April 25, 2024

శివ ఖోడి ( గుహ )

రచన: కర్రానాగలక్ష్మి భక్తునికి భయపడి గుహలో దాక్కున్న శివుడి గురించి విన్నారా?. ఎవరైనా శతృవుకి భయ పడతారు కాని భక్తుడికి భయపడడమా? అదీ ముల్లోకాలను కాపాడే పరమ శివుడు భక్తునికి భయపడి గుహలో దాక్కోడమా?, అదెలా జరిగింది, ఎక్కడ జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం యెందుకు పూర్తిగా యీ వ్యాసం చదవండి. మీకే తెలుస్తుంది. ఉత్తర భారత రాష్ట్రమైన జమ్మూ కశ్మీరులో జమ్మూ నగరానికి 110 కిమీ..దూరంలో, ‘ రియాసి’ జిల్లాలలో వున్న ‘ రంసూ’ గ్రామానికి […]

ఉదంకుడు

అంబడిపూడి శ్యామసుందర రావు. పురాణకాలములో భారతావనిలో అనేక మంది మహర్షులు ఋషి పుంగవులు ఉండి, వేదానుసారము రాజ్యాలను ఏలే రాజులకు దిశా నిర్దేశించి పాలన సక్రమముగా జరిగేటట్లు సహకరించేవారు. కానీ వారు కూడా కొన్ని సందర్భాలలో కోపతాపాలకు సామాన్యువలే గురై ప్రవర్తించేవారు. అటువంటి ఋషులలో ఉదంకుడు గురించి తెలుసుకుందాము. ఉదంకుడు వ్యాసుని శిష్యులలో ఒకరైన పైలుడి శిష్యుడు. ఉదంకుడు గురువును భక్తితో సేవించి అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, మహిమ, ఈశత్వం, వశిత్వం, కామన సాయిత ఆనే […]

సంఘర్షణ

రచన: వంజారి రోహిణి     ” నిరంతర ఘర్షణ క్షణ క్షణం కీచులాట నాలోని నాస్తిక, ఆస్తికత్వాలకు… తక్కెడలో తూకపు వస్తువుల్లా ఒకసారి నాస్తికత్వం పైకొస్తే మరోసారి ఆస్తికత్వానిది పై చేయి అవుతుంది… అరాచకాలు,అబలల ఆక్రందనలు, పసిమొగ్గల చిదిమివేతలు చూసినపుడు మనిషి ఉలితో చెక్కి దేవుణ్ణి చేసిన రాతిబొమ్మ హృదయం లేని పాషాణమే అని నాలోని నాస్తికత్వం వేదనతో గొంతు చించుకుంటుంది… మళ్ళీ ఎక్కడో ఓ చోట ఓ కామాంధుడికి శిక్ష పడి ధర్మం గెలిచిన […]

నానీలు

  రచన: అద్విత శ్రీరాగం   1 . నీ కోసం నా కనుల పుష్పాలు వికసించాయి అన్వేషణ పరిమళాలతోనే . 2 . నీ అడుగులు నా హృదయంలో ధ్వనిస్తున్నాయి నేను పరచిన పూలమీద . 3 . నా ఓణీ గాలితో  ఏదో ఊసులాడుతోంది మేఘ సందేశం పంపటానికి. 4 . మౌనం నాకెంత ఇష్టమో ! హృదయ పత్రంపై ప్రేమలేఖ రాయటం . 5 . ప్రయాణం గమ్యం నీవే సౌమ్యం నీవే […]