June 19, 2024

కాశీలోని 12 సూర్యుని ఆలయాలు

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు.

 

మన పురాణాలలో వేదాలలో 12 సూర్యుని ఆలయాల ప్రస్తావన ఉంది. మన కాల నిర్ణయం
లో నెలల విభజన సూర్యుడు ఉండే నక్షత్రాల రాసుల బట్టి నిర్ణయించబడింది మన
పురాణ కాలమునుండి ఉన్న నగరము కాశీ ఈ నగరానికి ఏంతో ప్రాముఖ్యత ఉంది ఈ
కాశీ నగరము శివుని త్రిసూలం పై సమతుల్యముగా ఉండటం వలన వేద కాలము నుండి
భౌగోళికంగా ఎన్ని మార్పులు వచ్చిన దాని ప్రాముఖ్యత కోల్పోకుండా
వస్తుంది. సూర్యునికి సంబంధించిన 12 దేవాలయాలు ఒక్క కాశీలోని ఉండటం కాశి
నగరము యొక్క ప్రాముఖ్యత లేదా విశిష్టత ను తెలియజేస్తుంది . ఈ వ్యాసములో ఆ
పన్నెండు సూర్య దేవాలయాల గురించి క్లుప్తముగా తెలుసుకుందాము. సూర్యుడిని
ఆదిత్యుడు అని కూడా అంటారు అందుచేత కాశీలోని పన్నెండు సూర్య దేవాలయాలను
ఆదిత్య పేరుతొ వ్యవహరిస్తారు. వాటిలో 1.లోలార్కు ఆదిత్య 2.ఉత్తరార్క
ఆదిత్య 3. సాంబ ఆదిత్య 4.ద్రౌపది ఆదిత్య 5. మయూఖ ఆదిత్య 6. ఖకోల్కా
ఆదిత్య 7.అరుణ ఆదిత్య 8.బుధ ఆదిత్య 9. కేశవ ఆదిత్య 10.విమల ఆదిత్య 11.
గంగ ఆదిత్య 12. యమ ఆదిత్య
.సూర్యుడు ప్రధానముగా ఆరోగ్యాన్ని ప్రసాదించే దేవుడు దీనికి నిదర్శనముగా
మన పురాణాలలో దేవతలు లేదా ఋషులు రాజులు వారి వ్యాధులను సూర్యున్ని
ప్రార్ధించినాక తగ్గిన సందర్భాలు ఉన్నాయి పన్నెండు మాసాలలో సూర్యుడు
ఒక్కొక్క రకముగా ఉంటాడు మాఘ మాసములో సూర్యుడు భాగ్యాన్ని అందించి
రుగ్మతలను నయము చేస్తాడు ఫల్గుణ మాసములో స్వస్థత రూపములో చర్మ వ్యాధులను
నయముచేస్తాడు కుష్టు వ్యాధితో బాధపడే ఆపల, సూర్య, ఘోష ,జుహు అనే
రుషికన్యలు స్నానమాడి సూర్యుని పూజించటము వలన రోగములు నుండి విముక్తి
పొంది ఋషి కుమారులను వివాహమాడతారు.
మహాభారత కాలములో శ్రీకృష్ణుడి మనుమడైన అందగాడైన సాంబుడు ముని శాపము వలన
కుష్టు వ్యాధి గ్రస్తుడవుతాడు నారదుని సలహా మేరకు కాశీ వచ్చి సూర్యుని
పూజిస్తూ గంగా స్నానము చేస్తూ ఉండేవాడు క్రమముగా అతనికి కుష్టు వ్యాధి
నయము అవుతుంది కాబట్టి అతనిచే ప్రతిష్టింపబడినదే సాంబ ఆదిత్య దేవాలయము ఈ
గుడికి ఎదురుగా కోనేరు కూడా ఉంటుంది మందిరములో ఆదిత్యునికి ఎదురుగా
సాంబుని విగ్రహము కూడా ఉంటుంది
పురాణకాలములో కాశీ రాజైన దివోదాస్ పరిపాలించేటప్పుడు రాక్షసుల అకృత్యాలు
ఎక్కువగా ఉండేవి ఈ రాక్షసుల అకృత్యాలను ఆగడాలను అరికట్టటానికి సూర్యుడు
విశ్వకర్మకు ఒక రాయిని ఇచ్చి దేవతామూర్తులను తయారుచేయమని చెపుతాడు
విశ్వకర్మ చేసిన దేవతామూర్తులే లోలార్కు ఆలయములో ఉండి లోలార్కు
ఆదిత్యునిగా ప్రసిద్ధి చెందినాయి.ఈ మహిమ గల శిల వల్ల రాక్షసులు
సంహరింపబడ్డారు ఈ దేవాలయానికి దగ్గరలోగల లోలార్కు కుండ్ (సరస్సు) లో
సంతానము లేని దంపతులు స్నానము చేసి సూర్యుని ప్రార్ధిస్తే సంతానము
కలుగుతుందని భక్తుల నమ్మకము.
ద్వాపరయుగములో దుర్యోధనుని వల్ల ఇబ్బందులు పాలైన పాండవులు ద్రౌపదితో కాశీ
చేరారు ద్రౌపది గంగలో స్నానమాచరించి సూర్యుని ప్రార్ధిస్తే సూర్య
భగవానుడు ద్రౌపదికి అక్షయపాత్రను ప్రసాదిస్తాడు ఆ విధముగా ద్రౌపది కాశీలో
సూర్యభగవానునికి కట్టిన దేవాలయము ద్రౌపది ఆదిత్య ఆలయము.ఇక్కడ కూడా ఒక
కుండ్ ఉంది దీనిని ద్రౌపది కుండ్ అంటారు.
ఒకసారి సూర్యుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శించి ఉష్ణ తాపాన్ని పెంచటంతో కాశీ
లోని ప్రజలు ఇబ్బందులు పాలైనారు కాశీ లోని ప్రజలే కాకుండా విశ్వమంతా ఈ
వేడికి బాధపడుతున్నప్పుడు విశ్వనాథుడు సూర్యని వేడిని తగ్గించాడు అప్పుడు
విశ్వమంతా చల్లబడింది ఈ చల్లబడ్డ సూర్యుని కోసము కట్టిన దేవాలయము
“మాయూకేశ్వర దేవాలయము”
యముడు కాశీ వచ్చి గంగలో స్నానమాచరించి సూర్య భగవానుని ప్రజల బాగుకోసము
ప్రార్ధిస్తాడు యముడు సూర్యభగవానుడి విగ్రహాన్ని ప్రతిష్టిస్తాడు కాబట్టి
ఆ సూర్య దేవాలయాన్ని యమాదిత్య దేవాలయముగా వ్యవహరిస్తారు. కార్తీక మాసములో
భక్తులు గంగ లో స్నానము చేసి యమాదిత్యుడిని పూజించి దీపదానము చేస్తారు
అలాచేస్తే మృత్యువు భయము ఉండదు
విమల్ కుష్టువ్యాధితో బాధపడుతూ ఇల్లు వదలి కాశీ చేరుతాడు రోజు గంగా
స్నానం చేస్తూ సుర్యుని ప్రార్ధిస్తూ ఉంటాడు సూర్యుడు అతని భక్తికి
సంతసించి కుష్టు వ్యాధి నుండి విముక్తి చేస్తాడు విమలుడు సూర్యుని పట్ల
తనకున్న భక్తికి నిదర్శనము గా విమలాదిత్య దేవాలయాన్ని నిర్మిస్తాడు.
గంగ నదికి సూర్యునికి విడదీయరాని , మనకు తెలియని సంబంధము ఉన్నది గంగా
స్నానము సూర్యుని ప్రార్ధించటము ఈ రెండు మోక్షసాధనకు మార్గాలు. భగీరధుడి
వెంట వస్తున్న గంగ వేగానికి ఉధృతికి కాశీ కొత్వాల్ అయిన కాలభైరవుడు గంగ
వేగాన్ని తగ్గించమని సూర్యుని ప్రార్ధిస్తాడు ఆ విధముగా కాశీ లో గంగ తన
ఉధృతిని తగ్గించుకొని భగీరధుడి వెంట వెళుతుంది అప్పటి నుండి కాశీ లో
సూర్యుని గంగ దివ్య అర్థమా వైశాఖి పేరుతొ వ్యవహరిస్తూ పూజిస్తారు. చవనుడి
కుమారుడైన మేఘవి 57 ఏళ్లుగా మంజుఘోష చెరలో ఉన్నప్పుడు మునుల సలహా మేరకు
గంగలో స్నానము చేస్తూ సూర్యుని ప్రార్ధించి విడుదల అవుతాడు.
.హరివి అనే ముని వృద్ధాప్యము వల్ల తపస్సు చేయలేని స్థితిలో గంగాస్నానము
చేస్తూ సూర్యుని ప్రార్ధించగా సూర్యుడు కరుణించి ఆ మునిని యవ్వనవంతుడిగా
చేస్తాడు ఆవిధముగా అతనికి జ్ఞాపకార్ధము వృద్ధ ఆదిత్య
దేవాలయాన్నికట్టారు.
శ్రీరాముని పూర్వీకుడైన రాజ్యవర్ధనుడు రాజ్యాన్ని త్యజించి సూర్యని
ఆరాధిస్తూ తనకు వచ్చిన కుష్టు వ్యాధి నుండి విముక్తుడవుతాడు ఆ విధముగా
ఉల్కాదిత్య,అరుణాదిత్య కేశవాదిత్య దేవాలయాలు ప్రతిష్టించబాడ్డాయి కానీ
ప్రస్తుతము ఏంతో ఘనమైన ఈ ఆదిత్య దేవాలయాలు చిన్న మందిరాలుగా
గుర్తించటానికి వీలు లేకుండ నిరాదరణ స్థితిలో ఉన్నాయి .వీటి దర్శనము
కూడా కొత్తవారికి కష్టము కానీ కాశీ యాత్రలో విధిగా చూడవలసిన దేవాలయాలు
(స్థానికుల సహాయముతో)ఇవి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *