

22. మూగపోయిన మధ్యతరగతి

రచన: పోలంరాజు శారద   “అమ్మాయీ! దరివెం పరిచి ఆరునెలలయినట్టుంది కదే. ఆ తరువాత ఒకసారేమో కనిపించింది. మళ్ళీ ఊ ఆ అని కూడా అనలేదేమే? ఒకసారి డాక్టరమ్మను అడక్క పోయినావుటే. పిల్లదేమో నానాటికి ఆమేన గుమ్మటమాలే తయారవుతోంది.” “అవునత్తా. పోయిన నెల డాక్టరమ్మతో ఆ మాటే అన్నాను. మరో నెల ఆగి పరీక్ష చేస్తానన్నారు. రేపు వంట చేయడానికి వెళ్తాను కదా. మళ్ళొకసారి అడుగుతానులే. ” ఏమిటో మరీ ఈ సూపర్ పంటల వలనట మరీ పదేళ్ళు […]

20. అమ్మ ఒకవైపు… జన్మంతా ఒకవైపు

రచన: డా.జడా సుబ్బారావు కొండమీదనుండి దొర్లించిన బండరాయిలా కాలం ఎవరికోసం ఆగకుండా పరిగెత్తసాగింది. అమ్మ చనిపోయి అప్పుడే అయిదేళ్లు దాటిపోయింది. కాలం గాయాల్ని మాన్పుతుందని అంటారు. నిజమే… మనిషిలేని లోటును  కాలం కొంతవరకు మాన్పించగలిగింది గానీ ఙ్ఞాపకాల్లో జీవించిన అమ్మను పూర్తిగా తుడిచెయ్య లేకపోయింది.  ‘నువ్వెప్పుడూ చదువుల పేరుతో ఇంటిపట్టున లేవు. కనీసం నేను పోయాకైనా ఇంటికొచ్చిపోతుండు’ ఆగి ఆగి మాట్లాడుతూ అమ్మ పోయేముందు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఊహ తెల్సిన దగ్గర్నుంచీ ఎంతో అల్లారుముద్దుగా పెంచింది […]

19. మానవత్వం చిగురించిన వేళ!

రచన:  ప్రతాప వెంకట సుబ్బారాయుడు   నేను ఓ ప్రైవేట్ సంస్థలో ఉన్నత స్థానంలో ఉన్నాను. డబ్బుకు హోదాకు కొదవలేదు. సంవత్సర కాలమంతా మెదడును చిత్రిక పట్టి, ఉదయం నుంచి అర్థరాత్రి దాకా సీట్లకు, కంప్యూటర్లకు అతుక్కుపోయి గొడ్డు(?) చాకిరీ చేస్తాను.  మనిషన్నాక కాస్త ఆటవిడుపు ఉండాలి. మెంటల్ గా రెజువెనేట్ అవ్వాలి. అప్పుడే ద్విగుణీకృత ఉత్సాహంతో పనిచేస్తామన్నది నా పాలసీ! అందుకే మార్చి ఫైనాన్షియల్ టార్గెట్స్ క్లియర్ అయ్యాక ఫ్యామిలీతో పదిరోజులు సెలవు తీసుకుని మన […]

18. భారత నారీ నీకు జోహార్లు

రచన: ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి   “సావిత్రి భర్త పోయాడట “  అంటూ వచ్చింది పద్మ. కంప్యూటర్ లో statement  చూస్తున్న శాంతి తలెత్తింది” ఎప్పుడు?” అడిగింది బాధగా. “ఈ రోజే ఉదయం 6. ౦౦ గంటలకిట” అని  ‘వెళదామా’ అడిగింది. తలూపింది శాంతి. కంప్యూటర్ క్లోజ్ చేసి, పై ఆఫీసర్ పర్మిషన్ అడిగి బయలుదేరింది. పద్మ ఇంకో ఇద్దరు లేడీస్  తో వచ్చింది. గతం కళ్ళముందు మెదిలింది శాంతకి, రెండు నెలలక్రితం ఆరోజూ పద్మే తీసుకోచింది […]

17. మల్లె పువ్వు

రచన: పాండ్రంకి సుబ్రమణి కట్టడాలు భారీ యెత్తున జరుగుతూన్న పొరుగూరుకి వెళ్ళి తోటి తాపీ పనివాళ్ళతో కలసి పనులు పూర్తి చేసుకుని యెట్ట కేలకు తెరపి కలిగి పెళ్ళాం బిడ్డల్ని చూసిపోవడానికి మర్రిపాలెం వస్తున్నాడు చంద్రప్పడు. నిజానికి అతడు మూడు నెలల తర వాత వస్తున్నాడు. మొగడి రాక గురించి విన్న మంగమ్మకు మనసు మనసులో లేకుండా పోయింది,కాలు కాలిన పిల్లిలా ఇంటి చుట్టూ తిరిగి పోపుడబ్బాలలో చిల్లర చిల్లరగా మిగిలిన డబ్బుల్ని యేరి కూర్చి భర్తకు […]

16. అమూల్యం

రచన:  భాస్కరలక్ష్మి కర్రా “ టింగ్ టాంగ్ “ అంటూ ఆపకుండా మొగుతున్న డోర్ బెల్ మోతకి లేవడం ఇష్టం లేకపోయినా లేచాను.  టైం చూస్తే పది దాటింది.  డోర్ తీయగానే అపార్ట్మెంట్ వాచమన్. “ఏంటి వినయ్ బాబు,  ఎన్ని సార్లు బెల్లు నొక్కానో తెల్సా. మీ అమ్మగారు నాన్నగారు నాకు పొద్దునుండి పదిసార్లు ఫోన్ చేసారు.  మీకు రాత్రినుండి కాల్ చేస్తుంటే,  ఫోన్ ఎత్తట్లేదని వాళ్ళు ఒకటే కంగారు పడుతున్నారు .  ఒంట్లో బానే ఉందా […]

15. పధకం .

రచన: ఆదూరి హైమవతి   అనగనగా  అనురూప రాజ్యాన్ని అఖండసేనుడనే రాజు  పాలించే వాడు.  ఆయన ఏలుబడిలో ప్రజలు  ఏ కష్టాలూ లేకుండా సుఖంగా జీవించసాగారు.     అనురూప రాజ్యంలో విద్యానాధుడు అనే ఒక ఆచార్యుడు ఉండేవాడు.  ఆయన గురుకులంలో విద్య అభ్యసించిన వారంతా అన్ని విద్యల్లో ఆరితేరి ప్రఙ్ఞావంతు లుగా పేరుగాంచేవారు.  ఏదో ఒక వృత్తిలో రాణిస్తూ మానవసేవా దృక్పధంతో జీవించేవారు.  విద్యానాధుని వద్ద విద్యకోసం దేశం నలుమూలలనుంచీ ధనిక, పేద కుటుంబాల బాలురు చాలా మంది […]

14. వింత కాపురం. . !

రచన:  ఆకుల రాఘవ ప్రపంచంలో ఈయన లాంటి మనిషి ఎక్కడైనా ఉంటాడా?  ఏమో. . ?  నాకైతే ఎక్కడ తారసపడలేదు.  ఇప్పుడు మాత్రం నేను ఈయనతో అనుభవిస్తున్నాను. అతనితో నా పెళ్లి జరిగేవరకు ఆయనేంటో నాకెలా తెలుస్తుంది?  అతని చిన్ననాటి జీవితం ఎలావుందో. . . కాని,  పెళ్లి అయిన తరువాత తెలిసి వచ్చింది! ఎప్పుడు ఎలా ఉంటారో?  ఎప్పుడు ఎలా మారుతారో? ఆయనను సృష్టించిన ఆ బ్రహ్మ దేవుడుకి కూడా తెలియదు కాబోలు!  నేను మాత్రం […]

13. ఓన్లీ ఒన్ పీస్

రచన:  చెంగల్వల కామేశ్వరి చిలకాకుపచ్చ జలతారు మెరుపుల చీరకున్న బంగారు నెమళ్ల  పైటకొంగును అలా అలవోకగా భుజాల మీదనుంచి జారు పైటగా జాలువారుస్తూ కనుకొలకులతో ఓరచూపు సంధించిన గీత పెదాలు గర్వంతో విచ్చుకున్నాయి. తననే పట్టిపట్టి చూస్తున్న వాళ్లందర్నీ గమనించుకుంటూ పొంగిపోతున్న గీతని చూసి,  ఈ చీరలో బంగారు చిలకలా ఉన్నావు తెలుసా ! మెల్లగా గుసగుసలాడాడు. సుధాకర్ గీతకే వినిపించేలా! భర్త మాటకు ఆతిశయంగా, “హమ్మయ్యా మీకు నచ్చింది. మీరుకొన్న పచ్చల సెట్ కి బాగా సూటవుతుందనే […]

12. శ్రద్ధయా లభతే విద్యా

  రచన: సాలగ్రామ ఎస్. ఎస్. ఎస్. వి. లక్ష్మణమూర్తి   జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణమంతా రంగు రంగుల దుస్తుల ధరించి వచ్చిన విద్యార్థులతో సందడిగా ఉంది. కొన్ని సంవత్సరాలు పాటు తమకు చక్కగా పాఠాలు చెప్పడమే కాకుండా సందేహాల నివృత్తి కూడా చేసి,  చదువులో ముందుండేలా ప్రోత్సహించిన ఉపాధ్యాయులకి,  ఆ సంవత్సరం పాఠశాల ను విడిచిపెడుతున్న విద్యార్థులంతా కృతజ్ఞతా పూర్వకంగా ఏర్పాటు చేసుకున్న వీడ్కోలు వేడుక కోసమే ఈ సందడంతా… రజని ప్రార్ధనా గీతంతో […]