April 19, 2024

మాలిక పత్రిక ఆగస్టు 2019 సంచికు స్వాగతం

Jyothivalaboju Chief Editor and Content Head ప్రియ పాఠక మిత్రులు, రచయితలకు  శ్రావణ మాసంతో పాటు రాబోయే పండగల శుభాకాంక్షలు. గత నెలలో చాలామంది ప్రముఖులు ఈ లోకం వీడిపోయారు. వారందరికీ మనఃఫూర్వక శ్రద్ధాంజలి అర్పిస్తూ, వారు చెప్పిన మంచిమాటలను మననం చేసుకుంటూ, వీలైతే పాటిస్తూ ఉందాం.. ఈ మాసంలో కూడా మీ అందరికోసం మంచి మంచి కథలు, సీరియల్స్, కవితలు, వ్యాసాలు అందిస్తున్నాము. రాబోయే రోజుల్లో మాలిక పత్రికలో కొన్ని మార్పులు చేయాలని ఆలోచిస్తున్నాను. […]

“స్వచ్ఛ” తరం

రచన: జ్యోతి వలబోజు “విజయా!! విజయా!” గట్టిగా అరుస్తూ ఇంట్లోకొచ్చాడు నరహరి. భర్త కోసం ఎదురుచూస్తూ టీవీ సీరియల్ చూస్తున్న విజయ గభాల్న లేచి వచ్చింది. “ఏంటీ పెద్దమనిషి? ఎప్పుడు లేనిది ఇవాళ చాలా కోపంగా ఉన్నట్టున్నాడు” అనుకుంది. గట్టిగా చప్పుడొచ్చేలా అడుగులేస్తూ హాల్లోకి వచ్చి కోపంగా చూసాడు భార్యను. “ఏమైందండి? ఎందుకలా కోపంగా ఉన్నారు? మీ స్నేహితులతో పార్టీ అని వెళ్లారుగా? అక్కడ ఏదైనా గొడవ జరిగిందా?” “ఫ్రెండ్స్ కాదు నీ పిల్లలే .. వాళ్లకు […]

గిలకమ్మ కతలు – బాతుగుడ్డెక్కిన కోడి

రచన: కన్నెగంటి అనసూయ “ అయినియ్యా రాతలు..? తెల్లారగట్టనగా మొదలెట్టేవ్ రాత్తం. అదేదో దేశాన్నుద్దరిత్తాకి పేద్ద పేద్ద డాట్రు సదువులు సదుంతున్నట్టు. ఏం రాతలో ఏవో..! ఇయ్యేటికవుతయ్యో లేదో బాబా..” గుల్లుప్పోసి కుండలో లోపలకంటా కూరిన పిక్కల్దీసిన సింతపండుని సిన్న డబ్బాలోకి తీసుకొత్తాకి మూలగదిలోకెల్లి వత్తా వత్తా..అక్కడే కింద వసారాలో మడిగాళ్ళేసుకుని కూకుని ఓమొర్కులో ములిగిపోయిన గిలక్కేసి సూత్తా ఇసుగ్గా అంది సరోజ్ని. “య్యే..! దానిపని నీకేవొచ్చిందే సరోజ్నే రాస్కోనివ్వక? కొండల్ని గుండగొట్టాలా యేటది?మల్లీ ఏవన్నా అంటే […]

చీకటి మూసిన ఏకాంతం – 4

రచన: మన్నెం శారద సూర్యుడు పుడమి రేఖని దాటి బయటపడలేదు గాని తూర్పు ఎర్రబడుతోంది. అతని ఆగమనాన్ని సూచిస్తూ. సముద్రం చిన్నపిల్లలా కేరింతలు కొడుతోంది. కెరటాలు నురుగుపై పడిన ఎర్రని కాంతి ముడి విడిపడిన పగడాల మూటలా చెదరిపోతున్నది. నిశాంత మెల్లిగా ఇసుకలో అడుగులేసి నడుస్తూ ఒక చోట ఆగిపోయింది. అక్కడ సముద్రానికభిముఖంగా కూర్చుని గొంతెత్తి భూపాల రాగమాలపిస్తున్నాడు హితేంద్ర. అతని కంఠం వడిలో దూకే జలపాతంగా, సుడిలో చిక్కుకున్న గోదారిలా అనంతమైన ఆకాశాన్ని అందుకోవాలని ఆరాటపడి […]

పరికిణీ

రచన: కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్ “అమ్మా..! రా అమ్మా..! కేక్ కట్ చేద్దూగానీ..  లేమ్మా.. నీకోసం కేక్ తెచ్చానమ్మా ” బ్రతిమాలుతోంది అమాయకంగా పర్ణిక, బెడ్రూం లో నిస్తేజంగా పడుకుని ఉన్న జయంతిని. ” ప్లీజ్ పర్ణిక నాకు ఇష్టం లేదు… గెట్ లాస్ట్ , ప్లీజ్ లీవ్ మి ఎలోన్” , హిస్టీరిక్ గా అరిచింది జయంతి.  ఎప్పుడూ పల్లెత్తు మాట అనని అమ్మ అలా అరిచే సరికి విస్తుపోయింది పదకొండేళ్ళ పర్ణిక. అంతలో వాకిలి తలుపు […]

జలజం టీవీ వంట.

రచన: గిరిజరాణి కలవల ” ఆహా.. నా వంటా…ఓహో..నే..తింటా” టివీ షో వారిని ఎప్పుడో.. మన జూలీ తన ఇంటికి రమ్మని పెట్టుకున్న పిలుపు.. ఈనాటికి వాళ్ళు కరుణించి.. ఫలానా రోజున మీ ఇంటికి వస్తాము.. మంచి వంట చేయండి.. రికార్డు చేస్తామని కబురు చేసారు. ఇక మన జూలీ మొహం చూడాలి.. ఆనందంతో తబ్బిబ్బు అయిపోయింది.. వీధి మొత్తం టాంటాం టముకు వేసి చెప్పింది. మూతి ముఫ్ఫై సార్లు తిప్పుకున్నవారు కొందరైతే.. ఆ.. ఇంతే.. ఇలాగే […]

అమ్మమ్మ – 5

రచన: గిరిజ పీసపాటి నాగ తమ ఇంటిలో అద్దెకు ఉంటున్న వారి కుటుంబంలో వారి పాపలాగా కలిసిపోయింది. ఆ అద్దెకుంటున్న వారికి‌ ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు సంతానం. బొటాబొటీగా వచ్చే ఆదాయంలో గుట్టుగా బతుకుతున్న మంచి మనసున్న మనుషులు. వారి ఆఖరి అమ్మాయి నాగ కన్నా మూడు లేక నాలుగేళ్ళు పెద్ద ఉండొచ్చు. అందరికన్నా పెద్దబ్బాయికి వివాహం కూడా అయింది. ఆయన భార్య చాలా మంచి ఇల్లాలు. మగ పిల్లలందరినీ అన్నయ్యా అనీ, ఆడపిల్లలందరినీ అక్కయ్యా […]

చీకటిలో చిరుదివ్వె

రచన: మణికుమారి గోవిందరాజుల పడక్కుర్చీలో కూర్చుని ఊగుతూ తన జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నది శాంత.. చేతిలో తమ్ముడు ఎర్రడు రాసిన వుత్తరం అలానే ఉంది. అప్పటికి ఎన్నిసార్లు చదివిందో. చదివిన ప్రతిసారీ గుండెల్లో బాధ రెట్టింపవుతున్నది.. ఏడాదిగా మర్చిపోయిన గతాన్ని అది కూకటి వేళ్ళతో పైకి లాగుతున్నది.వద్దనుకున్న బంధాలను వదిలించుకోలేవంటున్నది. బాధ పడటం నీ జన్మహక్కు..కాదనుకుంటే కుదరదంటున్నది. కళ్ళల్లోనుండి నీళ్ళు కారుతున్నది కూడా తెలియటం లేదు. ఇంతలో లాండ్ లైన్ ఫోన్ మోగింది. కళ్ళుతుడుచుకుని యెవరా అని […]

కంభంపాటి కథలు – సీక్రెట్

రచన: రవీంద్ర కంభంపాటి హ్యుండాయ్ వెర్నా కారు హుషారుగా డ్రైవ్ చేస్తున్న వసంత్ బయట కురుస్తున్న వర్షాన్ని చూస్తూ ‘వావ్ ..వెదర్ భలే రొమాంటిగ్గా ఉంది కద’ అన్నాడు. ‘అందుకేగా సరదాగా బయటికి వెళదామని అడిగింది…ఏసీ తగ్గించండి .. కొంచెం చలిగా ఉంది ‘ కొంటెగా నవ్వుతూ దగ్గిరికి జరిగింది సుమ ‘చలిగానే ఉండనీ .. నువ్వు దగ్గిరకి జరిగితే వేడి పెరిగింది ‘ ఎడం చేత్తో సుమ నడుం చుట్టూ చెయ్యేస్తూ, నవ్వేడు వసంత్ అంత […]

అమ్మడు

రచన: డా. కె. మీరాబాయి ” అమ్మడు వెళ్ళిపోయాక నాకు పిచ్చెక్కినట్టు వుంది ” అన్న అక్క స్నేహితురాలి మాటలు వినబడి అక్కడే ఆగాడు నిఖిల్. ” నిజమే . ఇంట్లో వున్నంత సేపూ మన చుట్టు తిరుగుతూ వుండి అలవాటైన వాళ్ళు వూరెళ్ళితే దిక్కు తోచదు ప్రమీలా .” ఆక్క ఒదార్పుగా అంది. ” అసలే జనముద్దు పిల్ల. అందులోను వయసులో వుంది .నల్లని కళ్ళు, తెల్లని ఒళ్ళు . కాస్త పొట్టిగా బొద్దుగా వున్నా […]